సూపర్ స్టార్ రజనీకాంత్, తమన్నా, నెల్సన్ దిలీప్ కుమార్, కళానిధి మారన్, సన్ పిక్చర్స్ ‘జైలర్’ నుంచి నువ్వు కావాలయ్యా పాట విడుదల
సూపర్ స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘జైలర్’. కళానిధి మారన్ సమర్పణలో సన్ పిక్చర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.
ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం ప్రమోషనల్ కంటెంట్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ చిత్రం నుంచి ‘నువ్వు కావాలయ్యా’పాటని విడుదల చేశారు మేకర్స్. స్టార్ కంపోజర్ అనిరుధ్ ఈ పాటని క్యాచి బీట్స్ తో ఇన్స్టంట్ చార్ట్ బస్టర్ నెంబర్ గా స్వరపరిచారు. అరుణ్‌రాజా కామరాజ్ రాసిన ఈ పాటను శిల్పారావు, అనిరుధ్ కలసి ఎనర్జిటిక్ గా పాడారు.ఈ పాటలో సూపర్ స్టార్ రజనీకాంత్ స్వాగ్, గ్రేస్ మెస్మరైజ్ చేయగా, తమన్నా డ్యాన్స్ మూమెంట్స్ ఆకట్టుకున్నాయి.
టాప్ టెక్నికల్ టీం ఈ చిత్రానికి పని చేస్తోంది. విజయ్ కార్తిక్ కన్నన్ కెమరామెన్ గా పనిచేస్తుండగా ఆర్ నిర్మల్ ఎడిటర్ గా చేస్తున్నారు. డిఆర్ కే కిరణ్ ఆర్ట్ డైరెక్టర్ కాగ, స్టన్ శివ యాక్షన్ కొరియోగ్రఫీ చేస్తున్నారు.
జైలర్ ఆగస్టు 10న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
తారాగణం: రజనీకాంత్, మోహన్ లాల్, జాకీ ష్రాఫ్, శివ రాజ్‌కుమార్, సునీల్, రమ్య కృష్ణన్, వినాయకన్, మర్నా మీనన్, తమన్నా, వసంత్ రవి, నాగ బాబు, యోగి బాబు, జాఫర్ సాదిక్, కిషోర్, బిల్లీ మురళీ, సుగుంతన్, కరాటే కార్తీ, మిథున్, అర్షద్, మారిముత్తు , రిత్విక్, శరవణన్, అరంతంగి నిషా, మహానంది శంకర్ తదితరులు
సాంకేతిక విభాగం:
నిర్మాణం : సన్ పిక్చర్స్
రచన, దర్శకత్వం : నెల్సన్
సంగీతం : అనిరుధ్ మ్యూజికల్
డివోపీ: విజయ్ కార్తీక్ కన్నన్
ఎడిటర్: ఆర్.నిర్మల్
ఆర్ట్: డాక్టర్ కిరణ్
యాక్షన్: స్టన్ శివ
పీఆర్వో : వంశీ శేఖర్
అర్జున్ కోలా దర్శకత్వంలో దినేష్ తేజ్, దష్విక.కె హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'తత్వం' త్రయతి ఇషాని క్రియేషన్స్, ఎస్.కె.ప్రొడక్షన్స్…
స్నేహా రెడ్డి అంటే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది స్టార్ హీరో అల్లు అర్జున్ భార్యగానే. అయితే ఆమె తనకంటూ…
‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ను అందరూ థియేటర్స్‌లో ఎంజాయ్ చేస్తారు.. సినిమా పెద్ద హిట్ అవుతుంది: దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి…
ఇటీవల జరిగిన నిర్మాతల మండలి ఎన్నికల్లో కోశాధికారిగా ఘనవిజయం సాధించినశ్రీ చదలవాడ శ్రీనివాసరావును ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ సీనియర్ సభ్యులు, కార్యవర్గం…
ఆదిత్య హాసన్ రచన చాలా బాగుంది.. ‘ఎపిక్’ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను: ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా…
ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం సెప్టెంబర్ 18న…