‘సోల్ ఆఫ్ లెనిన్’కి థియేటర్లలో అద్భుతమైన స్పందన.. జూన్ 26న ‘మనోడు వస్తున్నాడు’

మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగ వంశీ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘లెనిన్’. అఖిల్ అక్కినేని, భాగ్యశ్రీ బోర్సే ప్రధాన పాత్రలలో నటించిన ఈ మూవీకి మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహించారు. ఈ చిత్రం జూన్ 26న థియేటర్లలో ఘనంగా విడుదల కానుంది.

ఇప్పటివరకు విడుదలైన పోస్టర్లు, పాటలు ప్రేక్షకుల్లో అంచనాలు మరింతగా పెంచేశాయి. ఇటీవల మేకర్స్ ‘సోల్ ఆఫ్ లెనిన్’ అంటూ ఆడియెన్స్‌ని సర్ ప్రైజ్ చేశారు. ‘పెద్ది’ సినిమా ప్రస్తుతం థియేటర్లో సందడి చేస్తోంది. ‘పెద్ది’ ప్రదర్శనలకు ఈ ‘సోల్ ఆఫ్ లెనిన్’ను జోడించారు. ఈ ఉద్వేగభరితమైన, పవర్ ఫుల్ పాటకు బ్లాక్‌బస్టర్ స్పందన లభించింది. సినీ లవర్స్ ఈ పాట, అందులోని క్లిప్స్‌ను ఆన్‌లైన్‌లో షేర్ చేస్తూ అద్భుతంగా ఉందని కామెంట్లు పెడుతున్నారు.

ఈ పాటలో అఖిల్ అక్కినేని, భాగ్యశ్రీ బోర్సే మధ్య ఉండే ప్రేమ, వారి బాండింగ్‌ను చక్కగా చూపించారు. ‘ప్రేమ కంటే గొప్ప యుద్ధం లేదు’ అనే క్యాప్షన్‌తో ఈ పాట సినిమాపై అంచనాలను మరో స్థాయికి తీసుకెళ్లింది. ప్రేమ కోసం అఖిల్ చేసే పోరాటం, భాగ్యశ్రీ ఆకట్టుకునే నటన ఈ పాటకు మరింత అదనపు ఆకర్షణను జోడించాయి. థమన్ స్వరపరిచిన ఈ పాట ప్రేక్షకులను కట్టిపడేస్తోంది.

కళ్యాణ్ చక్రవర్తి సాహిత్యం, వాగ్దేవి గాత్రం ఈ పాటను మరింత అందంగా మలిచాయి. ఈ పాటలోని ప్రతి ఫ్రేమ్, ప్రతి విజువల్ భావోద్వేగాలతో కూడిన ఒక కొత్త ఎక్స్‌పీరియెన్స్‌ను అందిస్తుందని హామీ ఇస్తున్నాయి. అఖిల్ మాస్ అప్పీల్, యాక్టింగ్, ఎమోషన్స్ అన్నీ కూడా ఈ పాటలో కనిపిస్తున్నాయి. పాటలు, గ్లింప్స్, పోస్టర్లతోనే సినిమాపై అంచనాలను గణనీయంగా పెరిగాయి.

ఈ చిత్రానికి సంగీతాన్ని థమన్ ఎస్ అందించారు. పాటలు, నేపథ్య సంగీతం ఈ సినిమా స్థాయిని మరింత పెంచుతాయని భావిస్తున్నారు. లియోన్ బ్రిట్టో సినిమాటోగ్రఫర్‌గా, నవీన్ నూలి ఎడిటర్‌గా పనిచేస్తున్నారు.

ఈ చిత్రం జూన్ 26, 2026న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

తారాగణం: అఖిల్ అక్కినేని, భాగ్యశ్రీ బోర్సే, శివాజీ తదితరులు

సాంకేతిక సిబ్బంది:
బ్యానర్స్ : మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్‌ఎల్‌పి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్
నిర్మాతలు: అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ
సమర్పణ: అన్నపూర్ణ స్టూడియోస్
రచయిత, దర్శకుడు: మురళి కిషోర్ అబ్బూరు
సంగీతం: థమన్ ఎస్
ఎడిటర్: నవీన్ నూలి
సినిమాటోగ్రఫీ: లియోన్ బ్రిట్టో
ప్రొడక్షన్ డిజైనర్: అవినాష్ కొల్లా

TFJA

Recent Posts

జూన్ 19న గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోన్న విజయ్ ఆంటోని ‘వంద దేవుళ్ళు’

విజయ్ ఆంటోని చిత్రాలకు తెలుగులో ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎప్పుడూ డిఫరెంట్ కంటెంట్, భిన్న…

2 days ago

ఎస్వీ కృష్ణారెడ్డి లాంటి గొప్ప దర్శకుల వల్లే బ్రహ్మాండమైన సినిమాలు వచ్చాయి – ప్రముఖ నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు

లెజెండరీ డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డి 75వ జన్మదినోత్సవం హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు చిత్ర పరిశ్రమ…

3 days ago

38 చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించిన దర్శకుడిగా ఎస్వీ కృష్ణారెడ్డికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇంటర్నేషనల్ నుంచి వరల్డ్ రికార్డ్ గుర్తింపు

సకుటుంబ కథా చిత్రాలతో తెలుగు తెరకు మిరుమిట్లు గొలిపే విజయాలు అందించిన దిగ్దర్శకులు ఎస్వీ కృష్ణారెడ్డి ప్రస్తుతం తన 43వ…

4 days ago

ఛాట్ బస్టర్స్ గా దూసుకెళ్తున్న “చెన్నై లవ్ స్టోరీ” మూవీ సాంగ్స్, జూలైలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతున్న సినిమా

హీరో కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరి ప్రియ జంటగా "కలర్ ఫొటో", "బేబి" వంటి కల్ట్ క్లాసిక్ మూవీస్ ప్రేక్షకులకు…

6 days ago

లెజెండరీ దర్శకుడు, స్వర్గీయ దర్శకరత్న దాసరి నారాయణరావు ఘాట్‌ని పునరుద్ధరించిన ‘రా కింగ్’ మనోజ్ మంచు

దిగ్గజ దర్శకుడు, దర్శక రత్న దాసరి నారాయణరావు ఘాట్ దుస్థితిపై సోషల్ మీడియాలో యాంకర్ గౌతమి ఓ వీడియో షేర్…

6 days ago

కళావేదిక ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్ – 2026 ఘనంగా నిర్వహణ

తెలుగు చలనచిత్ర రంగానికి విశిష్ట సేవలందించిన కళాకారులు, సాంకేతిక నిపుణులను సత్కరించేందుకు నిర్వహించిన “కళావేదిక ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్ –…

1 week ago