సూపర్ ఇంట్రెస్టింగ్ పేస్‌తో 2 నిమిషాల 27 సెకన్ల ట్రైలర్‌ను విడుదల చేసిన లవ్ ఓటిపి టీమ్. ఒకరికి తెలియకుండా మరొకరిని ఇలా ఇద్దరమ్మాయిలను ఒకేసారి ప్రేమించి ఇబ్బందిపడే అబ్బాయిల కథలా ఉంది ‘లవ్ ఓటిపి’ ట్రైలర్. ప్రేమంటే అస్సలు పడని నాన్న పాత్రలో బెంగుళూరులో ఉండే పోలీసాఫీసర్‌గా రాజీవ్ కనకాల నటించారు.
భవప్రీతా ప్రొడక్షన్స్ పతాకంపై విజయ్ యం రెడ్డి నిర్మాతగా అనీష్, జాన్విక, స్వరూపిణిలు హీరో హీరోయిన్లుగా నటించిన ‘లవ్ ఓటిపి’ చిత్రం అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న సందర్భంగా ట్రైలర్‌ను శనివారం విడుదల చేసింది చిత్ర యూనిట్.
ఈ సందర్భంగా నిర్మాత విజయ్ యం రెడ్డి మాట్లాడుతూ–‘‘ ఫ్రెష్ కంటెంట్‌తో వచ్చిన ఏ సినిమాకైనా ఫుల్ డిమాండ్ ఉంటుంది అని అందరికి తెలుసు. మా ‘లవ్ ఓటిపి’ సినిమాతో ఎవరూ ఊహించని ఎంటర్‌టైన్‌మెంట్‌ని మీ ముందుకు తీసుకువస్తున్నాం. హీరో హీరోయిన్లతో పాటు ఈ కొత్త రకం తండ్రి కొడుకులను చూసి ప్రేక్షకులు ముచ్చటపడతారు. మా హీరో అనిషే ఈ సినిమా దర్శకుడు కూడా కాబట్టి ఈ సినిమా తర్వాత చాలా పెద్ద హీరోగా, మంచి దర్శకునిగా పేరు సంపాదించుకుంటాడని నేను గట్టిగా నమ్ముతున్నాను’’. అనీష్, జాన్విక, రాజీవ్ కనకాల, ప్రమోదిని, కాలకే రి, స్వరూపిణి, నాట్యరంగ, తులసి, అన్నపూర్ణ, చేతన్ గంథర్వ, రవి భట్ తదితరులు నటించారు…. ఈ చిత్రానికి సంగీతం– ఆనంద్ రాజా విక్రమ్, డిఓపి– హర్ష, ఎడిటర్ – శరత్, ఫైట్స్– విక్రమ్ మోర్, డాన్స్– బాబా భాస్కర్, పి.ఆర్.ఓ– శివమ్ మీడియా నిర్మాత– విజయ్ యం.రెడ్డి, రచన–దర్శకత్వం– అనీష్.
అర్జున్ కోలా దర్శకత్వంలో దినేష్ తేజ్, దష్విక.కె హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'తత్వం' త్రయతి ఇషాని క్రియేషన్స్, ఎస్.కె.ప్రొడక్షన్స్…
స్నేహా రెడ్డి అంటే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది స్టార్ హీరో అల్లు అర్జున్ భార్యగానే. అయితే ఆమె తనకంటూ…
‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ను అందరూ థియేటర్స్‌లో ఎంజాయ్ చేస్తారు.. సినిమా పెద్ద హిట్ అవుతుంది: దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి…
ఇటీవల జరిగిన నిర్మాతల మండలి ఎన్నికల్లో కోశాధికారిగా ఘనవిజయం సాధించినశ్రీ చదలవాడ శ్రీనివాసరావును ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ సీనియర్ సభ్యులు, కార్యవర్గం…
ఆదిత్య హాసన్ రచన చాలా బాగుంది.. ‘ఎపిక్’ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను: ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా…
ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం సెప్టెంబర్ 18న…