ఛాట్ బస్టర్స్ గా దూసుకెళ్తున్న “చెన్నై లవ్ స్టోరీ” మూవీ సాంగ్స్, జూలైలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతున్న సినిమా

హీరో కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరి ప్రియ జంటగా “కలర్ ఫొటో”, “బేబి” వంటి కల్ట్ క్లాసిక్ మూవీస్ ప్రేక్షకులకు అందించిన మేకర్స్ ఎస్ కేఎన్, సాయి రాజేశ్ కాంబినేషన్ లో రూపొందుతున్న సినిమా “చెన్నై లవ్ స్టోరీ”. ఈ చిత్రాన్ని అమృత ప్రొడక్షన్స్, మాస్ మూవీ మేకర్స్ బ్యానర్స్ పై ఎస్ కేఎన్, సాయి రాజేశ్ నిర్మిస్తున్నారు. సాయి రాజేశ్ కథను అందిస్తున్న ఈ చిత్రానికి రవి నంబూరి దర్శకత్వం వహిస్తున్నారు. మెలొడీ బ్రహ్మ మణిశర్మ “చెన్నై లవ్ స్టోరీ” సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు.

ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన సాంగ్స్ మ్యూజిక్ లవర్స్ ఆదరణతో ఛాట్ బస్టర్స్ గా మారుతున్నాయి. ఫస్ట్ సింగిల్ ‘తొలి ప్రేమేం తోపు కాదే..’ ఇప్పటికే హ్యూజ్ రెస్పాన్స్ తెచ్చుకోగా, రీసెంట్ గా ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి చేతుల మీదుగా రిలీజ్ చేసిన సెకండ్ సింగిల్ ‘వదలనే..’ పాట కూడా ఇన్ స్టంట్ గా సక్సెస్ అయ్యింది. ఇలా రిలీజ్ చేసిన ప్రతి పాట ప్రేక్షకుల ఆదరణ పొందుతూ “చెన్నై లవ్ స్టోరీ” సినిమా మ్యూజికల్ గా బ్లాక్ బస్టర్ జర్నీ చేస్తోంది. ప్రస్తుతం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు ఫుల్ స్వింగ్ లో జరుగుతున్నాయి. జూలైలో ఈ చిత్రాన్ని గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకొచ్చేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

నటీనటులు – కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరి ప్రియ, తదితరులు

టెక్నికల్ టీమ్

కాస్ట్యూమ్ డిజైనర్ – దేవి పర్చూరి
ఆర్ట్ – భాస్కర్ ముదావత్
ఎడిటర్ – సంతోష్ నాయుడు
డీవోపీ – విశ్వాస్ డేనియల్
లిరిక్స్ – అనంత్ శ్రీరామ్
మ్యూజిక్ డైరెక్టర్ – మణిశర్మ
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – విశాల దాట్ల
లైన్ ప్రొడ్యూసర్ -శ్యామ్ ప్రసాద్ మేక
పీఆర్ఓ – జీఎస్ కే మీడియా (సురేష్ – శ్రీనివాస్), వంశీ కాకా
మార్కెటింగ్ – హౌస్ ఫుల్
కో ప్రొడ్యూసర్ – ధీరజ్ మొగిలినేని
స్టోరీ – సాయి రాజేశ్
నిర్మాతలు – ఎస్ కేఎన్, సాయి రాజేశ్
స్క్రీన్ ప్లే, డైరెక్షన్ – రవి నంబూరి

TFJA

Recent Posts

”తత్వం” సాధించే విజయంతో మా కష్టాలన్నీ మరిచిపోతాం: యువ దర్శకుడు అర్జున్‌ కోలా

అర్జున్‌ కోలా దర్శకత్వంలో దినేష్‌ తేజ్‌, దష్విక.కె హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'తత్వం' త్రయతి ఇషాని క్రియేషన్స్‌, ఎస్‌.కె.ప్రొడక్షన్స్‌…

5 hours ago

తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి

స్నేహా రెడ్డి అంటే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది స్టార్ హీరో అల్లు అర్జున్ భార్యగానే. అయితే ఆమె తనకంటూ…

5 hours ago

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ చిత్రం గొప్ప విజ‌యాన్ని సాధించాల‌ని కోరుకుంటున్నా: ప‌్రీ రిలీజ్ ఈవెంట్‌లో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ను అంద‌రూ థియేట‌ర్స్‌లో ఎంజాయ్ చేస్తారు.. సినిమా పెద్ద హిట్ అవుతుంది: ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి…

5 hours ago

చదలవాడ శ్రీనివాసరావుకు శుభాకాంక్షలు తెలిపిన ఫిలింక్రిటిక్స్ అసోసియేష్‌న్‌

ఇటీవల జరిగిన నిర్మాతల మండలి ఎన్నికల్లో కోశాధికారిగా ఘనవిజయం సాధించినశ్రీ చదలవాడ శ్రీనివాసరావును ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ సీనియర్ సభ్యులు, కార్యవర్గం…

3 weeks ago

‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ ఆనంద్ దేవరకొండ ఫిల్మోగ్రఫీలో ఒక బ్యూటిఫుల్ సినిమాగా నిలుస్తుంది: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ

ఆదిత్య హాసన్ రచన చాలా బాగుంది.. ‘ఎపిక్’ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను: ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా…

3 weeks ago

ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ ద్వారాసెప్టెంబర్ 18న‘పిఠాపురంలో… అలా మొదలైంది’ విడుదల—ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో…

ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం సెప్టెంబర్ 18న…

3 weeks ago