తల మూవీ నుంచి ‘ప్రేమ కుట్టిందంటే’ లిరికల్ వీడియో సాంగ్ విడుదల

అమ్మ రాజశేఖర్ దర్శకత్వంలో ఆయన తనయుడు అమ్మ రాగిన్ రాజ్ హీరోగా రూపొందిన సినిమా తల. రీసెంట్ గా మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి చేతుల మీదుగా విడుదలైన ఈ మూవీ తమిళ్, తెలుగు ట్రైలర్ కు అద్భుతమైన స్పందన వచ్చింది. చూసిన వాళ్లంతా సూపర్బ్ అని మెచ్చుకుంటున్నారు. రణం తర్వాత అంతకు మించిన బ్లాక్ బస్టర్ ను అందుకోబోతున్నాడు అమ్మ రాజశేఖర్ అనే టాక్ కూడా వినిపిస్తోంది.
తాజాగా ఈ చిత్రం నుంచి ‘ప్రేమ కుట్టిందంటే’ అనే లిరికల్ వీడియో సాంగ్ ను విడుదల చేశారు. పాట వినగానే ఇమ్మీడియెట్ గా కనెక్ట్ అయిపోయేలా ఉంది.

బిగ్ బాస్ ఫేమ్ ఎనర్జిటిక్ సింగర్ భోలే షావలీ పాడిన ఈ గీతాన్ని మ్యూజిక్ డైరెక్టర్ ధర్మతేజ రాశాడు. విశేషం ఏంటంటే.. ఈ పాటను తమిళ్ లో మల్టీ టాలెంటెడ్ లెజెండరీ పర్సనాలిటీ టి రాజేందర్ పాడారు. ఇలాంటి హుషారైన గీతాలకు టి. రాజేందర్ పెట్టింది పేరు. అందుకే ఈ పాట తమిళ్ లోనూ ఊపేస్తోంది.

ప్రధానంగా ఈ పాటను కమెడియన్ ముక్కు అవినాష్ పై చిత్రీకరించారు. ప్రేమలో పడితే ఎదురయ్యే సమస్యలు, కష్టాలు ఎలా ఉంటాయో అతను వివరిస్తున్నట్టుగా ఉంది సాహిత్యం. రణం చిత్రంలో అలీపై చిత్రీకరించిన ‘నమ్మొద్దు నమ్మొద్దూ ఆడవాళ్లను నమ్మొద్దూ’ అనే పాట ఎంత పెద్ద హిట్ అయిందో అంతకు మించిన హిట్ అయ్యే పాటలా ఉంది.
‘చీమ ఎక్కడ కుడితే అక్కడే మంట పడుతుందయా.. దోమ కుట్టిందంటే వస్తుంది మలేరియా.. కానీ ప్రేమ కుట్టిందంటే పిచ్చెక్కిపోతుందయా’ అంటూ మొదలైన ఈ పాటలో ఈ తరం యూత్ కు బాగా నచ్చేలా ఉంది సాహిత్యం. ప్రేమలో పడితే అమ్మాయిలు పెట్టించే ఖర్చులు, వారు పెట్టే ఇబ్బందులు తెలుపుతూ ఆఖర్లో ప్రేమ గురించి అడిగితే ‘హూ ఆర్ యూ’ అందిరా అంటూ వచ్చే ఫినిషింగ్ టచ్ ఆకట్టుకుంటుంది.
ఈ చిత్రాన్ని ఈ నెల 14న వాలెంటైన్స్ డే సందర్భంగా విడుదల చేయబోతున్నారు.

దర్శకుడు: అమ్మ రాజశేఖర్
నిర్మాత : శ్రీనివాస గౌడ్
బ్యానర్: దీపా ఆర్ట్స్
నటీనటులు: అమ్మ రాగిన్ రాజ్, అంకిత నస్కర్, రోహిత్, ఎస్తేర్ నోరోన్హ, ముక్కు అవినాశ్, సత్యం రాజేశ్, అజయ్, విజ్జి చంద్రశేఖర్, రాజీవ్ కనకాల, ఇంద్రజ, శ్రవణ్
రైటర్స్: అమ్మ రాజశేఖర్
డీఓపీ: శ్యామ్ కె నాయుడు
సాంగ్: థమన్ ఎస్‌ఎస్
మ్యూజిక్ డైరెక్టర్: ధర్మ తేజ, అస్లాం కేఈ
బీజీఎం: అస్లాం కేఈ
డైలాగ్స్: అమ్మ రాజశేఖర్ అండ్ టీం
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: రాధ రాజశేఖర్
ఆర్ట్ డైరెక్టర్: రామకృష్ణ
డ్యాన్స్ కొరియోగ్రాఫర్స్: అమ్మ రాజశేఖర్
లిరిసిస్ట్స్: ధర్మతేజ
ఎడిటర్ : శివ సామి
పీఆర్వో: మధు వీఆర్
డిజిటల్ మీడియా : డిజిటల్ దుకాణం

Tfja Team

Recent Posts

”తత్వం” సాధించే విజయంతో మా కష్టాలన్నీ మరిచిపోతాం: యువ దర్శకుడు అర్జున్‌ కోలా

అర్జున్‌ కోలా దర్శకత్వంలో దినేష్‌ తేజ్‌, దష్విక.కె హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'తత్వం' త్రయతి ఇషాని క్రియేషన్స్‌, ఎస్‌.కె.ప్రొడక్షన్స్‌…

8 hours ago

తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి

స్నేహా రెడ్డి అంటే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది స్టార్ హీరో అల్లు అర్జున్ భార్యగానే. అయితే ఆమె తనకంటూ…

8 hours ago

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ చిత్రం గొప్ప విజ‌యాన్ని సాధించాల‌ని కోరుకుంటున్నా: ప‌్రీ రిలీజ్ ఈవెంట్‌లో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ను అంద‌రూ థియేట‌ర్స్‌లో ఎంజాయ్ చేస్తారు.. సినిమా పెద్ద హిట్ అవుతుంది: ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి…

9 hours ago

చదలవాడ శ్రీనివాసరావుకు శుభాకాంక్షలు తెలిపిన ఫిలింక్రిటిక్స్ అసోసియేష్‌న్‌

ఇటీవల జరిగిన నిర్మాతల మండలి ఎన్నికల్లో కోశాధికారిగా ఘనవిజయం సాధించినశ్రీ చదలవాడ శ్రీనివాసరావును ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ సీనియర్ సభ్యులు, కార్యవర్గం…

3 weeks ago

‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ ఆనంద్ దేవరకొండ ఫిల్మోగ్రఫీలో ఒక బ్యూటిఫుల్ సినిమాగా నిలుస్తుంది: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ

ఆదిత్య హాసన్ రచన చాలా బాగుంది.. ‘ఎపిక్’ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను: ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా…

3 weeks ago

ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ ద్వారాసెప్టెంబర్ 18న‘పిఠాపురంలో… అలా మొదలైంది’ విడుదల—ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో…

ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం సెప్టెంబర్ 18న…

3 weeks ago