అన్నిటికీ సమాధానం గీతాంజ‌లి 3లో ఉంటుంది!- శివ తుర్ల‌పాటి

Must Read

అంజలి 50వ సినిమా ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’. శివ తుర్లపాటి దర్శక‌త్వంలో  MVV సినిమాస్‌తో కలిసి కోన ఫిల్మ్స్ కార్పొరేషన్‌పై కోన వెంకట్ నిర్మించారు. హారర్‌ కామెడీ జోనర్‌లో భారీ బడ్జెట్‌తో రూపొందిన ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ చిత్రాన్ని  ఏప్రిల్ 11న విడుదల చేశారు. సినిమాకు వ‌స్తున్న స్పంద‌న గురించి, త‌న గురించి, గీతాంజ‌లి 3 గురించి శివ తుర్ల‌పాటి మీడియాతో మాటా మంతీ…


* సినిమాకు వ‌స్తున్న స్పంద‌న గురించి చెప్పండి?
– రెస్పాన్స్ జెన్యుయ‌న్‌గా బావుంది. రివ్యూలను కూడా చూశాను. రివ్యూల్లో చెప్పే విష‌యాల‌ను నేనెప్పుడూ పాజిటివ్‌గా తీసుకుంటాను. సినిమాలో చాలా వాటికి ఆన్స‌ర్ చేయ‌కుండా వ‌దిలేశార‌ని కొంద‌రు రాశారు. అయితే, ఆ లాజిక్కుల‌న్నిటికీ స‌మాధానం చెబుతూ పోతే, యానిమ‌ల్ సినిమాలాగా మూడు గంట‌ల నిడివి వ‌స్తుంది. నేను చెప్ప‌ద‌ల‌చుకున్న‌ది అది కాదు. ఇది ఔట్ అండ్ ఔట్ ఫ్యామిలీ సినిమా. కాంజూరింగ్ టైప్ హార‌ర్ ఇందులో చేయాల‌నే థాట్ మాకు లేదు. ఎంట‌ర్‌టైనింగ్ సినిమాగానే చేశాం. కోనగారి మార్కు రైటింగ్‌ని ఆస్వాదించేవారికి చాలా బాగా న‌చ్చుతోంది. సినిమా చూసిన వారు నాకు మెసేజ్‌లు పెడుతున్నారు. వీకెండ్ కాబ‌ట్టి, యుఎస్‌లో ఇప్పుడు అంద‌రూ సినిమా చూస్తున్నారు. చాలా మంచి రెస్పాన్స్ వ‌స్తోంది అక్క‌డి నుంచి. సునీల్‌, స‌త్య కామెడీ సెకండాఫ్ లో పేలింది. క్లైమాక్స్ ని కొంద‌రు ఎక్స్ ట్రార్డిన‌రీ అని మెచ్చుకుంటున్నారు. కొంద‌రు స‌డ‌న్‌గా పూర్త‌యింది అని అన్నారు. మ‌రికొంద‌రు అదేంట‌ని అన్నారు. ఇలాంటి అనుమానాలు అన్నిటికీ థ‌ర్డ్ పార్ట్ లో స‌మాధానం ఉంటుంది. ఈ విష‌యాల‌న్నిటినీ నేను కోన‌గారితోనూ డిస్క‌స్ చేశాను.

* పార్ట్ 2 చేస్తున్న‌ప్పుడే థ‌ర్డ్ చాప్ట‌ర్ గురించి అనుకున్నారా?
 – పార్ట్ 2 చేస్తున్న లాస్ట్ మూమెంట్‌లో పార్ట్ 3 కోసం మంచి ఐడియా వ‌చ్చింది. అలా దాని గురించి ఓ డిస్క‌ష‌న్ జ‌రిగింది. దాని గురించి మ‌ళ్లీ మాట్లాడుదాం…
* పార్ట్ 3 అవ‌స‌రం ఉందా?
– పార్ట్ 2 లో పార్ట్ 3కి లీడ్ ఇచ్చాం. రావు ర‌మేష్ ఆత్మ‌ని అమ్మాయి బొమ్మ‌లో కేప్చ‌ర్ చేస్తుంది. అత‌ను వెళ్ల‌లేదు. ఆమెనే వెళ్లింది. తండ్రికోసం వ‌స్తాడు ఆ కొడుకు,  ప్రాణానికి ప్రాణంగా పెంచుకున్న కొడుకు చ‌నిపోయాడు. అలాంట‌ప్పుడు అత‌నేం చేస్తాడు? ఈ పాయింట్ పార్ట్ 3లో అద్భుతంగా పేలుతుంది.
* మీరిందులో చిన్న కేమియో చేసిన‌ట్టున్నారు?
– నాకు న‌టించాల‌నే ఉద్దేశం లేదు. ఊటీలో కొంత‌మందిని ఆడిష‌న్ చేశాం. కానీ క‌రెక్ట్ ఆర్టిస్ట్ దొర‌క‌లేదు. అక్క‌డ మేం చాలా స్పీడ్‌గా షూటింగ్ చేశాం. ఎక్కువ టేకులు తీసుకునే వారిని మేం భ‌రించే సీన్ లేదు. డేట్లు, టైమింగ్‌… ఇలాంటివ‌న్నీ దృష్టిలో పెట్టుకుని టూరిస్ట్ కేర‌క్ట‌ర్ నేను  చేస్తాను సార్‌ అని కోన‌గారికి మెసేజ్ పెట్టాను. బెస్ట్ అని రిప్లై ఇచ్చారు ఆయ‌న‌. అలా జ‌రిగిపోయింది అది. ఆ సినిమాలో న‌న్ను గుర్తించారు.. సంతోషం
* డైర‌క్ట‌ర్‌గా శాటిస్‌ఫై అయ్యారా?
– శాటిస్‌ఫై అయ్యానండీ. ఇంకా బాగా చేసి ఉండొచ్చేమో అనే త‌ప‌న ఎప్పుడూ ఉంటుంది. కాక‌పోతే ఈ సినిమా నాకు చాలా చాలా నేర్పింది. నెక్స్ట్ సినిమాకు ఇంకా బాగా చేస్తానేమో.
* మోస్ట్ అన్ ఎక్స్ పెక్టెడ్ కాంప్లిమెంట్ ఎవ‌రి నుంచి వ‌చ్చింది?
– అంద‌రూ నా మంచిని కోరుకునేవారే. 20 – 25 ఏళ్ల నుంచి ఇండ‌స్ట్రీలో ఉన్నా. నా క‌ష్టాల‌ను ఎవ‌రూ చూడ‌లేదు. ఇప్పుడు చూస్తున్న శివ‌, ఆ శివ వేరు. అందుకే నేను స‌క్సెస్ కావాల‌ని అంద‌రూ కోరుకున్నారు.
* కోన‌గారి కోస‌మే సినిమా చేశారా?  లేకుంటే డైర‌క్ష‌న్ చేయాల‌ని ముందే అనుకున్నారా?
– డైర‌క్ష‌న్ చేయాల‌న్న‌ది నా క‌ల‌. అందుకోస‌మే కోన‌గారికి కొన్ని స్క్రిప్టులు చెప్పా. ఈ సినిమాకు ముందు కూడా ఓ క‌థ చెప్పా. ఆయ‌న బ్యాక్ టు బ్యాక్ సినిమాల‌తో బిజీగా ఉన్నారు. మ‌ధ్య‌లో ర‌మ్మంటే నాకు కుద‌ర‌లేదు. కాక‌పోతే ఈ సినిమా డైర‌క్ష‌న్ నాకు ఇస్తార‌ని నేను ఊహించ‌లేదు. ఈ సినిమా చేస్తే లాంచ్ బావుంటుంద‌ని నాకు చెప్పారు. స‌రేన‌ని చేశాను.
* సీక్వెల్ అన‌గానే భ‌యం ఉంటుంది క‌దా…
– నిజ‌మేనండీ. ఫ‌స్ట్ పార్టు కూడా డైర‌క్ట‌ర్  బ్ల‌డ్ పెట్టి చేశారు. చాలా పెద్ద స‌క్సెస్ అయింది. అందుకే ఆ ప్రెజ‌ర్‌ని నేను తీసుకోలేదు. అలాగే అంజ‌లిగారికి 50వ సినిమా అని కూడా నాకు తెలియ‌దు. సినిమాను సినిమాగా చేశాం
* మీరు కొరియోగ్రాఫ‌ర్ క‌దా.. అది ఈ సినిమాకు ప్ల‌స్ అయిందా?
– బిగ్ టైమ్ ప్ల‌స్ అయింది. నేను చేసిన పాట‌లు చాలా మందికి తెలియ‌దు. నేను క‌నిపించ‌డానికి కూడా ఇష్ట‌ప‌డ‌ను కాబ‌ట్టి తెలిసే ఛాన్సే లేదు. తేజ‌గారి ద‌ర్శ‌క‌త్వంలో న‌వ‌దీప్ జైకి కొరియోగ్ర‌ఫీ చేశా. బ్ర‌హ్మాస్త్రం చేశా. శంక‌రాభ‌ర‌ణం చేశా… ఇంకా చాలా చాలా సినిమాలు… ప‌దివేల‌కు, ఐదు వేల‌కు సాంగ్స్ చేసిన రోజులు కూడా ఉన్నాయి. హీరో ఇంట్ర‌డ‌క్ష‌న్ సాంగులు నాకు పెద్ద‌గా రాలేదు. కానీ, నేను చేసిన ప్ర‌తి పాట‌లోనూ క‌థ చెప్పేవాడిని. కోన‌గారికి నాలో న‌చ్చిందే అది.
* అప్‌క‌మింగ్ సినిమాలు ఏమున్నాయి?
– చెప్తాను. నా ద‌గ్గ‌ర చాలా క‌థ‌లున్నాయి. నేను బాగా ఇష్ట‌ప‌డేది సెంటిమెంట్‌, ఎమోష‌న‌ల్ జోన‌ర్‌. ఏ సినిమా అయినా ఎమోష‌న్‌, సెంటిమెంట్ లేనిదే వ‌ర్క‌వుట్ అవుతుంద‌ని నేను అనుకోను. సో.. ఇప్పుడు ఇమీడియేట్‌గా ఏది సెట్స్ మీద‌కు వెళ్తుందో చూడాలి.
* గీతాంజ‌లి3కి మీరే ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తారా?
– ఇంకా తెలియ‌దండీ. కానీ, ఎవ‌రైనా త్వ‌ర‌లోనే మొద‌లవుతుంది.
* మీ గురించి చెప్పండి?
– చిన్నప్ప‌టి నుంచీ చిరంజీవిగారి సినిమాలు చూసి డ్యాన్సులు నేర్చుకున్నా. కోటిలో శ్రీను మాస్ట‌ర్ అని గురువుగారి ద‌గ్గ‌ర డ్యాన్సు నేర్చుకున్నా. అప్ప‌ట్లో ఆయ‌న బ్యాక్ గ్రౌండ్ డ్యాన్స‌ర్ కార్డు ఇప్పించారు. బ‌ద్రిలోబ్యాక్ గ్రౌండ్ డ్యాన్స‌ర్‌గా ఫ‌స్ట్ టైమ్ చేశాను. రాకేష్ మాస్ట‌ర్‌, హ‌రీష్ మాస్ట‌ర్ ఎంక‌రేజ్ చేశారు. అప్పుడే తేజ‌గారు పిలిచి కొరియోగ్రాఫ‌ర్‌గా చేయ‌మ‌న్నారు. నేను డ్యాన్స్ మాస్ట‌ర్ కార్డు తెచ్చుకున్నా. మాస్ట‌ర్ అయ్యాక బ్యాక్‌గ్రౌండ్ డ్యాన్స‌ర్‌గా చేయ‌డానికి లేదు. అప్పుడు త‌మిళ్ డ్యాన్స్ మాస్ట‌ర్ల హ‌వా ఉండేది. ఆ టైమ్‌లో నేను ముంబైకి వెళ్లా. అక్క‌డ డ్యాన్స‌ర్‌గా చేసుకోవ‌చ్చ‌నే వెళ్లా. భ‌రున్ ముఖ‌ర్జీ అని.. మ‌న వీయ‌స్ ఆర్ స్వామి గారికి గురువుగారున్నారు. ఆయ‌న్ని క‌లిశాను. ఆయ‌న‌తో ఏడు యాడ్ ఫిల్స్మ్ చేశా. ఆయ‌నరెమోసార్ ద‌గ్గ‌రికి పంపారు. ఆ త‌ర్వాత ఫైన‌ల్‌గా అమెరికాకి వెళ్లా. అప్పుడు నా గ‌ర్ల్ ఫ్రెండ్ అమెరికాలో ఉండేది. నాకూ వీసా రావ‌డంతో పెళ్లి చేసుకుని వెళ్లిపోయా. నేన‌లా వెళ్లానో లేదో… ఇలా  స్టార్‌వార్‌, ఢీలు మొద‌ల‌య్యాయి. ఫిల్మ్ సిటీలో నేను నాలుగేళ్లు ప‌నిచేశా. కానీ అప్పుడు లేని షోలు.. ఇప్పుడు మొద‌ల‌య్యాయే అనిపించింది. కొన్నాళ్ల‌కు మ‌ళ్లీ నేను డ్యాన్స్ స్కూలు పెట్టుకున్నా. హైద‌రాబాద్‌లో సెటిల‌య్యా. మా డ్యాన్స్ఇన్‌స్టిట్యూట్‌లో ఇప్పుడు కూడా 500 – 600 మంది ఉన్నారు. నీ ఇంటికి ముందో గేటు.. అనే పాట‌కు మా స్టూడెంట్స్ తో క‌లిసే క‌వ‌ర్‌సాంగ్ చేశా. అస‌లు క‌వ‌ర్ సాంగ్స్ ఉంటాయ‌ని కూడా నాకు తెలియ‌దు. అది చూసి కోన‌గారికి న‌చ్చి మ‌ళ్లీ పిలిచారు. ఇలా ఇప్పుడు మీముందున్నా.

Latest News

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

More News