‘తెలుగు ఇండియన్‌ ఐడల్‌2’ని ప్రారంభించిన ఆహా

Must Read

హైదరాబాద్‌, మార్చి 3: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన క్షణాలకు స్వస్తి చెప్పే సమయం ఆసన్నమైంది. ఆహాలో తెలుగు ఇండియన్‌ ఐడల్‌ 2 ఈ రోజు రాత్రి 7 గంటల నుంచి ప్రసారం కానుంది. రియాలిటీ షోలలో తనకంటూ ప్రత్యేకతను సాధించుకుని, పాపులర్‌ అయిన షో తెలుగు ఇండియన్‌ ఐడల్‌. సుమధురమైన గళాలను ప్రపంచానికి పరిచయం చేసిన ఘనత ఆహా తెలుగు ఇండియన్‌ ఐడల్‌ సొంతం. హార్ట్ టచింగ్‌ పెర్ఫార్మెన్స్ లు, హృద్యంగా సాగిన పాటలతో ప్రేక్షకులను వినోదింపజేసింది ఆహా.

ఈ క్రమంలో, అదనపు హంగులు సమకూర్చడంలో భాగంగా సింగిల్‌ మారథాన్‌ను ఏర్పాటు చేసింది తెలుగువారి అచ్చ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫార్మ్ ఆహా. ప్రసాద్‌ల్యాబ్‌లో జరిగిన ఈ మారథాన్‌కి విశేషమైన స్పందన వచ్చింది. దాదాపు ఐదు గంటల పాటు టాలీవుడ్‌ గురు రామాచారి ఆధ్వర్యంలో ఈ మారథాన్ జరిగింది‌. ఆయనతో పాటు ఆయన లిటిల్‌ మ్యూజీషియన్స్ అకాడెమీ సింగర్స్ కూడా పాల్గొన్నారు.

ఆహుతులను అమితంగా ఆకట్టుకున్న కార్యక్రమంగా పేరు తెచ్చుకుంది‌. యువ గాయనీగాయకుల్లో ఉన్న ప్రతిభ, కళ పట్ల వారుచూపించే అంకిత భావం సభికులను అలరింపజేశాయి. పసిపిల్లల్ని, పాముల్నీ సైతం కదిలింపజేసే శక్తి సంగీతానికుంది. ఆ శక్తిని ప్రత్యక్షంగా ఆస్వాదించి, అనుభూతి చెందే అదృష్టం ఆ ప్రాంగణానికి హాజరైన సభికులకు కలిగింది.

గ్రాండ్‌ లాంచ్‌ ఈవెంట్‌ గురించి, గురు రామాచారి మాట్లాడుతూ”సంగీత ప్రపంచంలో గేమ్‌ చేంజర్‌గా తెలుగు ఇండియన్‌ ఐడల్‌ ప్రోగ్రామ్‌కి పేరుంది. ఫస్ట్ సీజన్‌లో అద్భుతమైన గళాలను ఆస్వాదించగలిగాం. ఈ షోతో అసోసియేట్‌ కావడం చాలా ఆనందంగా ఉంది. ఫస్ట్ సీజన్‌లో నా శిష్యులు కొందరు పాల్గొన్నారు. నా శిష్యుల ప్రతిభను వేదిక మీద చూస్తున్నప్పుడు గురువుగా మురిసిపోతాను. ఈ సీజన్‌తో మరింత మంది యువ ప్రతిభావంతులను పరిశ్రమకు పరిచయం చేస్తాం. అంకిత భావం, అకుంఠిత శ్రమతో గాయనీ గాయకులు తమ తమ రంగాల్లో రాణించగలుగుతారు. తమను తాము నిరూపించుకోవాలన్న కసి ఉన్న అభ్యర్ధులకు తెలుగు ఇండియన్‌ ఐడల్‌ 2 పర్ఫెక్ట్ స్టేజ్‌ అవుతుంది. ఈ సదవకాశాన్ని ప్రతిభావంతులు అందిపుచ్చుకుని సఫలీకృతం చేసుకోవాలి.”

అత్యద్భుతమైన, వైవిధ్యమైన ఆలోచనతో ఆహా కేవలం వినోదాన్ని అందించడమే కాదు, ప్రతిభావంతులను ప్రోత్సహిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న సుమధురమైన గళాలను ప్రపంచానికి పరిచయం చేస్తోంది. మన సంస్కృతీ, సంప్రదాయాలకు పెద్ద పీట వేస్తోంది. మట్టిలో మాణిక్యాలను వెలికి తీయడానికి తనవంతు దోహదపడుతోంది.

గతంలో ఎన్నడూ చూడని విధంగా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది తెలుగు ఇండియన్‌ ఐడల్ 2 ఈరోజు రాత్రి ఏడు గంటల నుంచి ప్రసారం కానుంది

Latest News

వి.వి.వినాయక్ చేతుల మీదుగా “బరాబర్ ప్రేమిస్తా” మూవీ టీజర్ రిలీజ్

ఆటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ నటిస్తున్న కొత్త సినిమా "బరాబర్ ప్రేమిస్తా ". ఈ చిత్రానికి సంపత్ రుద్ర దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను కాకర్ల సత్యనారాయణ...

More News