అవ్వల్ నంబర్ ప్రొడక్షన్స్ ఎల్ఎల్‌పి బ్యానర్ పై మాధవి రెడ్డి సోమ నిర్మాణంలో రమణా రెడ్డి సోమ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘అమీర్ లోగ్’. ఎంసీ హరి, మనోజ్, శశిధర్ హీరోలుగా నటించిన ఈ చిత్రంలో వేద జలంధర్ , రావణ్ నిట్టూరు, విశ్వేందర్ రెడ్డి, సాయియోగి పలువురు కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీని రానా స్పిరిట్ మీడియా రిలీజ్ చేయబోతోంది. ఈ క్రమంలో నిర్మాత వంశీ నందిపాటి మూవీ టీజర్‌ను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన టీజర్ లాంచ్ ఈవెంట్‌లో..
వంశీ నందిపాటి మాట్లాడుతూ .. ‘‘అమీర్ లోగ్’ మూవీని నేను ఆల్రెడీ చూశాను. డబ్బు పరంగా రిచ్ అని అనుకుంటారు. కానీ స్నేహం, ప్రేమ విషయంలో రిచ్. మిడిల్ క్లాస్ జీవితాల్ని చూపించారు. సినిమాని చూస్తూ నేనెంతో ఎంజాయ్ చేశాను. ఎంతో వైబ్ కనిపించింది. ప్రాపర్ హైదరాబాద్‌ను చూపించిన చిత్రాల జాబితాల్లో ‘అమీర్ లోగ్’ ఉంటుంది. బిల్డింగ్ స్ట్రక్ఛర్ గురించి రమణా రెడ్డి గారిని కలిశాను. ‘అమీర్ లోగ్’తో రమణా రెడ్డి గారు నన్నైతే నిరుత్సాహపర్చలేదు. ఎంతో ఎత్తైన బిల్డింగ్‌లను నిర్మించే రమణా రెడ్డి గారు.. ‘అమీర్ లోగ్’ని అంతే ఎత్తులో నిలబెట్టారు. ఈ చిత్రంలో అందరూ అద్భుతంగా నటించారు. ఇలాంటి ఓ చక్కటి చిత్రానికి స్మరణ్ చక్కటి మ్యూజిక్ ఇచ్చారు. ఇందులోని పది పాటలు అద్భుతంగా ఉంటాయి. ఈ చిత్రంతో ఎంతో మంది కొత్త వాళ్లు తెరకు పరిచయం కాబోతోన్నారు. ఇలాంటి సినిమాలు ఆడితేనే తెలుగు పరిశ్రమ గర్వంగా తలెత్తుకుని తిరుగుతుంది. ఇలాంటి చిత్రాన్ని సపోర్ట్ చేస్తున్న స్పిరిట్ మీడియాకి థాంక్స్’ అని అన్నారు.
దర్శకుడు రమణా రెడ్డి మాట్లాడుతూ .. ‘‘అమీర్ లోగ్’ సినిమా ట్రైలర్ లాంచ్‌కు వచ్చిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. మా కోసం వచ్చి టీజర్‌ను రిలీజ్ చేసిన వంశీ గారికి థాంక్స్. నేను రాసిన కథను నటనతో ఇంకో లెవెల్‌కి తీసుకు వెళ్లిన ఆర్టిస్టులకు థాంక్స్. మా సినిమా అందరినీ అలరిస్తుందని నమ్మకంగా చెబుతున్నాను’ అని అన్నారు.
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సందీప్ మాట్లాడుతూ ..‘‘అమీర్ లోగ్’ టీజర్ లాంచ్ ఈవెంట్‌కు వచ్చిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్’ అని అన్నారు.
కామ్రేడ్ కళ్యాణ్ నిర్మాత వెంకట కృష్ణ మాట్లాడుతూ .. ‘‘అమీర్ లోగ్’ టీజర్ లాంచ్ ఈవెంట్‌కి వచ్చిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. రమణ రెడ్డికి సినిమా పట్ల ఎంతో ప్యాషన్ ఉంది. ఈ టీం అంతా ఎంతో కష్టపడి మూవీని చేసింది. ఇలాంటి ప్రయత్నాన్ని అందరూ సపోర్ట్ చేయాలి. స్మరణ్ గారు మంచి మ్యూజిక్ ఇచ్చారు. ఇలాంటి మూవీకి విజయం దక్కాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ స్మరణ్ సాయి మాట్లాడుతూ .. ‘‘అమీర్ లోగ్’ నాకెంతో ప్రత్యేకం. షూటింగ్ అంతా లంగర్ హౌజ్‌లో, మ్యూజిక్ అంతా కాచిగూడలో జరిగింది. ప్రాపర్ హైదరాబాద్ సినిమా. ఈ మూవీలో బిర్యానీ గురించే ఎక్కువగా ఉంటుంది. అందరూ కొత్త వారే నటించారు. టీజర్ అందరికీ నచ్చే ఉంటుందని భావిస్తున్నాను. ఈ మూవీ అందరినీ ఆకట్టుకునేలా ఉంటుంది’ అని అన్నారు.
మనోహర్ రెడ్డి మాట్లాడుతూ .. ‘‘అమీర్ లోగ్’ సినిమా బాగా వచ్చింది. ఫలితాన్ని ఆడియెన్స్ చెబుతారు. త్వరలోనే మా మూవీని ఆడియెన్స్ ముందుకు తీసుకు వస్తున్నామ’ని అన్నారు.
నటుడు మనోజ్ మాట్లాడుతూ .. ‘‘అమీర్ లోగ్’ టీజర్ లాంచ్‌కి వచ్చిన వంశీ గారికి థాంక్స్. మాకు సపోర్ట్ చేస్తున్న స్పిరిట్ మీడియాకి థాంక్స్. మా అందరినీ ఎంకరేజ్ చేసిన రమణ గారికి థాంక్స్. మాధవి గారి వల్లే ఈ చిత్రం ఇంత బాగా వచ్చింది. స్మరణ్ అన్న మ్యూజిక్ వల్ల మా సినిమా నెక్ట్స్ లెవెల్‌కి వెళ్లింది. టీజర్ అందరికీ నచ్చే ఉంటుందని భావిస్తున్నాం. త్వరలోనే మరింత కంటెంట్ మా చిత్రం నుంచి రానుంది’ అని అన్నారు.
వేద జలంధర్ మాట్లాడుతూ .. ‘మా కోసం వచ్చిన వంశీ గారికి థాంక్స్. రమణ గారి వల్లే ‘అమీర్ లోగ్’ అద్బుతంగా వచ్చింది. టీజర్ అందరికీ నచ్చే ఉంటుందని ఆశిస్తున్నాను. గీత అనే పాత్రను నాకు ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థాంక్స్. స్మరణ్ వల్లే మా సినిమా స్థాయి పెరిగింది. విజువల్స్ ఎంతో నేచురల్‌గా ఉంటాయి. మరిన్ని అప్డేట్‌లతో ప్రేక్షకుల్ని అలరిస్తామ’ని అన్నారు.
నటుడు విశ్వేందర్ రెడ్డి మాట్లాడుతూ .. ‘‘అమీర్ లోగ్’ నా మనసుకు నచ్చిన చిత్రం. ఈ కథ అంతా కూడా బిర్యానీ చుట్టూనే తిరుగుతుంది. ఈ అద్భుతమైన టీంతో పని చేయడం ఆనందంగా ఉంది. ఇందులోని ప్రతీ పాత్ర నటించినట్టుగా అనిపించదు. మా మూవీని రిలీజ్ చేస్తున్న స్పిరిట్ మీడియాకి థాంక్స్’ అని అన్నారు.
నటీనటులు :
ఎంసీ హరి, మనోజ్, శశిధర్, వేద జలంధర్, రావణ్ నిట్టూరు, విశ్వేందర్ రెడ్డి, సాయి యోగి తదితరులు.
సాంకేతిక బృందం:
దర్శకుడు: రమణ రెడ్డి సోమ
నిర్మాత: మాధవి రెడ్డి సోమ
సహ నిర్మాత: మనోహర్ రెడ్డి మంచూరి
విడుదల: రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా
DoP : ఎస్‌వీకే (SVK)
ఎడిటర్: రోహిత్ పెనుమత్స
సంగీతం: స్మరణ్ సాయి
పోస్టర్స్ డిజైన్: శక్తి
సింక్ సౌండ్ & మిక్సింగ్: స్వప్నిక్ రావు
చీఫ్ అసిస్టెంట్ డైరెక్టర్: సాయి యోగి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సందీప్ బొరెడ్డి
లైన్ ప్రొడ్యూసర్: శరత్ పోలవరపు
పీఆర్‌వో: సాయి సతీష్
v‘మా రాముడు అందరివాడు’ దమ్మున్న సినిమా : హీరో శ్రీరామ్ ‘మా రాముడు అందరివాడు’ చిత్రంలోని ఫాదర్ అండ్ సన్…
ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్” కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal
భారతదేశంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ప్రైమ్ వీడియో నుంచి రానున్న నూతన తెలుగు ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'జగమే…
→ ఈ రూ.50లో GST కూడా కలిపి ఉంటుంది.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.→…
వెర్సటైల్ స్టోరీస్, ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలనే లక్ష్యంతో హీరో…
‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:…