‘ఆదికేశవ’ నుంచి మొదటి పాట ‘సిత్తరాల సిత్రావతి’ విడుదల

పంజా వైష్ణవ్ తేజ్, శ్రీలీల జంటగా నటిస్తున్న ‘ఆదికేశవ’ నుంచి మొదటి పాట ‘సిత్తరాల సిత్రావతి’ విడుదల

జాతీయ అవార్డు గెలుచుకున్న ‘ఉప్పెన’ చిత్రంతో తెరంగేట్రం చేసిన పంజా వైష్ణవ్ తేజ్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు ఆయన ‘ఆదికేశవ’ అనే యాక్షన్ చిత్రంతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు.

యువ సంచలనం శ్రీలీల ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తున్నారు. అపర్ణా దాస్, జోజు జార్జ్ ఈ చిత్రంతో తెలుగు చిత్రసీమలోకి అడుగుపెడుతున్నారు.

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్‌ ఫోర్‌ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ ఈ చిత్రాన్ని సమర్పిస్తోంది.

నవంబర్ 10న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రంతో శ్రీకాంత్ ఎన్ రెడ్డి దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ప్రముఖ స్వరకర్త, జాతీయ అవార్డు గ్రహీత జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం నుండి ‘సిత్తరాల సిత్రావతి’ అంటూ సాగే మొదటి పాటను తాజాగా విడుదల చేసింది చిత్ర బృందం.

నాయకానాయికల మధ్య సాగే మెలోడీ పాట ఇది. కథానాయకుడు వైష్ణవ్ తేజ్ తన చిత్ర(కథానాయిక శ్రీలీల)ను ‘సిత్తరాల సిత్రావతి’ అని పిలుస్తూ, ఆమె అందాన్ని పొగుడుతూ పాడే గీతంగా వినిపిస్తుంది, కనిపిస్తుంది.

గేయ రచయిత సరస్వతి పుత్ర రామజోగయ్య శాస్త్రి, అందమైన పదాల అమరికతో పాటకు ప్రాణం పోశారు. ఆస్కార్ అవార్డ్ గెలిచిన ‘నాటు నాటు’ పాట గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ ఈ పాటకి తన గాత్రంతో విభిన్నమైన జానపద రుచిని అందించారు. గాయని రమ్య బెహరా పాటలోని అనుభూతిని తన స్వరంలో చక్కగా పలికించారు. ఈ పాట వైరల్ అవుతుందని, పార్టీలలో మారుమ్రోగి పోవడం ఖాయమని అప్పుడే శ్రోతల నుంచి ప్రశంసలు కురుస్తున్నాయి.

థియేటర్లలో ప్రేక్షకులకు మంచి యాక్షన్ ఎంటర్‌టైనర్‌ని అందించడానికి ఆదికేశవ టీమ్ కసరత్తు చేస్తోంది. ఈ చిత్రం పట్ల ఎంతో సంతృప్తిగా ఉన్న నిర్మాతలు, ఈ దీపావళికి బాక్సాఫీస్ దగ్గర విజయ ఢంకా మోగిస్తామని నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.

నవీన్ నూలి ఎడిటర్ గా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి డడ్లీ, ఆర్థర్ ఎ. విల్సన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ కి ఏఎస్ ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. మరిన్ని వివరాలు త్వరలో వెల్లడించనున్నారు

Tfja Team

Recent Posts

ఫ్యామిలీ అంతా కలిసి చూడదగ్గ చిత్రం.. అందరికీ తప్పకుండా నచ్చుతుంది.. ‘సన్ ఆఫ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో నిర్మాత, హీరో సాయి సింహాద్రి

సాయి సింహాద్రి సైన్మా బ్యానర్ మీద సాయి సింహాద్రి హీరోగా, నిర్మాతగా చేసిన చిత్రం ‘సన్ ఆఫ్’. ఈ మూవీని…

13 minutes ago

‘హేబల్‌వంత్‌’ చిత్రం బ్రేక్‌ ఈవెన్‌ సాధించింది: థాంక్యూ మీట్‌ ఫర్‌ బ్రేక్‌ ఈవెన్‌ డన్‌ ఈవెంట్‌లో వెల్లడించిన చిత్ర నిర్మాత

ప్రామిసింగ్‌ కథానాయకుడు సుహాస్‌, శివానీ నాగారం జంటగా రూపొందిన హిలేరియస్‌ ఎంటర్‌టైనర్‌ 'హే బల్‌వంత్‌'. గోపీ అచ్చర దర్శకత్వంలో త్రిశుల్‌…

2 hours ago

మహేష్ విట్ట ‘’ఉత్తుత్త హీరోలు‘’ చిత్రానికి బెస్ట్ విషెస్ తెలిపిన హీరో ప్రదీప్ మాచిరాజు

‘ఉత్తుత్త హీరోలు’ సినిమాను ఎంవిఎం పిక్చర్స్ బ్యానర్ పై మహేష్ విట్టా నిర్మించారు . హాస్య నటనకు పేరుగాంచిన మహేష్…

1 day ago

‘డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు’ బోలెడన్ని ట్విస్టులతో ఉంటుంది.. ఏ ఒక్కరినీ నిరాశపర్చదు.. గ్రాండ్ ప్రివ్యూ ఈవెంట్‌లో రాజీవ్ కనకాల

రాజీవ్ కనకాల, ఉదయభాను, వసంతిక, శ్రీరామ్ వెంకట్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన వెబ్ సిరీస్ ‘డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు’.…

2 days ago

తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ (TFJA) కి యువ నిర్మాత వంశీ నందిపాటి విరాళం

తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ (TFJA) సభ్యుల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్న TFJA టీమ్ ను అభినందిస్తూ,…

3 days ago

మార్చి 4వ తేదీ నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కు వస్తున్న సూపర్ హిట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ”ఓం శాంతి శాంతి శాంతిః”

సరికొత్త కంటెంట్ తో వ్యూయర్స్ ను ఎంగేజ్ చేస్తున్న ఆహా ఓటీటీ మరో సూపర్ హిట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్…

3 days ago