సిద్ధు జొన్నలగడ్డ బర్త్ డే స్పెషల్ ట్రీట్‌గా ‘జాక్’ టీజర్.

స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ పుట్టిన రోజు (ఫిబ్రవరి 7) సందర్భంగా ‘జాక్ – కొంచెం క్రాక్’ నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. సిద్ధు బర్త్ డే స్పెషల్‌గా మేకర్లు జాక్ టీజర్‌‌ను విడుదల చేశారు. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఏప్రిల్ 10న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. సిద్ద, భాస్కర్‌ కాంబోలో అదిరిపోయే ఓ వినోదాత్మక చిత్రం రాబోతోందనీ టీజర్ స్పష్టంగా చెబుతోంది.

టీజర్‌లో సీనియర్ నటుడు నరేష్, సిద్దు మధ్య వచ్చే తండ్రీ కొడుకులకు సంబంధించిన స‌న్నివేశాలు ప్రేక్ష‌కుల‌కు న‌వ్వులు పంచుతాయ‌ని అర్థం అవుతుంది. ఇక హీరోల పాత్రలోని డిఫరెంట్ షేడ్స్ ఈ టీజర్‌లో చూపించాడు. అసలు హీరో ఏంటి? ఏ ఉద్యోగం చేస్తున్నాడు? అతని లక్ష్యం ఏంటి? అతని గమ్యం ఏంటి? ఆ పోరాటాలు ఏంటి? ఈ ప్రేమ కథ ఏంటి? అని ఇలా రకరకాల ప్రశ్నలు తలెత్తేలా, సినిమా మీద ఆసక్తి పెంచేలా టీజర్‌ను కట్ చేశారు. సిద్దు నుంచి మరొక బ్లాక్ బస్టర్ రాబోతోందని ఈ టీజర్ చెప్పకనే చెబుతోంది. సిద్దు స్టైలీష్ లుక్స్, యాక్టింగ్‌కు మరోసారి ఆడియెన్స్ మెస్మరైజ్ కానున్నారు.

వైష్ణవి చైతన్య, సిద్దు జంట చాలా రిఫ్రెషింగ్‌గా అనిపిస్తోంది. బొమ్మరిల్లు భాస్కర్ ఈ సారి తన శైలిని పూర్తిగా పక్కన పెట్టి ఏదో సందేశాన్ని ఇస్తూనే కావాల్సినంత ఎంటర్‌టైన్‌మెంట్‌ను జోడించారని అర్థం అవుతోంది. ప్రముఖ నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ నేతృత్వంలోని అగ్ర నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ప్రస్తుతం చిత్రీకరణ తుదిదశకు చేరుకుంది. ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్, బ్రహ్మాజీ వంటి వారు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం అచ్చు రాజమణి స్వరాలు సమకుర్చారు.

Tfja Team

Recent Posts

ప్రముఖ దర్శక నిర్మాత మధుర శ్రీధర్ రెడ్డి ముఖ్య అతిథిగా ఘనంగా “స్కై” సినిమా ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్, ఫిబ్రవరి 6న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న మూవీ

మురళీ కృష్ణంరాజు, శృతి శెట్టి, ఆనంద్ ప్రధాన పాత్రల్లో వేలార్ ఎంటర్ టైన్ మెంట్ స్టూడియోస్ బ్యానర్ పై నాగిరెడ్డి…

7 hours ago

ఈ సంక్రాంతి ఏడు తరాలు అటు, ఏడు తరాలు ఇటు గుర్తుండిపోతుంది: ‘అనగనగా ఒక రాజు’ విజయోత్సవ వేడుకలో స్టార్ ఎంటర్‌టైనర్ నవీన్‌ పొలిశెట్టి

సంక్రాంతి కానుకగా జనవరి 14న థియేటర్లలో అడుగుపెట్టి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న చిత్రం 'అనగనగా ఒక…

12 hours ago

వైభవంగా జరిగిన హీరో సతీష్ జై కుమార్తె ‘నైరా ‘ పుట్టినరోజు వేడుక

అంతకుమించి చిత్రం పేం సతీష్ జై, డాక్టర్ మైత్రి షరణ్ ల కుమార్తె "నైరా" మొదటి పుట్టినరోజు వేడుకలు ఇటీవల…

1 day ago

హీరోలు సందీప్ కిషన్, విశ్వక్ సేన్ చేతుల మీదుగా హీరో తిరువీర్ “భగవంతుడు” మూవీ టీజర్ రిలీజ్

యంగ్ టాలెంటెడ్ హీరో తిరువీర్ నటిస్తున్న కొత్త సినిమా "భగవంతుడు". ఈ సినిమాలో ఫరియా అబ్దుల్లా హీరోయిన్‌గా నటిస్తోంది. కన్నడ…

1 day ago

ఘనంగా తిరుపతిలో ‘సుమతి శతకం’ చిత్ర టైలర్ లాంచ్ ఈవెంట్ – ఫిబ్రవరి 6వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల

విజన్ మూవీ మేకర్స్ బ్యానర్ పై సాయి సుధాకర్ కొమ్మాలపాటి నిర్మాతగా ఎంఎం నాయుడు రచన దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు…

1 day ago