జూలై 31 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో ‘పోలీస్ కంప్లైంట్’ స్ట్రీమింగ్

▪️ తెలుగు, కన్నడ భాష‌ల్లో జూన్‌లో విడుద‌లైన చిత్రం
▪️ 300 థియేట‌ర్‌ల‌లో విడుద‌లై హిట్ టాక్

హారర్-యాక్షన్ థ్రిల్లర్‌గా ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్న ‘పోలీస్ కంప్లైంట్’ చిత్రం ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. జూన్‌లో థియేటర్లలో విడుదలై మంచి స్పందనతో పాటు సానుకూల సమీక్షలు అందుకున్న ఈ చిత్రం, ఈ శుక్ర‌వారం (జూలై 31) నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగు, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ అవుతుంది.

తెలుగు, కన్నడ భాష‌ల్లో దాదాపు 300 థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. విడుదలైన తొలి రోజు నుంచే హారర్, యాక్షన్, థ్రిల్లర్ అంశాల సమ్మేళనంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ సినిమాకు విమర్శకుల నుంచి ప్రశంసలు లభించాయి. ప్రముఖ సినీ వెబ్‌సైట్లలోనూ, IMDbలోనూ మంచి రేటింగ్‌లు, పాజిటివ్ రివ్యూలు సొంతం చేసుకుంది.

టాలీవుడ్ సిల్వర్ స్క్రీన్‌పై హారర్, థ్రిల్లర్, యాక్షన్ అంశాలను వినూత్నంగా మిళితం చేస్తూ రూపొందిన ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్‌కుమార్, నవీన్ చంద్ర, కృష్ణసాయి, రాగిణి ద్వివేది ప్రధాన పాత్రలు పోషించారు. ఎంఎస్‌కే ప్రమిద శ్రీ ఫిలిమ్స్ బ్యానర్‌పై బాలకృష్ణ మహారాణా నిర్మించగా, క్రియేటివ్ డైరెక్టర్ సంజీవ్ మేగోటి దర్శకత్వం వహించారు. వరలక్ష్మి శరత్‌కుమార్ త‌న కెరీర్‌లోనే తొలిసారిగా చేసిన ఎంట‌ర్‌టైన్‌మెంట్ ఈ సినిమాకు స్పెష‌ల్ ఎట్రాక్ష‌న్‌గా నిలిచింది. దానికి తోడు నవీన్ చంద్ర యాక్టింగ్ కూడా ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తుంది.

ఈ చిత్రంలో “చైన్ రియాక్షన్ ఆఫ్ కర్మ” అనే ఆసక్తికరమైన కాన్సెప్ట్‌ను హారర్ థ్రిల్లర్ రూపంలో దర్శకుడు సంజీవ్ మేగోటి ఆవిష్కరించారు. హారర్, మిస్టరీ, యాక్షన్ అంశాలను సమతుల్యంగా మేళవిస్తూ ప్రేక్షకులను కథలో లీనమయ్యేలా తీర్చిదిద్దారు. ముఖ్యంగా, సూపర్ స్టార్ కృష్ణకు నివాళిగా రూపొందించిన కృష్ణసాయి నటించిన ప్రత్యేక గీతం అభిమానులకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

మూఢనమ్మకాల నేపథ్యంలో కర్మ సిద్ధాంతాన్ని థ్రిల్లింగ్ కథనంతో చూపించిన ‘పోలీస్ కంప్లైంట్’ హారర్, యాక్షన్, థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులకు థియేటర్లలో మంచి అనుభూతిని అందించింది. ఇప్పుడు అదే ఉత్కంఠభరిత అనుభవాన్ని జూలై 31 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగు, కన్నడ భాషల్లో ఇంట్లోనే ఆస్వాదించే అవకాశం ప్రేక్షకులకు లభిస్తుంది.

నిర్మాత: బాలకృష్ణ మహారాణా
బ్యానర్: ఎంఎస్‌కే ప్రమిద శ్రీ ఫిలిమ్స్
దర్శకత్వం: సంజీవ్ మేగోటి
డీవోపీ: ఎస్.ఎన్. హరీష్ సొండెకొప్ప
ఎడిటర్: అనుగోజు రేణుకాబాబు
ప్రొడక్షన్ డిజైనర్: కొండపనేని మురళీధర్
సంగీతం: ఆరోహణ సుధీంద్ర, సంజీవ్ మేగోటి, సుధాకర్ మారియో
ఫైట్స్: డ్రాగన్ ప్రకాష్, రవితేజ
సౌండ్ డిజైనింగ్: దొంతం ప్రవీణ్ రెడ్డి
వీఎఫ్ఎక్స్: మ్యాజిక్ లూమ్ విజయ్
పీఆర్‌ఓ: అశోక్ దయ్యాల.

TFJA

Recent Posts

”తత్వం” సాధించే విజయంతో మా కష్టాలన్నీ మరిచిపోతాం: యువ దర్శకుడు అర్జున్‌ కోలా

అర్జున్‌ కోలా దర్శకత్వంలో దినేష్‌ తేజ్‌, దష్విక.కె హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'తత్వం' త్రయతి ఇషాని క్రియేషన్స్‌, ఎస్‌.కె.ప్రొడక్షన్స్‌…

1 day ago

తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి

స్నేహా రెడ్డి అంటే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది స్టార్ హీరో అల్లు అర్జున్ భార్యగానే. అయితే ఆమె తనకంటూ…

1 day ago

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ చిత్రం గొప్ప విజ‌యాన్ని సాధించాల‌ని కోరుకుంటున్నా: ప‌్రీ రిలీజ్ ఈవెంట్‌లో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ను అంద‌రూ థియేట‌ర్స్‌లో ఎంజాయ్ చేస్తారు.. సినిమా పెద్ద హిట్ అవుతుంది: ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి…

1 day ago

చదలవాడ శ్రీనివాసరావుకు శుభాకాంక్షలు తెలిపిన ఫిలింక్రిటిక్స్ అసోసియేష్‌న్‌

ఇటీవల జరిగిన నిర్మాతల మండలి ఎన్నికల్లో కోశాధికారిగా ఘనవిజయం సాధించినశ్రీ చదలవాడ శ్రీనివాసరావును ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ సీనియర్ సభ్యులు, కార్యవర్గం…

3 weeks ago

‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ ఆనంద్ దేవరకొండ ఫిల్మోగ్రఫీలో ఒక బ్యూటిఫుల్ సినిమాగా నిలుస్తుంది: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ

ఆదిత్య హాసన్ రచన చాలా బాగుంది.. ‘ఎపిక్’ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను: ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా…

3 weeks ago

ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ ద్వారాసెప్టెంబర్ 18న‘పిఠాపురంలో… అలా మొదలైంది’ విడుదల—ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో…

ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం సెప్టెంబర్ 18న…

3 weeks ago