దయచేసి అందరూ హెల్మెట్ ధరించండి.. జాగ్రత్తగా డ్రైవింగ్ చేయండి.. ది ఫాస్ట్ & క్యూరియస్ – ఆటో ఎక్స్పో 2025 ఈవెంట్‌లో సుప్రిమ్ హీరో సాయి దుర్గ తేజ్

సుప్రిమ్ హీరో సాయి దుర్గ తేజ్ తాజాగా హైదరాబాద్‌లో జరిగిన ది ఫాస్ట్ & క్యూరియస్ – ఆటో ఎక్స్పో 2025 లో పాల్గొన్నారు. ఈ ఈవెంట్‌లో అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. సవాళ్లు ఎదురైతే మధ్యలోనే చేస్తున్న పనిని వదిలేయొద్దని, పట్టువదలకుండా ప్రయత్నిస్తూనే ఉండాలని సాయి దుర్గ తేజ్ అన్నారు. ఇంకా ఆయన ఈ కార్యక్రమంలో ఏం మాట్లాడరంటే..

‘నేను నా ప్రొఫైల్ పట్టుకుని ఎన్నో ఆఫీస్‌లకు తిరిగాను. నా ఫోటోల్ని పల్లీలు, బఠానీలు తినడానికి వాడే వారు. అలా ఆఫీస్‌ల చుట్టూ తిరుగుతున్న టైంలో ఓ సారి మంచు మనోజ్ గారి ఆఫీస్‌లో వైవీఎస్ చౌదరీ గారు చూశారు. అలా ‘రేయ్’ చిత్రం ప్రారంభమైంది. కానీ ఆ మూవీ షూటింగ్ టైంలో చాలా ఆర్థిక సమస్యలు వచ్చాయి. అయినా సరే పట్టువదలకుండా ప్రయత్నించాను. 2012లో ఓ సినిమా చేస్తున్న టైంలోనే ఓ ప్రముఖ నటులు చనిపోయారు. మళ్లీ 2013లో జగపతి బాబు గారితో రీ షూట్ చేశాం. పొలిటికల్ రీజన్స్ వల్ల ఆ సినిమా కూడా ఆలస్యమైంది. అలా ఎన్ని సమస్యలు వచ్చినా కూడా నా కలల్ని మాత్రం వదిలి పెట్టలేదు.

నాకు పవన్ కళ్యాణ్ గారు ఓ గురువులాంటి వారు.. చిన్నప్పటి నుంచి నన్ను గైడ్ చేస్తూనే ఉన్నారు.. ప్రతీ విషయంలో నన్ను ఎంకరేజ్ చేస్తుంటారు.. యాక్టింగ్ ట్రైనింగ్, జిమ్నాస్టిక్, డ్యాన్స్, కిక్ బాక్సింగ్ ఇలా అన్నింట్లోనూ నన్ను గైడ్ చేశారు. కాలేజ్‌లో ఉండే ఫేవరేట్ టీచర్‌లా నాకు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడూ సపోర్ట్ చేస్తుంటారు.

నేను ప్రతీ సిట్యువేషన్‌ను లైటర్ వేలోనే తీసుకుంటాను. ఏదీ కూడా సీరియస్‌గా తీసుకోను. ఎంత బ్యాడ్ జరిగినా కూడా నవ్వుతూ ఆ సిట్యువేషన్‌ను దాటేస్తుంటాను. నేను హాస్పిటల్ ఉన్న తరువాత బయటకు వచ్చాను. అందరూ అడుగుతూ ఉంటే.. కోమాలో ఉన్నాను అని చెప్పలేదు.. హాస్పిటల్‌కు అలా చిల్ అవ్వడానికి వెళ్లాను అని చెప్పాను. అందరూ హెల్మెట్ ధరించండి. వేగంగా వెళ్లకండి. జాగ్రత్తగా డ్రైవింగ్ చేయండి. యాక్సిడెంట్ తరువాత నాకు చాలా సమస్యలు వచ్చాయి. మాటలు కూడా సరిగ్గా వచ్చేవి కావు. నేను ఎన్నో పుస్తకాలు చదివే వాడిని.. ఎంతో వ్యాయామం చేసేవాడిని.

నాకు ‘రిపబ్లిక్’ చాలా ఇష్టం. ఆ క్లైమాక్స్ కూడా నాకు చాలా ఇష్టం. అలాంటి కథలు మళ్లీ వస్తే నేను చేస్తాను. సోషల్ మీడియా అకౌంట్లకు ఆధార్‌ని లింక్ చేయడం మన బాధ్యత అని నేను అనుకుంటాను. చిరంజీవి గారితో ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ లాంటి స్టోరీని చేయాలనే కోరిక ఉంది. నా గ్యారేజ్‌లో ఉన్న రాయల్ ఎన్ ఫీల్డ్, మహేంద్ర థార్ అంటే నాకు చాలా ఇష్టం. 1968 షెల్బీ జీటీ 500 మస్టంగ్ మోడల్ కారు అంటే మరింత ఇష్టం. అది నాకు డ్రీమ్ కారు లాంటిది. కచ్చితంగా ఎప్పటికైనా సరే ఆ కారుని కొంటాను.

Tfja Team

Recent Posts

నవంబర్ 12న ‘అ (AH)’ చిత్రం రాబోతోంది. అందరూ చూసి హిట్ చేయాలని కోరుకుంటున్నాను.. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో సక్సెస్ ఫుల్ నిర్మాత వంశీ నందిపాటి

రాహుల్ విజయ్, అర్చనా అయ్యర్ ప్రధాన పాత్రల్లో స్టార్ బాక్స్ స్టోరీస్, రిపుల్ స్లైడ్ స్టూడియోస్ బ్యానర్లపై కనకరావు తొనంగి,…

2 hours ago

“సమ్మర్ హాలిడేస్” పిల్లల సినిమా కాదు పిల్లలు నటించిన పెద్దల సినిమా, ఔట్ అండ్ ఔట్ ఎంటర్ టైనర్ – డైరెక్టర్ శ్రీకర్ నయన్

కథా బలమున్న చిత్రాలను ప్రేక్షకులకు అందిస్తూ సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ గా, డిస్ట్రిబ్యూటర్ గా పేరు తెచ్చుకున్నారు ధీరజ్ మొగిలినేని.…

2 hours ago

అంగరంగ వైభవంగా SA ప్రొడక్షన్స్ బ్యానర్ లోగో & “చాణక్య” టీజర్ లాంచ్

SA ప్రొడక్షన్స్ బ్యానర్ లోగో అత్యంత ఘనంగా నిర్మాతలు రాజేశ్వర శర్మ కూచి, ఆదిత్య డొక్కర, గోపాల్ దాయిమ, వినోద్…

2 hours ago

2027 సంక్రాంతి రిలీజ్ కు వస్తున్న డైరెక్టర్ పా.రంజిత్ భారీ పాన్ ఇండియా యాక్షన్ మూవీ “వేట్టువం”

సరికొత్త కథా నేపథ్యాలతో అద్భుతమైన మేకింగ్ తో ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేసే దర్శకుడు పా. రంజిత్ "వేట్టువం" టైటిల్ తో…

1 day ago

మెగాస్టార్ చిరంజీవి క్లాప్‌తో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్,#RC17 # RC2Sukku ముహూర్తపు వేడుకతో ఘనంగా ప్రారంభం

మెగాస్టార్ చిరంజీవి క్లాప్‌తో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, మాస్టర్ స్టోరీటెల్లర్ సుకుమార్, మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్…

1 day ago

నవీన్ చంద్ర ‘NC 51’ షూటింగ్ పూర్తి

నటుడు నవీన్ చంద్ర హీరోగా, దర్శకుడు ఆర్.పి. బాల తెరకెక్కిస్తున్న కొత్త చిత్రం ‘NC 51’ షూటింగ్ పూర్తయింది. ఆర్.పి.…

3 days ago