శ్రీతేజ్ హీరోగా‘రాంబో’ సినిమా ఫస్ట్ లుక్ విడుదల

Must Read

శ్రీతేజ్, రత్నాకరం అనిల్ రాజు, శ్రీధర్ గంగపట్నం, ఎస్వీకె సినిమాస్ అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్ టైనర్ టైటిల్ ‘రాంబో’ – ఫస్ట్ లుక్ విడుదల

ఎన్టీఆర్ మహానాయకుడు, నారప్ప, పుష్ప, ధమాకా లాంటి విజయవంతమైన చిత్రాలలో కీలక పాత్రలు పోషించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచుకున్న శ్రీతేజ్ హీరోగా పరిచయం అవుతున్నారు. శ్రీతేజ్ హీరోగా ‘హిడింబ’ లాంటి థ్రిలింగ్ బ్లాక్ బస్టర్ ని అందించిన శ్రీ విఘ్నేష్ కార్తీక్ సినిమాస్ బ్యానర్‌పై రత్నాకరం అనిల్ రాజు దర్శకత్వంలో నిర్మాత శ్రీధర్ గంగపట్నం ఓ అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్ టైనర్ నిర్మిస్తున్నారు.

శ్రీతేజ్ బర్త్ డే సందర్భంగా ఈ చిత్రం టైటిల్, ఫస్ట్ లుక్ ని విడుదల చేశారు మేకర్స్. ఈ చిత్రానికి ‘రాంబో’ అనే పవర్ ఫుల్ టైటిల్ ని పెట్టారు. ఫస్ట్ లుక్ లో శ్రీతేజ్ రగ్గడ్ అండ్ ఇంటెన్స్ లుక్ లో ఫెరోషియస్ గా కనిపించారు. రాంబో టైటిల్, శ్రీతేజ్ టెర్రిఫిక్ లుక్ సినిమాపై ఆసక్తిని పెంచాయి.

ఇటివలే వైజాగ్ షెడ్యుల్ పూర్తి చేయడంతో ఈ సినిమా టాకీ పార్ట్ పూర్తయింది. బ్యాలెన్స్ పాటలని చిత్రీకరించడానికి సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్.

ఈ చిత్రానికి ప్రముఖ సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారు. శ్యామ్ కె నాయుడు, సునీల్ కుమార్ నామా సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి సునీల్ కశ్యప్ సమకూరుస్తున్నారు. కోటగిరి వేంకటేశ్వర రావు ఎడిటర్ గా పని చేస్తున్నారు. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందిస్తున్న ఈ చిత్రానికి కె వి రమణ ఆర్ట్ డైరెక్టర్.  శేఖర్ మాస్టర్ డ్యాన్స్ కొరియోగ్రఫీ చేస్తున్నారు.

నటీనటులు :  శ్రీతేజ్,  రాజీవ్ సాలూరి, ఫర్నాజ్ శెట్టి, మైమ్ గోపి, ,గోలిసోడ మధు

సాంకేతిక విభాగం:
దర్శకత్వం  : రత్నాకరం అనిల్ రాజు
నిర్మాత : శ్రీధర్ గంగపట్నం
సినిమాటోగ్రఫీ : శ్యామ్ కె నాయుడు, సునీల్ కుమార్ నామా
ఎడిటింగ్ : కోటగిరి వేంకటేశ్వర రావు
సంగీతం : సునీల్ కశ్యప్
కొరియోగ్రఫీ : శేఖర్ VJ, ఈశ్వర్ పెంటి
స్టంట్స్ : రామకృష్ణ
సాహిత్యం : రామజోగయ్య శాస్త్రి
ఆర్ట్ డైరెక్టర్ : కె వి రమణ
 పీఆర్వో: వంశీ – శేఖర్

Latest News

తెలంగాణ ప్రభుత్వం అనుమతితో శ్రీతేజ్‌ను పరామర్శించిన ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌

సంధ్య థియేటర్‌ తొక్కిసలాటలో గాయపడి కిమ్స్‌ హస్పటల్‌లో చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ ఈ రోజు (బుధవారం) పరామర్శించారు. శ్రీతేజ్‌ యోగా...

More News