‘జైలర్’ ట్రైలర్ ని లాంచ్ చేసిన హీరో అక్కినేని నాగచైతన్య

Must Read

సూపర్ స్టార్ రజనీకాంత్, దర్శకుడు నెల్సన్ తొలిసారి కలసి చేస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘జైలర్‌’ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. యాక్షన్ కామెడీ ఎంటర్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో రజనీకాంత్ టైటిల్ రోల్‌లో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్‌పై కళానిధి మారన్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. కావాలయ్య, హుకుం పాటలు చార్ట్ బస్టర్స్ గా నిలిచాయి. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న జైలర్ థియేట్రికల్ ట్రైలర్ ని యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య లాంచ్ చేశారు.

రజనీకాంత్ పవర్ ఫుల్ ప్రెజెన్స్, పెర్ఫార్మెన్స్, స్వాగ్,  డైలాగ్ డెలివరీ, పవర్ ప్యాక్డ్ యాక్షన్ సీక్వెన్స్ తో ట్రైలర్ అద్భుతంగా వుంది. రజనీ తనదైన మార్క్ తో కట్టిపడేశారు. ఆసక్తికరమైన కథాంశంతో, ఆకట్టుకునే విజువల్స్ తో  ప్రేక్షకులకు సీట్ ఎడ్జ్ థ్రిల్ ని అందిస్తూ మెస్మరైజ్ చేసి క్యురియాసిటీని పెంచింది ట్రైలర్.

దర్శకుడు నెల్సన్ రజనీకాంత్ పాత్రని చాలా యూనిక్ అండ్ పవర్ ఫుల్ గా డిజైన్ చేసి తన దర్శకత్వ ప్రతిభతో ఆశ్చర్యపరిచాడు. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాలు వండర్ ఫుల్ గా వున్నాయి. అలాగే నెల్సన్ మార్క్ వినోదం  వుంది. ట్రైలర్ లో జాకీష్రాఫ్ సునీల్, రమ్యకృష్ణ ల ప్రజన్స్ కూడా ఆకట్టుకుంది.

అనిరుధ్ బ్రిలియంట్ బ్యాగ్ గ్రౌండ్ స్కోర్ యాక్షన్ ని మరింతగా ఎలివేట్ చేసింది. విజయ్ కార్తీక్ కన్నన్ కెమరాపనితనం ఎక్స్ టార్డినరిగా వుంది.  ట్రైలర్ చివర్లో ‘హుకుం.. టైగర్ కా హుకం’ అని రజనీ చెప్పిన డైలాగు అభిమానులను ఉర్రూతలూగించి అంచనాలని మరింతగా పెంచేసింది.

జైలర్ ఆగస్ట్ 10న విడుదల కానుంది. ఏషియన్ మల్టీప్లెక్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ సినిమా తెలుగు వెర్షన్‌ను విడుదల చేస్తోంది.

Latest News

తెలంగాణ ప్రభుత్వం అనుమతితో శ్రీతేజ్‌ను పరామర్శించిన ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌

సంధ్య థియేటర్‌ తొక్కిసలాటలో గాయపడి కిమ్స్‌ హస్పటల్‌లో చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ ఈ రోజు (బుధవారం) పరామర్శించారు. శ్రీతేజ్‌ యోగా...

More News