జూన్ 19న గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోన్న విజయ్ ఆంటోని వంద దేవుళ్ళు

విజయ్ ఆంటోని చిత్రాలకు తెలుగులో ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎప్పుడూ డిఫరెంట్ కంటెంట్, భిన్న ప్రాజెక్టులతో ప్రేక్షకుల్ని మెప్పిస్తూనే ఉంటారు. ‘బిచ్చగాడు’తో హీరోగా విజయ్ ఆంటోని, దర్శకుడిగా శశికి వచ్చిన ఫాలోయింగ్ అందరికీ తెలిసిందే. మళ్లీ ఇన్నేళ్ల గ్యాప్‌ తరువాత విజయ్ ఆంటోని హీరోగా, శశి దర్శకత్వంలో ‘వంద దేవుళ్ళు’ అనే చిత్రం రాబోతోంది. ఇప్పటి వరకు ఈ సినిమా నుంచి వచ్చిన పోస్టర్లు, గ్లింప్స్, పాటలు ఆడియెన్స్‌లో బజ్‌ను పెంచేశాయి. ఇక తాజాగా ఈ మూవీకి సంబంధించిన రిలీజ్ డేట్‌‌ను ప్రకటించారు.

విజయ్ ఆంటోని ఫిల్మ్ కార్పోరేషన్, ఫాతిమా విజయ్ ఆంటోనీ సమర్పణలో.. సర్వంత్ రామ్ క్రియేషన్స్ బ్యానర్ మీద రామంజనేయులు జవ్వాజి నిర్మించిన ఈ మూవీని జూన్ 19న విడుదల చేయబోతోన్నట్టుగా ప్రకటించారు. ఈ సినిమాలో విజయ్ ఆంటోని, స్వాసిక, అజయ్, కావ్య, శక్తి, పదిని, కర్నాస్, బాలాజీ శక్తివేల్, దివాకర్, అరుళ్ దాస్, బక్స్, వినోదిని, మునిష్ కాంత్, కొడంగి వడివేలు తదితరులు ముఖ్య పాత్రల్ని పోషించారు.

రిలీజ్ డేట్ ప్రకటిస్తూ వదిలిన పోస్టర్ ఎంతో ఇంప్రెస్సివ్‌గా ఉంది. ఈ పోస్టర్‌లో హీరో, హీరోయిన్ కనిపిస్తున్న తీరు, సైకిల్‌ మీద సింపుల్‌గా వెళ్తున్న తీరు చూస్తుంటే ఇదొక పీరియాడిక్ డ్రామా అని అర్థం అవుతోంది.

ఫ్యామిలీ, ఎమోషన్స్, యాక్షన్, సస్పెన్స్, థ్రిల్లింగ్ ఇలా అన్ని రకాల ఎలిమెంట్స్‌తో ‘వంద దేవుళ్ళు’ సినిమాని రూపొందించారు. ఈ సినిమాకి ఎస్. బి. దర్శన్ కిర్లోష్ కెమెరామెన్‌గా, బాలాజీ శ్రీరామ్ సంగీత దర్శకుడిగా పని చేశారు. హరిష్ యువరాజ్ ఎడిటర్‌గా, భాష్య శ్రీ డైలాగ్ రైటర్‌గా వర్క్ చేశారు. ఇక ఈ మూవీని జూన్ 19న గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతోన్నారు.

నటీనటులు : విజయ్ ఆంటోని, స్వాసిక, అజయ్, కావ్య, శక్తి, పదిని, కర్నాస్, బాలాజీ శక్తివేల్, దివాకర్, అరుళ్ దాస్, బక్స్, వినోదిని, మునిష్ కాంత్, కొడంగి వడివేలు తదితరులు

సాంకేతిక బృందం

బ్యానర్ : విజయ్ ఆంటోని ఫిల్మ్ కార్పోరేషన్, సర్వంత్ రామ్ క్రియేషన్స్
సమర్పణ : ఫాతిమా విజయ్ ఆంటోని
నిర్మాత : రామంజనేయులు జవ్వాజి
దర్శకుడు : శశి
సంగీతం : బాలాజీ శ్రీరామ్
డీఓపీ : ఎస్. బి. దర్శన్ కిర్లోష్
ఎడిటర్ : హరిష్ యువరాజ్
మాటలు : భాష్య శ్రీ
పీఆర్వో : సాయి సతీష్

TFJA

Recent Posts

పాన్ ఇండియా సినిమాలు తీస్తున్న డైరెక్టర్లందరికీ ఇది ఒక పాఠం — ఇరుముడి చూసి నేర్చుకోవాల్సిన సమయం వచ్చింది!

ఇరుముడి సినిమా కలెక్షన్స్ చూస్తుంటే అసలు నమ్మశక్యం కాని విధంగా ఉన్నాయి. సినిమా చరిత్రలో ఇలాంటి కలెక్షన్స్, ఇలాంటి జనసందోహం…

5 minutes ago

కోకాపేటలో మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా మొక్కలు నాటిన ఏపీ గ్రీన్ ఛైర్మన్ & ఎమ్మెల్సీ కొణిదల నాగేంద్రబాబు

మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని (ఆగస్టు 22) పురస్కరించుకుని ప్రముఖ నటుడు, నిర్మాత, ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యులు (MLC), ఏపీ గ్రీన్…

22 hours ago

గబ్బర్ సింగ్ రమేష్‌కు మెగా కుటుంబం అండ — చిరంజీవి గారి జన్మదిన వేడుకల్లో గబ్బర్ సింగ్ టీమ్

మెగాస్టార్ చిరంజీవి గారి జన్మదిన వేడుకలను గబ్బర్ సింగ్ టీమ్ ఘనంగా నిర్వహించింది. ఈ సందర్భంగా చిరంజీవి గారి నివాసంలో…

22 hours ago

సూపర్ హిట్ టాక్, భారీ బుకింగ్స్ తో బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తున్న నివిన్ పాలీ “బెత్లెహెం కుడుంబ యూనిట్” సినిమా

మలయాళ స్టార్ హీరో నివిన్ పాలీ మరో సూపర్ హిట్ అందుకున్నారు. ఆయన హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ "బెత్లెహెం…

22 hours ago

కంటెంట్‌ ఈజ్‌ కింగ్‌ అని హుషార్‌ పిట్టలు మరోసారి నిరూపించింది: నిర్మాత వెంకట్‌ యాదవ్‌తొలివారంలో 5 కోట్ల 27 లక్షల గ్రాస్‌ సాధించిన హుషార్‌ పిట్టలు

అన్షు, వాసవి గణేషన్‌ జంటగా రూపొందిన యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ చిత్రం 'హుషార్‌ పిట్టలు'. పద్మ అమ్మ, బీవీజీ స్టూడియెస్‌ సమర్పణలో…

22 hours ago