బ్లాక్ బస్టర్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా సమర్పణలో సుమంత్ ప్రభాస్, అనంతిక జంటగా భద్రకాళీ పిక్చర్స్ బ్యానర్ నిర్మిస్తున్న “రోమాంచకం” మూవీ గ్లింప్స్ రిలీజ్

భద్రకాళీ పిక్చర్స్, డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబోలో భారీ పాన్ ఇండియా బ్లాక్ బస్టర్స్ వచ్చాయి. ఈ కాంబోలో ఒక యంగ్ టీమ్ తో ఫ్రెష్ లవ్ స్టోరీ మూవీ వస్తోందంటే ప్రేక్షకులు కొత్తదనం ఆశిస్తారు, స్ట్రాంగ్ కంటెంట్ ఎక్స్ పెక్ట్ చేస్తారు. ప్రేక్షకులు కోరుకునే అలాంటి కొత్తదనంతో యూనిక్ లవ్ స్టోరీగా తెరకెక్కుతోంది “రోమాంచకం” సినిమా. సుమంత్ ప్రభాస్, అనంతిక సనిల్ కుమార్ జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని సందీప్ రెడ్డి వంగా సమర్పిస్తుండగా, ప్రణయ్ రెడ్డి వంగా నిర్మిస్తున్నారు. నూతన దర్శకుడు వేణుగోపాల్ రెడ్డి రూపొందిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన “రోమాంచకం” సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ఆడియెన్స్ ను అట్రాక్ట్ చేసి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది.

ఈ రోజు “రోమాంచకం” సినిమా గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఈ గ్లింప్స్ డీవోపీ పవన్ పప్పుల అందించిన పెయింటింగ్ లాంటి బ్యూటిఫుల్ విజువల్స్ తో , వాసుకి వైభవ్ కంపోజ్ చేసిన స్వీట్ మెలొడియస్ ట్యూన్ తో సాగుతూ హీరోయిన్స్ మధ్య ఉన్న ప్రేమను, వారి మధ్య ఏర్పడిన దూరాన్ని చూపిస్తూ సాగింది. ‘అణువు అణువును ఉర్రూతలూపే ప్రణయ కల్లోలమే — రోమాంచకం, ఊహకే అందని ఉవ్వెత్తునెగిసే ఉత్తుంగ తరంగమే — రోమాంచకం..’ అంటూ గ్లింప్స్ లో వచ్చిన లిరిక్స్ ఈ మూవీ ఎంత వైబ్రేటింగ్ గా ఉండబోతుందో తెలియజేస్తోంది. “రోమాంచకం” సినిమా ప్రేమ, హాస్యం, ఉత్కంఠ కలగలిపి ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించేందుకు వస్తోంది. సుమంత్ ప్రభాస్, అనంతిక జంట కెమిస్ట్రీ ఈ సినిమాకు హైలైట్ గా నిలుస్తోంది. “రోమాంచకం” సినిమా ఒక ఇంట్రెస్టింగ్ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా రూపొందుతోంది.

నటీనటులు – సుమంత్ ప్రభాస్, అనంతిక సనిల్ కుమార్, ఉపేంద్ర లిమయె, వెంకటేష్ కాకుమాను, నరేంద్ర రవి, మణి, సోహన్, తదితరులు

టెక్నికల్ టీమ్

డీవోపీ – పవన్ పప్పుల
మ్యూజిక్ – వాసుకి వైభవ్
పబ్లిసిటీ డిజైనర్: అనిల్ భాను
పీఆర్ఓ – సురేష్ ( ఎస్. కె. మీడియా )
మార్కెటింగ్- వాల్స్ అండ్ ట్రెండ్స్
బ్యానర్ – భద్రకాళీ పిక్చర్స్
ప్రెజెంటర్ – సందీప్ రెడ్డి వంగా
ప్రొడ్యూసర్ – ప్రణయ్ రెడ్డి వంగా
రచన, దర్శకత్వం – వేణుగోపాల్ రెడ్డి

TFJA

Recent Posts

‘పొలిమేర 3’ నుంచి యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా ‘విరావి’ ఫస్ట్ లుక్ విడుదలతెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలకు సిద్ధమవుతున్న ‘పొలిమేర 3..!

మిస్టిక్ థ్రిల్లర్ ఫ్రాంచైజీలో ప్రేక్షకులను ఆకట్టుకున్న 'పొలిమేర' సిరీస్ నుంచి మూడో చిత్రంగా వస్తున్న 'పొలిమేర 3'పై అంచనాలు పెరుగుతున్నాయి.…

10 hours ago

మళ్లీ విద్యార్థినిగా మారిన మంచు లక్ష్మి! హార్వర్డ్ మెడికల్ స్కూల్‌లో ఏం నేర్చుకుంటున్నారు?

మంచు లక్ష్మిని అర్థం చేసుకున్నామనుకునేలోపే, ఆమె మరో కొత్త ఆశ్చర్యానికి తెరతీస్తారు! ఇటీవల ఆమె సోషల్ మీడియాలో కొన్ని ఆసక్తికరమైన…

11 hours ago

‘ఆలోచన’ సినిమా ఈనెల 27న విడుదల..!

పి.ఎస్.జె. ఫిలిమ్స్ అండ్ కో బ్యానర్ మీద ప్రదీప్ కుమార్, గుండబోయిన శ్రీనివాస్ నిర్మాణంలో సురేందర్ చాచా తెరకెక్కించిన చిత్రం…

11 hours ago

సుమ చిత్ర ఆర్ట్స్ సమర్పణలో సుమయా రెడ్డి నుంచి రాబోతోన్న ప్రొడక్షన్ నెం. 2.. త్వరలోనే టైటిల్ అనౌన్స్మెంట్..!

సుమ చిత్ర ఆర్ట్స్ సమర్పణలో సుమయా రెడ్డి స్వీయ నిర్మాణంలో నటిస్తున్న రెండో ప్రాజెక్ట్‌ని త్వరలోనే ప్రకటించనున్నారు. ‘డియర్ ఉమ’…

11 hours ago

ఆది సాయి కుమార్ ‘ఈగో రాజా’ నుంచి ‘రౌడీ రాకాసి’ అంటూ సాగే లవ్ సాంగ్ రిలీజ్

‘శంబాల’ బ్లాక్ బస్టర్ తర్వాత ఆది సాయికుమార్ డిఫరెంట్ సబ్జెక్ట్‌లతో ఆకట్టుకునేందుకు రెడీ అవుతున్నారు. ఈ క్రమంలోనే ‘ఈగో రాజా’…

11 hours ago

దీపావళి సందర్భంగా కార్తీక్ జయంతి ‘రాయవలస’ నుంచి పవర్ ఫుల్ పోస్టర్..!

రేసన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై గోపి కృష్ణ జయంతి నిర్మించిన ‘రాయవలస’ చిత్రానికి రాధిక జయంతి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో…

17 hours ago