‘తిరగబడరసామీ’ యూత్ ఫుల్ ఫ్యామిలీ రొమాంటిక్ ఎంటర్ టైనర్

Must Read

యంగ్ అండ్ ప్రామెసింగ్ హీరో రాజ్ తరుణ్ కథానాయకుడిగా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ ఎ ఎస్ రవికుమార్ చౌదరి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘తిరగబడరసామీ’. సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్ మీడియా బ్యానర్ పై మల్కాపురం శివకుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మాల్వీ మల్హోత్రా, మన్నారా చోప్రా కథానాయికలుగా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ రామానాయడు స్టూడియోలో జరుగుతోంది. హీరో, హీరోయిన్, రాజా రవీంద్రపై కీలకమైన సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఈ షూటింగ్ లో చిత్ర యూనిట్ మీడియాతో సమావేశం అయ్యింది.

మీడియా సమావేశంలో హీరో రాజ్ తరుణ్ మాట్లాడుతూ..’తిరగబడరసామీ’ మంచి కమర్షియల్ ఎంటర్ టైనర్. రవికుమార్ చౌదరి గారి గత సినిమాల్లానే యాక్షన్ కామెడీ రోమాన్స్ ఎక్కడా తగ్గకుండా వుంటాయి. ఇవాళ రేపటి  తో  మొత్తం షూటింగ్ పూర్తవుతోంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడ చివరి దశలో వున్నాయి. అతి త్వరలో సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ నెలాఖరున లేదా వచ్చే నెలలో ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం. సినిమాని అందరూ ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను. అందరూ థియేటర్ లో సినిమా చూసి ఎంజాయ్ చేయాలి. పైరసీని మాత్రం ప్రోత్సహించవద్దు’’ అని కోరారు.

దర్శకుడు ఎ ఎస్ రవికుమార్ చౌదరి మాట్లాడుతూ..  మళ్ళీ హిట్టు కొట్టాలని ఘంటాపథంగా నిర్ణయించుకొని, కొంత సమయం తీసుకొని కసితో చేసిన సినిమా తిరగబడరసామీ. నిర్మాత శివకుమార్ గారు నన్ను నమ్మి ఈ ప్రాజెక్ట్ నా చేతిలో పెట్టినందుకు ఆయనకు ధన్యవాదాలు. ఇది నా గత సినిమాలకు తగ్గకుండా వుంటుంది.  ఎంటర్ టైన్ మెంట్, యాక్షన్, నా మార్క్ ఎమోషన్ తో పాటు ఇందులో యూత్ ఫుల్ రోమాన్స్ కూడా టచ్ చేశాను. తిరగబడరసామీ యూత్ ఫుల్ ఫ్యామిలీ రొమాంటిక్ ఎంటర్ టైనర్. ఒక పాయింట్ గా చెప్పాలంటే.. ఒక బంధాన్ని నిలుపుకోవడం కోసం భార్య భర్తలు, ప్రేమికులు ఎంతవరకూ వెళ్తారనేది చాలా వినోదాత్మకంగా చూపించాం. చాలా అద్భుతమైన లోకేషన్స్ వుంటాయి. జోహార్ రెడ్డి గారు మంచి విజువల్స్ ఇచ్చారు. జేబీ బ్యూటీఫుల్ సాంగ్స్ ఇచ్చారు. క్లైమాక్స్ లో వచ్చే పాట గూస్ బంప్స్ తెప్పిస్తుంది. ఈ సినిమాలో చాలా మంచి తారాగణం వుంది. మకరంద్ దేశ్‌పాండే గారు కీలక  పాత్ర చేశారు. దాదాపు పాత్రలన్నీ కీలకంగా వుంటాయి. రాజ్ తరుణ్ కి ఇది చాలా డిఫరెంట్ మూవీ. ఇందులో చాలా సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ చేశారు. ఈ సినిమాతో పరిపూర్ణమైన నటుడు అనిపించుకుంటాడు. ఈ సినిమాతో రాజ్ తరుణ్ పరిశ్రమలో మరో యాక్షన్ హీరో అవుతారని  ఘంటాపథంగా చెబుతున్నాను. ఇది నా ప్రామిస్. మాల్వి పాత్ర కూడా చాలా ఆసక్తికరంగా వుంటుంది. నటీనటులకు, సాంకేతిక నిపునులందరికీ ధన్యవాదాలు.’’ తెలిపారు.

నిర్మాత  మల్కాపురం శివకుమార్ మాట్లాడుతూ.. దర్శకుడు రవికుమార్ చౌదరి గారు చెప్పిన కథ అద్భుతంగా వుంది. రాజ్ తరుణ్ యాప్ట్ గా వుంటుంది.  దాదాపు షూటింగ్ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా చివరి దశలో వున్నాయి. ఈ సినిమా సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ కి మంచి పేరు తీసుకొస్తుంది. రవికుమార్ చౌదరి గారి గత చిత్రాల్లానే  మంచి సినిమాగా నిలుస్తుంది. రాజ్ తరుణ్ గారి సినిమా చూపిస్తా మామ లాంటి విజయవంతమైన చిత్రాల కోవలోకే ఈ సినిమా కూడా చేరుతుంది. మాల్వీ మల్హోత్రా కి ఇది మొదటి సినిమా. చాలా చక్కగా నటించింది. జవహర్ రెడ్డి గారు చాలా బ్యూటీఫుల్ విజువల్స్ ఇచ్చారు. జేబీ మంచి మ్యూజిక్ చేశారు. ఇందులో  మన్నారా చోప్రా, మకరంద్ దేశ్‌పాండే కీలకమైన పాత్రలు పోషించారు. అలాగే నటీనటులందరూ చక్కని అభినయం కనబరిచారు. ఈ సినిమాని ఈ నెలాఖరకు గానీ వచ్చే నెల మొదటి వారంలో గానీ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’ అన్నారు

మాల్వీ మల్హోత్రా మాట్లాడుతూ.. ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు కృతజ్ఞతలు. రాజ్ తరుణ్ కి జోడిగా నటించడం ఆనందంగా వుంది. ఇందులో చాలా క్యూట్ రోల్ లో కనిపిస్తా. డీవోపీ చాలా అందంగా చూపించారు. అందరూ కలసి మంచి టీం వర్క్ గా చేశాం. సినిమా విడుదల కోసం ఎదురుచూస్తున్నాను’ అన్నారు. ఈ ప్రెస్ మీట్ లో  రాజా రవీందర్,  డీఓపీ జవహర్ రెడ్డి, జబర్దస్త్ అప్పారావు, కమెడియన్ బద్రం, డైలాగ్ రైటర్ భాష్యశ్రీ పాల్గొన్నారు.

ప్రముఖ సాంకేతిక నిపుణులు ఈ చిత్రానికి పని చేస్తున్నారు. జెబి సంగీతం అందిస్తున్నారు. జవహర్ రెడ్డి కెమెరామెన్ గా పని చేస్తున్నారు. బస్వా పైడిరెడ్డి ఎడిటర్, రవికుమార్ గుర్రం ఆర్ట్ డైరెక్టర్. భాష్యశ్రీ డైలాగ్స్ అందిస్తున్నారు.

తారాగణం: రాజ్ తరుణ్ , మాల్వీ మల్హోత్రా, మన్నారా చోప్రా, మకరంద్ దేశ్‌పాండే, రఘు బాబు, జాన్ విజయ్, అంకిత ఠాకూర్, పృధ్వి, ప్రగతి, రాజా రవీంద్ర, బిత్రి సత్తి

సాంకేతిక విభాగం :
రచన, దర్శకత్వం: ఎ ఎస్ రవికుమార్ చౌదరి
నిర్మాత: మల్కాపురం శివకుమార్
బ్యానర్: సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్ మీడియా
సంగీతం: జెబి
డీవోపీ: జవహర్ రెడ్డి యం. ఎన్
ఎడిటర్: బస్వా పైడిరెడ్డి
ఆర్ట్:  రవికుమార్ గుర్రం
 ఫైట్స్ – పృద్వీ, కార్తీక్
మాటలు: భాష్యశ్రీ
పీఆర్వో: వంశీ శేఖర్

Latest News

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

More News