బారీ అంచనాల నడుమ రిలీజ్‌కు రెడీ అవుతోన్న షారూక్ ఖాన్ ‘జవాన్’.. ట్రైలర్ రిలీజ్ కాకుండానే రూ.250 కోట్లకు అమ్ముడైన నాన్ థియేట్రికల్ రైట్స్
బాలీవుడ్ బాద్ షా షారూక్ ఖాన్ లేటెస్ట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘జవాన్’. ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం సెప్టెంబర్ 7న హిందీ, తెలుగు, తమిళ భాషల్లో భారీ ఎత్తున రిలీజ్ చేయటానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
అలాగే ‘జవాన్’ ట్రైలర్‌ను ‘మిషన్ ఇంపాజిబుల్’ సినిమా థియేటర్స్‌లో ప్రదర్శించబోతున్న సంగతి తెలిసిందే. ఇది వరకే మ్యూజిక్ రైట్స్ విషయంలో సెన్సేషన్ క్రియేట్ చేసిన జవాన్.. తాజాగా మరో రికార్డ్ క్రియేట్ చేసింది.
ట్రైలర్ ఇంకా రిలీజ్ కాకముందే ఈ సినిమా థియేట్రికల్ హక్కులు రూ.250 కోట్లకు అమ్ముడు కావటం విశేషం. యాక్షన్ ఎలిమెంట్స్, నటీనటుల అద్భుతమైన ప్రదర్శనతో కూడిన జవాన్ ట్రైలర్ కోసం ఆడియెన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
సాధారణంగానే షారూక్ ఖాన్ సినిమాలకు సంబంధించిన హక్కులన్నీ ఫ్యాన్సీ రేట్లకే అమ్ముడవుతుంటాయి. అయితే తాజాగా ఆయన గత సినిమాల రికార్డులను ఆయన తాజా చిత్రాలు దాటేస్తున్నాయి.
ఆయన గత చిత్రం పఠాన్ బాక్సాఫీస్ రికార్డులను కొల్లగొట్టింది. ఇప్పుడు జవాన్‌పై భారీ క్రేజ్ క్రియేట్ అయ్యింది. దీంతో ఈ సినిమా థియేట్రికల్ హక్కుల కోసం అందరూ పోటీ పడుతున్నారు. ఇక నాన్ థియేట్రికల్ హక్కులు హాట్ కేకులా అమ్ముడవటం చూస్తుంటే షారూక్ ఖాన్‌కి ఉన్న క్రేజ్ ఎంటనేది స్పష్టమైంది.
షారూక్ ఖాన్ హీరోగా నటించిన ఈ చిత్రాన్ని యంగ్ డైరెక్టర్ అట్లీ తెరకెక్కిస్తున్నారు. రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్, గౌరీ ఖాన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
లవ్, ఎమోషన్, డ్రామా వంటి కమర్షియల్ ఎలిమెంట్స్‌తోపాటు చక్కటి సోషల్ మెసేజ్‌తో రూపొందిన చిత్రం ‘దండోరా’ ట్రైలర్ రిలీజ్ క్రిస్మస్…
అవినాష్ తిరువీధుల హీరోగా, దర్శకుడిగా పరిచయమవుతున్న సినిమా "వానర". ఈ చిత్రంలో సిమ్రాన్ చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది. నందు…
వైవిధ్యమైన చిత్రం కలర్ ఫొటో, బ్లాక్‌బస్టర్ మూవీ ‘బెదురులంక 2012’ చిత్రాలను నిర్మించి అందరి దృష్టిని ఆకర్షించిన లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్…
సాదలమ్మ ఫిల్మ్ ప్రొడక్షన్స్, బిల్వ స్టూడియోస్ బ్యానర్ల మీద నిఖిల్ ఎం. గౌడ నిర్మించిన చిత్రం ‘జిన్’. ఈ మూవీకి…
బేబి డమరి సమర్పణలో శ్రీ పద్మాయల ఎంటర్‌టైన్‌మెంట్స్ - శ్రీ సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం "ఎర్రచీర".…
వైవిధ్యమైన చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న కథానాయకుడు విశ్వక్ సేన్, హాస్య చిత్రాలకు చిరునామాగా మారిన దర్శకుడు కె.వి.…