టాలీవుడ్

నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్, మైత్రీ మూవీ మేక‌ర్స్  ‘అమిగోస్’ చిత్రంలో హీరోయిన్‌గా ఆషికా రంగ‌నాథ్‌.. పోస్ట‌ర్ విడుద‌ల‌

టాలీవుడ్‌లో డిఫరెంట్ కాన్సెప్ట్ చిత్రాలను చేస్తూ డీసెంట్ ఫ్యాన్ బేస్‌ను క్రియేట్ చేసుకున్న హీరో నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్‌. రీసెంట్‌గా ‘బింబిసార’ చిత్రంతో సూప‌ర్ డూప‌ర్ హిట్ సాధించారు. ఈ భారీ విజ‌యం త‌ర్వాత నంద‌మూరి క‌థానాయ‌కుడు క‌ళ్యాణ్ రామ్ డెబ్యూ డైరెక్ట‌ర్ రాజేంద్ రెడ్డితో ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్ రూపొందుతోన్న ‘అమిగోస్’ అనే చిత్రంలో నటిస్తోన్నారు. స్నేహితుడిని సూచించ‌టానికి ఉపయోగించే స్పానిష్ ప‌దం అమిగోస్‌ను టైటిల్‌గా పెట్ట‌టం వెనుకున్న కార‌ణ‌మేంటా? అనేది అంద‌రిలో క్యూరియాసిటీని పెంచింది. అలాగే రీసెంట్‌గా విడుద‌లైన క‌ళ్యాణ్ రామ్ లుక్‌, టైటిల్ పోస్ట‌ర్‌కు ప్రేక్ష‌కుల నుంచి అమేజింగ్ రెస్పాన్స్ వ‌చ్చింది. ఇందులో క‌ళ్యాణ్ రామ్ మూడు డిఫ‌రెంట్ షేడ్స్‌లో క‌నిపించ‌నున్నార‌నే విష‌యాన్ని ఆ పోస్ట‌ర్ ద్వారా రివీల్ చేశారు.

తాజాగా ఈ సినిమాలో హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఆషికా రంగనాథ్ లుక్ పోస్ట‌ర్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. ఈ చిత్రంలో ఆమె ఇషిక అనే రోల్‌లో క‌నిపించ‌నుంది. క్యూట్ లుక్స్‌తో అషికా రంగ‌నాథ్ ఆక‌ట్టుకుంటుంది. ‘అమిగోస్’ నిర్మాణం ఫైన‌ల్ స్టేజ్‌కు చేరుకుంది. దీంతో పాటు పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌తోనూ టీమ్ బిజీగా ఉంది. ఈ సినిమాను ఫిబ్ర‌వ‌రి 10, 2023న గ్రాండ్ లెవ‌ల్లో విడుద‌ల చేస్తున్నారు.  

ఎన్నో సెన్సేష‌న‌ల్ మూవీస్‌ను అందించిన ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మిస్తోన్న‌ ఈ సినిమాలో క‌ళ్యాణ్ రామ్‌కు జోడీగా ఆషికా రంగ‌నాథ్ న‌టిస్తుంది. జిబ్రాన్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి ఎస్‌.సౌంద‌ర్ రాజ‌న్ సినిమాటోగ్రాఫ‌ర్‌గా.. త‌మ్మిరాజు ఎడిట‌ర్‌గా వర్క్ చేస్తున్నారు.

న‌టీన‌టులు:

నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్‌, ఆషికా రంగ‌నాథ్ త‌దిత‌రులు

TFJA

Recent Posts

ధ‌నుష్‌, కృతి స‌న‌న్ సూప‌ర్బ్ కెమిస్ట్రీతో ఆక‌ట్టుకుంటోన్న ‘అమ‌ర‌కావ్యం’

ధ‌నుష్‌, కృతి స‌న‌న్ సూప‌ర్బ్ కెమిస్ట్రీతో ఆక‌ట్టుకుంటోన్న ‘అమ‌ర‌కావ్యం’ (తేరే ఇష్క్ మై) ట్రైల‌ర్‌.. హిందీతో పాటు త‌మిళ‌, తెలుగులోనూ…

5 hours ago

ఫిబ్రవరి 6, 2026న‌ ‘యుఫోరియా’ గ్రాండ్ రిలీజ్‌

బ్లాక్ బస్టర్ ఫిల్మ్ మేకర్ గుణ శేఖర్ రూపొందిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘యుఫోరియా’. శ్రీమ‌తి రాగిణి గుణ స‌మ‌ర్ప‌ణ‌లో గుణ…

4 days ago

కోయంబత్తూరులోని ఈ యోగ కేంద్రం వద్దనున్న లింగ భైరవి సన్నిధిలో, పవిత్రమైన ‘భూత శుద్ధి వివాహం’ చేసుకున్న సమంత ప్రభు, రాజ్ నిడిమోరు

ప్రముఖ నటి సమంత రూత్ ప్రభు మరియు చలనచిత్ర నిర్మాత, దర్శకుడు రాజ్ నిడిమోరు సోమవారం ఉదయం కోయంబత్తూరులోని ఈశా…

4 days ago

తల్లి చేతుల మీదుగా అవార్డులను అందుకున్న మధుర క్షణాల్ని గుర్తు చేసుకున్న సుప్రీం హీరో సాయి దుర్గ తేజ్

సుప్రీం హీరో సాయి దుర్ఘ తేజ్ తాజాగా వేసిన పోస్ట్ గమనిస్తే తన తల్లిపై ఎంత ప్రేమ ఉందో మరోసారి…

3 weeks ago

“రాజు వెడ్స్ రాంబాయి” మీ హృదయాన్ని తాకే అందమైన ప్రేమ కథ – ట్రైలర్ లాంఛ్ లో హీరో అడివి శేష్

అఖిల్, తేజస్విని జంటగా నటిస్తున్న సినిమా "రాజు వెడ్స్ రాంబాయి". ఈ చిత్రాన్ని ఈటీవీ విన్ ఒరిజినల్స్ ప్రొడక్షన్ ప్రేక్షకుల…

3 weeks ago

‘దేవగుడి’ రియల్ స్టోరి.. కచ్చితంగా పెద్ద సక్సెస్ అవుతుంది – టీజర్ లాంచ్ వేడుకలో హీరో శ్రీకాంత్

కంటెంట్‌ను నమ్ముకుని చెబుతున్నా.. ‘దేవగుడి’తో సక్సెస్ కొడుతున్నాం - నిర్మాత బెల్లం రామకృష్ణా రెడ్డి పుష్యమి ఫిలిం మేకర్స్ బ్యానర్…

3 weeks ago