Categories: Uncategorized

‘ధమాకా’నిర్మాత టిజి విశ్వ ప్రసాద్ ఇంటర్వ్యూ

మాస్ మహారాజా రవితేజ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ ”ధమాకా’.  కమర్షియల్ మేకర్ త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రవితేజ సరసన టాలీవుడ్ ఫేవరేట్ హీరోయిన్ శ్రీలీల హీరోయిన్ గా నటించింది. నిర్మాత టిజి విశ్వ ప్రసాద్  గ్రాండ్ గా నిర్మించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ & అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకాలపై రూపొందిన ఈ చిత్రానికి వివేక్ కూచిభొట్ల సహ నిర్మాత. డిసెంబర్ 23న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘ధమాకా’ అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ధమాకా బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న నేపధ్యంలో నిర్మాత టిజి విశ్వ ప్రసాద్ చిత్ర విజయాన్ని విలేఖరుల సమావేశంలో పంచుకున్నారు.  

ధమాకాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. కంగ్రాట్స్
థాంక్స్ అండీ

ధమాకా ఫస్ట్ డే ఎలా వుంది ?
చాలా బావుందండీ. గ్రాండ్ గా  ఓపెనింగ్స్ వచ్చాయి. అన్ని చోట్ల నుండి అద్భుతమైన స్పందన వస్తోంది.

ధమాకా ప్రాజెక్ట్ ఎలా కుదిరింది ?
దర్శకుడు త్రినాథరావు, రచయిత ప్రసన్న కథ చెప్పారు. ఇది రవితేజ గారికి బావుంటుందని అనుకున్నాం. రవితేజ గారికి నచ్చింది. తర్వాత కథపై పని చేయడం మొదలుపెట్టాం. కోవిడ్ తర్వాత సెట్స్ పైకి తీసుకెళ్ళాం.

పీపుల్స్ మీడియాలో ఇదే పెద్ద బడ్జెట్ ప్రాజెక్ట్ నా ?  
ఇంతకుముందు వెంకీ మామ సినిమాని కూడా సిమిలర్ బడ్జెట్ లోనే చేశాం.

ధమాకా పాటల కోసం భారీ సెట్స్ వేశారు కదా ?
అవునండీ. ధమాకా లో సాంగ్స్ ప్రధానమైనవి. పాటలన్నీ అద్భుతంగా వచ్చాయి. రవితేజ గారు శ్రీలీల డ్యాన్సులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. థియేటర్స్ ప్రేక్షకులు రెస్పాన్స్ అద్భుతంగా వుంది. ఎక్స్ టార్డినరీగా ఎంజాయ్ చేస్తున్నారు. బీ సీ సెంటర్ల రెస్పాన్స్ మేము ఊహించాం. మల్టీప్లెక్స్ ఆడియన్స్ నుండి మేము ఊహించిన దానికంటే ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది.

ప్రాజెక్ట్ లో రవితేజ గారి కోపరేషన్ ఎలా వుంది ?
రవితేజ గారు ఎక్స్ టార్డినరీ పర్సన్. మల్టీ పుల్ సినిమాలు చేస్తున్నప్పటికీ షెడ్యుల్ వారీగా చాలా కంఫర్ట్ బుల్ గా పని చేశాం.

రవితేజ గారు మీ నిర్మాణంలో మళ్ళీ మళ్ళీ చేస్తానని చెప్పారు కదా ?
అవునండీ. కొన్ని ప్రాజెక్ట్స్ ప్లాన్ చేస్తున్నాం.

హీరోయిన్ గా మొదట శ్రీలీలనే సంప్రదించారా ?
అవునండీ. కొన్ని ఆప్షన్లు అనుకున్నప్పటికీ మొదట సంప్రదించింది శ్రీలీలనే.

ఫ్యామిలీ ఆడియన్స్  నుండి ఎలాంటి రెస్పాన్స్ వుంది ?
అద్భుతంగా వుందండీ. ధమాకా కంప్లీట్ ఎంటర్ టైనర్. ఫ్యామిలీ ఆడియన్స్ కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నారు.

కథల విషయంలో మీ ఆలోచనలు ఎలా వుంటాయి ?
ధమాకా కంప్లీట్ మాస్ ఎంటర్ టైనర్ కథ. రవితేజ గారి ఎనర్జీ ని పూర్తిగా ఎక్స్ ప్లోర్ చేస్తూ చేసిన మూవీ. అలాగే ఎవరూ ఊహించని ట్విస్ట్ కూడా వుంది. సినిమాలోని ప్రతి ఎలిమెంట్ ని  ప్రేక్షకులు చాలా ఎంజాయ్ చేస్తున్నారు. థియేటర్స్ నుండి ఎక్స్ ట్రార్డినరీ రెస్పాన్స్ వస్తోంది.

పీపుల్ మీడియా ఫ్యాక్టరీలో చాలా ప్రాజెక్ట్స్ చేస్తున్నారు కదా.. భవిష్యత్ ప్లానింగ్స్ ఎలా వున్నాయి ?
ఒక ఫ్యాక్టరీ మోడల్ లో పని చేయాలనే ఉద్దేశంతోనే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ని మొదలుపెట్టాం. కంటిన్యూస్ సినిమాలు నిర్మిస్తాం. డిఫరెంట్ కంటెంట్ తో మంచి లైనప్ వుంది.  

ఓటీటీ పై కూడా ద్రుష్టి పెట్టినట్లు వున్నారు ?
ఓటీటీకి చాలా కంటెంట్ డెలివర్ చేస్తున్నాం. ఇప్పటికే మూడు ప్రాజెక్ట్స్ ని ఓటీటీ వేదికగా విడుదల చేశాం. ప్రొడక్షన్ లో మరికొన్ని ప్రాజెక్ట్స్ వున్నాయి.

విడుదలకు సిద్ధమౌతున్న చిత్రాలు ?

నాగశౌర్య- శ్రీనివాస్ అవసరాల ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి.. గోపీచంద్ – శ్రీవాస్ కాంబినేషన్ లో రామబాణం .. అలాగే లావణ్య త్రిపాఠితో ఒక ప్రాజెక్ట్ వుంది. తర్వాత కొన్ని పెద్ద చిత్రాలు వున్నాయి. తర్వలోనే ప్రకటిస్తాం.

ఆల్ ది బెస్ట్
థాంక్స్

TFJA

Recent Posts

”తత్వం” సాధించే విజయంతో మా కష్టాలన్నీ మరిచిపోతాం: యువ దర్శకుడు అర్జున్‌ కోలా

అర్జున్‌ కోలా దర్శకత్వంలో దినేష్‌ తేజ్‌, దష్విక.కె హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'తత్వం' త్రయతి ఇషాని క్రియేషన్స్‌, ఎస్‌.కె.ప్రొడక్షన్స్‌…

9 hours ago

తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి

స్నేహా రెడ్డి అంటే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది స్టార్ హీరో అల్లు అర్జున్ భార్యగానే. అయితే ఆమె తనకంటూ…

9 hours ago

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ చిత్రం గొప్ప విజ‌యాన్ని సాధించాల‌ని కోరుకుంటున్నా: ప‌్రీ రిలీజ్ ఈవెంట్‌లో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ను అంద‌రూ థియేట‌ర్స్‌లో ఎంజాయ్ చేస్తారు.. సినిమా పెద్ద హిట్ అవుతుంది: ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి…

9 hours ago

చదలవాడ శ్రీనివాసరావుకు శుభాకాంక్షలు తెలిపిన ఫిలింక్రిటిక్స్ అసోసియేష్‌న్‌

ఇటీవల జరిగిన నిర్మాతల మండలి ఎన్నికల్లో కోశాధికారిగా ఘనవిజయం సాధించినశ్రీ చదలవాడ శ్రీనివాసరావును ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ సీనియర్ సభ్యులు, కార్యవర్గం…

3 weeks ago

‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ ఆనంద్ దేవరకొండ ఫిల్మోగ్రఫీలో ఒక బ్యూటిఫుల్ సినిమాగా నిలుస్తుంది: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ

ఆదిత్య హాసన్ రచన చాలా బాగుంది.. ‘ఎపిక్’ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను: ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా…

3 weeks ago

ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ ద్వారాసెప్టెంబర్ 18న‘పిఠాపురంలో… అలా మొదలైంది’ విడుదల—ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో…

ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం సెప్టెంబర్ 18న…

3 weeks ago