వెర్సటైల్ స్టార్ దుల్కర్ సల్మాన్ పుట్టినరోజు సందర్భంగా ‘ఆకాశంలో ఒక తార’ చిత్ర యూనిట్ ఈరోజు (మంగళవారం) ఫస్ట్ సింగిల్ ‘చిట్టి చిట్టి చీమ’ను విడుదల చేసింది.
జివి ప్రకాష్ కుమార్ స్వరపరిచిన ‘చిట్టి చిట్టి చీమ’ పాట హృదయాన్ని హత్తుకునే మెలోడి.. భావోద్వేగంగా సినిమాలో ఏం చెప్పాలనుకున్నారో ఆ పాయింట్‌ను అద్భుతంగా ప్రతిబింబిస్తుంది. హీరోయిన్ కోణంలో పాడిన ఈ పాట, నక్షత్రాలను చేరాలనే ఒక మహిళ కలను, ఆమె పక్కన నిలబడి నిశ్శబ్దంగా అండగా నిలిచే వ్యక్తి ప్రేమను చూపిస్తుంది. సాంప్రదాయ ప్రేమకథలను దాటి, ఒక ప్రత్యేకమైన బంధాన్ని ఈ పాట అందంగా సెలబ్రేట్ చేస్తుంది.
శ్రీమణి రాసిన ఈ పాటను రమ్య బెహరా ఎంతో చక్కగా ఆలపించారు. చిట్టి చీమ చక్కెర మోసుకెళ్లడం, కొండపల్లి బొమ్మ కొండలు దాటడం, గాలికి ఎదురుగా మాత్రమే ఎగిరే గాలిపటం వంటి ఆకర్షణీయమైన ఉపమానాల ద్వారా ఈ పాట పట్టుదల, ఆశ, ప్రతి కల వెనుక ఉన్న నిశ్శబ్ద బలాన్ని అద్భుతంగా ఆవిష్కరించింది.
ఆకాశంలో ఒక తార చిత్రంలో దుల్కర్ సల్మాన్, సాత్విక వీరవల్లి, శ్రుతి హాసన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. పావన్ సాదినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని లైట్‌బాక్స్ మీడియా బ్యానర్‌పై సందీప్ గున్నం, రమ్య గున్నం నిర్మిస్తున్నారు. స్వప్న సినిమా, గీతా ఆర్ట్స్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నాయి.
నవరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని బిర్లా స్టూడియోస్, టెంపుల్ టౌన్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న భక్తిరస చిత్రం ‘కనకదుర్గ’ నుంచి తొలి…
శ్రీ మహా సుబ్రహ్మణ్య వేదవేదాంగ విద్యాపీఠమ్ వద్ద నందమూరి బసవ రామ తారకం ఎన్టీఆర్ చారిటబుల్ ట్రస్ట్ నుండి వస్త్ర…
సూపర్ స్టార్ రజనీకాంత్, నెల్సన్ దిలీప్‌కుమార్ కలయికలో రూపొందిన 'జైలర్' చిత్రం 2023లో విడుదలై ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే.…
సుగి విజయ్, జుప్సీ భద్ర (తొలి పరిచయం) హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘ఐ హేట్ మ్యారేజ్ ’ ఆర్య…
ఇండియన్ సినిమాలో యాక్షన్ హీరో అంటే ఇకపై విజయ్ దేవరకొండ గురించే చెప్పుకుంటారని అన్నారు సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి…
ఏడాది పాటు ఈ సేవా కార్యక్రమం కొనసాగిస్తానని వెల్లడించిన రశ్మిక, రశ్మికను చూసి గర్వపడుతున్నానని స్పందించిన విజయ్ దేవరకొండ సేవా…