శ్రీ జయప్రకాష్ రెడ్డి ప్రొడక్షన్స్, నరేన్ వనపర్తి, అవినాష్ కొకటి, మల్లికా రెడ్డి, ప్రొడక్షన్ నెం.1 గ్రాండ్ గా ప్రారంభం

Must Read

ప్రముఖ నటుడు జయ ప్రకాష్ రెడ్డి కూమార్తె మల్లికా రెడ్డి నిర్మాతగా శ్రీ జయప్రకాష్ రెడ్డి ప్రొడక్షన్స్ (జెపి ప్రొడక్షన్స్) బ్యానర్ పై ‘ఊరికి ఉత్తరాన’ ఫేం నరేన్ వనపర్తి కథానాయకుడిగా, మల్లికార్జున్ రెడ్డి దర్శకత్వంలో రూపొందనున్న నూతన చిత్రం ప్రారంభోత్సవం గ్రాండ్ గా జరిగింది.

ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ దర్శకులు బి గోపాల్ క్లాప్ కొట్టగా, నిర్మాత బెక్కం వేణుగోపాల్ కెమెరా స్విచాన్ చేశారు. డైరెక్టర్ త్రినాథరావు నక్కిన ముహూర్తపు సన్నివేశానికి దర్శకత్వం వహించారు.

పాయల్ గుప్తా కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి శివ డీవోపీ గా పని చేస్తున్నారు. రవి కుమార్ గుర్రం ఆర్ట్ డైరెక్టర్ గా, కార్తిక్ శ్రీనివాస్ ఎడిటర్ గా పని చేస్తున్నారు.  

చిత్ర ప్రారంభోత్సవం సందర్భంగా హీరో నరేన్ వనపర్తి మాట్లాడుతూ..’ ఊరికి ఉత్తరాన’ తర్వాత నేను చేస్తున్న సినిమా ఇది. నా రెండో సినిమాకి జయ ప్రకాష్ రెడ్డి గారి ఆశీస్సులతో వారి  కుమార్తె మల్లికా రెడ్డి గారి సినిమాలో చేయడం ఆనందంగా వుంది. నాపై నమ్మకంతో ఈ సినిమాని నిర్మిస్తునందుకు వారికి కృతజ్ఞతలు. ఇది యూత్ ఫుల్  ఎంటర్ టైనర్. కథ కొత్తగా వుంటుంది. మంచి అనుభవం వున్న టీంతో చేస్తున్నాం. మీ అందరికీ ఆశీస్సులు, సపోర్ట్ కావాలి’’ అన్నారు    

దర్శకుడు అవినాష్ కొకటి మాట్లాడుతూ.. దర్శకుడిగా ఇది నా రెండో సినిమా. యూత్ ఫుల్ ఎలిమెంట్స్ తో మంచి ఎంటర్ టైనర్. మంచి టీం కుదిరింది. 70శాతం షూటింగ్ తెలంగాణ ఆంధ్రాలో జరుగుతుంది. మిగతాది కేరళలో జరుగుతుంది. ఆగస్టు నుంచి షూట్ మొదలుపెడతాం.” అన్నారు

నిర్మాత మల్లికారెడ్డి మాట్లాడుతూ.. నాన్న గారి ఆశయాలని ముందుకు తీసుకెళ్లాలని నిర్మాణంలోకి వచ్చాను.  మా నాన్నగారికి ఫస్ట్ హీరో బి గోపాల్ గారు. సమరసింహారెడ్డిలో చేసిన పాత్ర నాన్నగారికి ఎంతో పేరు తీసుకొచ్చింది. బి గోపాల్ గారు క్లాప్ కొట్టడం చాలా ఆనందంగా వుంది. అలాగే సురేష్ బాబు గారు బెస్ట్ విశేస్ అందించారు. హీరో నరేన్ గారు చాలా పాజిటివ్ పర్శన్. మంచి టీం కుదిరింది. జెపీ ప్రొడక్షన్స్ లో నిర్మిస్తున్న ఈ చిత్రం పెద్ద విజయం సాధించేలా కృషి చేస్తాం.’’ అన్నారు  

తారాగణం : నరేన్ వనపర్తి , పాయల్ గుప్తా
టెక్నికల్ టీమ్ :
బ్యానర్: జెపీ ప్రొడక్షన్స్
నిర్మాత: మల్లికా రెడ్డి
దర్శకత్వం: అవినాష్ కొకటి
డీవోపీ: శివ
ఆర్ట్:  రవి కుమార్ గుర్రం
ఎడిటర్ : కార్తిక్ శ్రీనివాస్
ప్రొడక్షన్ కంట్రోలర్ : ఆర్ సాయి మహేష్ మణి
మేకప్ : రంజిత్
పీఆర్వో: వంశీ శేఖర్

Latest News

వి.వి.వినాయక్ చేతుల మీదుగా “బరాబర్ ప్రేమిస్తా” మూవీ టీజర్ రిలీజ్

ఆటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ నటిస్తున్న కొత్త సినిమా "బరాబర్ ప్రేమిస్తా ". ఈ చిత్రానికి సంపత్ రుద్ర దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను కాకర్ల సత్యనారాయణ...

More News