“పోలీస్ వారి హెచ్చరిక” ఫస్ట్ లుక్ ను ఆవిష్కరించిన హీరో శ్రీకాంత్

అభ్యుదయ దర్శకుడు బాబ్జీ దర్శకత్వంలో తూలిక తనిష్క్ క్రియేషన్స్ పతాకంపై బెల్లి జనార్థన్ నిర్మిస్తున్న “పోలీస్ వారి హెచ్చరిక” చిత్రం ఫస్ట్ లుక్ ను హీరో శ్రీకాంత్ తన నివాసం లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ “టైటిల్ ఎంత ఆకర్షణీయం గా ఉందో ఫస్ట్ లుక్ కూడా అంతే ఆకర్షణీయంగా ఉందని, ఎవరినైనా తాళ్ళతోనో , సంకెళ్ళతోనో కట్టి బంధిస్తారని, కానీ ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ లో ఒక పోలీస్ ను తుపాకులతో కట్టి బంధించడం నిజంగా కొత్తగా ఉందని , ఎప్పుడూ కొత్త కథల తో , కొత్త ఆలోచనలతో అడుగులేసే దర్శకుడు బాబ్జీ ఈ సినిమాతో మంచి సక్సెస్ సాధిస్తాడని నాకు గట్టి నమ్మకం ఉందని” ఉద్ఘాటించారు.

“సినీ పరిశ్రమలో నేను అన్నయ్య అని పిలిచేది హీరో శ్రీకాంత్ గారిని మాత్రమేనని, మంచి మనసున్న శ్రీకాంత్ గారి చేతులమీదుగా ఫస్ట్ లుక్ ను విడుదల గావించుకున్న మా “పోలీస్ వారి హెచ్చరిక” చిత్రాన్ని మంచి మనసున్న ప్రేక్షక మహాశయులు గొప్పగా ఆదరిస్తారనే నమ్మకం మాకుందని” దర్శకుడు బాబ్జీ అన్నారు.

నిర్మాత బెల్లి జనార్థన్ మాట్లాడుతూ “ఎప్పటికైనా హీరో శ్రీకాంత్ గారితో ఒక ఫోటో దిగాలనుకున్నాను , అటువంటిది యీ రోజు నా సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ నే ఆయన ఆవిష్కరించడం నేను చేసుకున్న అదృష్టం. గతంలో కూడా హీరో శ్రీకాంత్ గారు మా సినిమా నుండి క్యారెక్టర్లు చేస్తూ ఎంతగానో సహాయపడ్డారు” అన్నారు.

ఈ కార్యక్రమం లో యీ చిత్ర కథానాయకుడు సన్నీ అఖిల్, నటి జయ వాహిని, ప్రాజెక్టు కో ఆర్డినేటర్ యస్, హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి.

తారాగణం :
సన్నీ అఖిల్ , గిడ్డేష్ , అజయ్ ఘోష్ , రవి కాలే , షియాజీ షిండే , శుభలేఖ సుధాకర్ , కాశీ విశ్వనాథ్ , జబర్దస్త్ వినోద్ , జబర్దస్త్ పవన్ , హిమజ , జయ వాహిని , మేఘనా ఖుషి , శంకరాభరణం తులసి తదితరులు.

సాంకేతిక నిపుణులు :
సంగీతం : గజ్వేల్ వేణు
కెమెరా : కిషన్ సాగర్, కె. నళినీ కాంత్
ఎడిటింగ్ : శివ శర్వాణి
ప్రాజెక్ట్ కో ఆర్డినేటర్ : యస్.హనుమంత రావు
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : ఎన్ . పి . సుబ్బారాయుడు
నిర్మాత : బెల్లి జనార్థన్
రచన , దర్శకత్వం : బాబ్జీ
పిఆర్ఓ : మధు విఆర్
డిజిటల్ : డిజిటల్ దుకాణం

Tfja Team

Recent Posts

సమంత యాక్షన్ కామెడీ ఫ్యామిలీ డ్రామా ‘మా ఇంటి బంగారం’ నుంచి ఫస్ట్ సింగిల్ ‘తస్సాదియ్యా’ విడుదల.. మే 15న మూవీ గ్రాండ్ రిలీజ్

ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ మీద సమంత, రాజ్ నిడిమోరు, హిమాంక్ దువ్వూరు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘మా ఇంటి…

23 hours ago

‘లెనిన్‌’ నుంచి సెకండ్ సాంగ్ ‘ఎట్టా ఎట్టా’ రిలీజ్‌

యంగ్ అండ్ డైన‌మిక్ హీరో అఖిల్ అక్కినేని లేటెస్ట్ మూవీ ‘లెనిన్‌’ శరవేగంగా రూపొందుతోంది. ఈ సినిమాపై మంచి అంచ‌నాలు…

23 hours ago

మలయాళంలో బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించిన “పళ్లిచట్టంబి” తెలుగులోనూ ఆ సక్సెస్ రిపీట్ చేస్తుంది – మూవీ ప్రొడ్యూసర్స్ చాణక్య, చైతన్య, చరణ్

మలయాళ స్టార్ హీరో టొవినో థామస్ నటించిన భారీ బడ్జెట్ మూవీ "పళ్లిచట్టంబి". ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్ ఫిలింస్,…

23 hours ago

‘సైయారా’ కాంబోలో మరో క్రేజీ ప్రాజెక్ట్

గ‌త ఏడాది బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ ‘సైయారా’ కాంబో మ‌ళ్లీ మ‌న ముందుకు రావ‌టానికి స‌మాయ‌త్త‌మ‌వుతోంది. సైయారా అద్భుత విజయంతో…

2 days ago

ఎమ్మెస్ రాజు దర్శకత్వంలోతెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో‘అగధ’

ఎమ్మెస్ రాజు అంటే ఒక బ్రాండ్. సుమంత్ ఆర్ట్స్ పతాకంపై ఆయన నిర్మించిన "శత్రువు, దేవి, మనసంతా నువ్వే, ఒక్కడు,…

2 days ago

మీర్జాపురంరాణి కృష్ణవేణి ఈ తరానికి స్ఫూర్తి -ఎం.వెంకయ్య నాయుడు

అలనాటి నటి, గాయని, నిర్మాత కృష్ణవేణమ్మ జీవితాన్ని గ్రంధస్తం చెయ్యడం ఎంతో సంతోషంగా ఉందని, ఆమె జీవితం నేటి తరానికి…

2 days ago