‘జనక అయితే గనక’ యుఎస్‌ఏ రైట్స్ తీసుకున్న హీరో సుహాస్‌

Must Read

దిల్‌రాజు ప్రొడక్షన్స్ పతాకంపై రూపొందుతోన్న  సినిమా ‘జనక అయితే గనక’. శిరీష్‌ సమర్పణలో హర్షిత్‌ రెడ్డి, హన్షిత రెడ్డి నిర్మించారు.  వెర్సటైల్‌ యాక్టర్‌ సుహాస్‌ హీరోగా నటించారు. సందీప్‌ రెడ్డి బండ్ల డైరక్ట్ చేశారు. సెప్టెంబర్‌ 7న ఈ సినిమా గ్రాండ్‌గా విడుదల కానుంది. సంగీర్తన హీరోయిన్‌గా నటించారు. ఈ సినిమా ఫైనల్‌ వెర్షన్‌ని చూసిన సుహాస్‌, యుఎస్‌ఏ హక్కులను సొంతం చేసుకున్నారు.  

సుహాస్‌ మాట్లాడుతూ ”ఫైనల్‌ వెర్షన్‌ చూశాను. చాలా బాగా నచ్చింది. వెంటనే యుఎస్‌ఏ హక్కులను తీసుకున్నాను. పక్కా ఎంటర్‌టైనింగ్‌ సినిమా అవుతుంది. ప్రతి దానికీ లెక్కలు చెప్పే మిడిల్‌ క్లాస్‌ అబ్బాయిగా ఈ సినిమాలో కనిపిస్తాను. తప్పకుండా ప్రేక్షకులు పడీ పడీ నవ్వుకుంటారు. మా డైరక్టర్‌ చాలా మంచి సినిమా చేశారు. దిల్‌రాజు గారు సపోర్ట్ చేసిన తీరు మర్చిపోలేం” అని అన్నారు.  

నటీనటులు: సుహాస్‌, సంగీర్తన, రాజేంద్రప్రసాద్‌, గోపరాజు రమణ తదితరులు
సాంకేతిక బృందం:
బ్యానర్‌: దిల్‌రాజు ప్రొడక్షన్స్
సమర్పణ: శిరీష్‌
నిర్మాతలు: హర్షిత్‌ రెడ్డి, హన్షితా రెడ్డి
రచన – దర్శకత్వం: సందీప్‌ బండ్ల
సంగీతం: విజయ్‌ బుల్గానిన్‌
డీఓపీ: సాయి శ్రీరామ్‌
ఎడిటర్‌: కోదాటి పవన్‌ కల్యాణ్‌
ప్రొడక్షన్‌ డిజైనర్‌: అరసవిల్లి రామ్‌కుమార్‌
కాస్ట్యూమ్ డిజైనర్‌: భరత్‌ గాంధీ
ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: అకుల్‌
పీఆర్‌ఓ: వంశీకాకా.

Latest News

రాఘవేంద్రరావు గారి చేతుల మీదుగా ‘అభిమాని’ మూవీ గ్లింప్స్‌ విడుదల

సినీ జర్నలిస్ట్, నిర్మాత సురేష్ కొండేటి సోషల్ మీడియాలో చాలా పాపులర్ అయ్యారు. ఇప్పటికే దేవినేని సహా అనేక సినిమాలతో ప్రేక్షకులను అలరించిన సురేష్ కొండేటి...

More News