రిలీజ్‌కు రెడీ అవుతోన్న షారూక్ ఖాన్ ‘జవాన్’

బారీ అంచ‌నాల న‌డుమ రిలీజ్‌కు రెడీ అవుతోన్న షారూక్ ఖాన్ ‘జవాన్’.. ట్రైల‌ర్ రిలీజ్ కాకుండానే రూ.250 కోట్లకు అమ్ముడైన నాన్ థియేట్రికల్ రైట్స్

బాలీవుడ్ బాద్ షా షారూక్ ఖాన్ లేటెస్ట్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ ‘జవాన్’. ప్ర‌పంచ వ్యాప్తంగా ఈ చిత్రం సెప్టెంబ‌ర్ 7న హిందీ, తెలుగు, త‌మిళ భాష‌ల్లో భారీ ఎత్తున రిలీజ్ చేయ‌టానికి మేక‌ర్స్ స‌న్నాహాలు చేస్తున్నారు.

అలాగే  ‘జవాన్’ ట్రైలర్‌ను ‘మిషన్ ఇంపాజిబుల్’ సినిమా థియేటర్స్‌లో ప్ర‌ద‌ర్శించ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. ఇది వరకే మ్యూజిక్ రైట్స్ విషయంలో సెన్సేషన్ క్రియేట్ చేసిన జవాన్.. తాజాగా మరో రికార్డ్ క్రియేట్ చేసింది.  

ట్రైల‌ర్ ఇంకా రిలీజ్ కాక‌ముందే ఈ సినిమా థియేట్రికల్ హక్కులు రూ.250 కోట్లకు అమ్ముడు కావటం విశేషం. యాక్ష‌న్ ఎలిమెంట్స్, న‌టీన‌టుల అద్భుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న‌తో కూడిన జ‌వాన్ ట్రైల‌ర్ కోసం ఆడియెన్స్ ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు.

సాధార‌ణంగానే షారూక్ ఖాన్ సినిమాల‌కు సంబంధించిన హ‌క్కులన్నీ ఫ్యాన్సీ రేట్ల‌కే అమ్ముడ‌వుతుంటాయి. అయితే తాజాగా ఆయ‌న గ‌త సినిమాల రికార్డుల‌ను ఆయ‌న తాజా చిత్రాలు దాటేస్తున్నాయి.

ఆయ‌న గ‌త చిత్రం ప‌ఠాన్ బాక్సాఫీస్ రికార్డుల‌ను కొల్ల‌గొట్టింది. ఇప్పుడు జ‌వాన్‌పై భారీ క్రేజ్ క్రియేట్ అయ్యింది. దీంతో ఈ సినిమా థియేట్రిక‌ల్ హ‌క్కుల కోసం అంద‌రూ పోటీ ప‌డుతున్నారు. ఇక నాన్ థియేట్రిక‌ల్ హ‌క్కులు హాట్ కేకులా అమ్ముడ‌వటం చూస్తుంటే షారూక్ ఖాన్‌కి ఉన్న క్రేజ్ ఎంట‌నేది స్ప‌ష్ట‌మైంది.

షారూక్ ఖాన్ హీరోగా న‌టించిన ఈ చిత్రాన్ని యంగ్ డైరెక్ట‌ర్ అట్లీ తెర‌కెక్కిస్తున్నారు. రెడ్ చిల్లీస్ ఎంట‌ర్టైన్మెంట్, గౌరీ ఖాన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

Tfja Team

Recent Posts

”తత్వం” సాధించే విజయంతో మా కష్టాలన్నీ మరిచిపోతాం: యువ దర్శకుడు అర్జున్‌ కోలా

అర్జున్‌ కోలా దర్శకత్వంలో దినేష్‌ తేజ్‌, దష్విక.కె హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'తత్వం' త్రయతి ఇషాని క్రియేషన్స్‌, ఎస్‌.కె.ప్రొడక్షన్స్‌…

21 hours ago

తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి

స్నేహా రెడ్డి అంటే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది స్టార్ హీరో అల్లు అర్జున్ భార్యగానే. అయితే ఆమె తనకంటూ…

21 hours ago

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ చిత్రం గొప్ప విజ‌యాన్ని సాధించాల‌ని కోరుకుంటున్నా: ప‌్రీ రిలీజ్ ఈవెంట్‌లో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ను అంద‌రూ థియేట‌ర్స్‌లో ఎంజాయ్ చేస్తారు.. సినిమా పెద్ద హిట్ అవుతుంది: ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి…

22 hours ago

చదలవాడ శ్రీనివాసరావుకు శుభాకాంక్షలు తెలిపిన ఫిలింక్రిటిక్స్ అసోసియేష్‌న్‌

ఇటీవల జరిగిన నిర్మాతల మండలి ఎన్నికల్లో కోశాధికారిగా ఘనవిజయం సాధించినశ్రీ చదలవాడ శ్రీనివాసరావును ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ సీనియర్ సభ్యులు, కార్యవర్గం…

3 weeks ago

‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ ఆనంద్ దేవరకొండ ఫిల్మోగ్రఫీలో ఒక బ్యూటిఫుల్ సినిమాగా నిలుస్తుంది: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ

ఆదిత్య హాసన్ రచన చాలా బాగుంది.. ‘ఎపిక్’ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను: ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా…

3 weeks ago

ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ ద్వారాసెప్టెంబర్ 18న‘పిఠాపురంలో… అలా మొదలైంది’ విడుదల—ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో…

ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం సెప్టెంబర్ 18న…

3 weeks ago