*వెర్స‌టైల్ స్టార్ దుల్క‌ర్ స‌ల్మాన్ పుట్టినరోజు సందర్భంగా ‘ఆకాశంలో ఒక తార’ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ ‘చిట్టి చిట్టి చీమ’ రిలీజ్

Must Read

వెర్సటైల్ స్టార్ దుల్కర్ సల్మాన్ పుట్టినరోజు సందర్భంగా ‘ఆకాశంలో ఒక తార’ చిత్ర యూనిట్ ఈరోజు (మంగళవారం) ఫస్ట్ సింగిల్ ‘చిట్టి చిట్టి చీమ’ను విడుదల చేసింది.

జివి ప్రకాష్ కుమార్ స్వరపరిచిన ‘చిట్టి చిట్టి చీమ’ పాట హృదయాన్ని హత్తుకునే మెలోడి.. భావోద్వేగంగా సినిమాలో ఏం చెప్పాల‌నుకున్నారో ఆ పాయింట్‌ను అద్భుతంగా ప్రతిబింబిస్తుంది. హీరోయిన్ కోణంలో పాడిన ఈ పాట, నక్షత్రాలను చేరాలనే ఒక మహిళ కలను, ఆమె పక్కన నిలబడి నిశ్శబ్దంగా అండగా నిలిచే వ్యక్తి ప్రేమను చూపిస్తుంది. సాంప్రదాయ ప్రేమకథలను దాటి, ఒక ప్రత్యేకమైన బంధాన్ని ఈ పాట అందంగా సెలబ్రేట్ చేస్తుంది.

శ్రీమణి రాసిన‌ ఈ పాటను రమ్య బెహరా ఎంతో చ‌క్క‌గా ఆలపించారు. చిట్టి చీమ చక్కెర మోసుకెళ్లడం, కొండపల్లి బొమ్మ కొండలు దాటడం, గాలికి ఎదురుగా మాత్రమే ఎగిరే గాలిపటం వంటి ఆకర్షణీయమైన ఉపమానాల ద్వారా ఈ పాట పట్టుదల, ఆశ, ప్రతి కల వెనుక ఉన్న నిశ్శబ్ద బలాన్ని అద్భుతంగా ఆవిష్క‌రించింది.

ఆకాశంలో ఒక తార చిత్రంలో దుల్కర్ సల్మాన్, సాత్విక వీరవల్లి, శ్రుతి హాసన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. పావన్ సాదినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని లైట్‌బాక్స్ మీడియా బ్యానర్‌పై సందీప్ గున్నం, రమ్య గున్నం నిర్మిస్తున్నారు. స్వప్న సినిమా, గీతా ఆర్ట్స్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నాయి.

Latest News

అల్లరి నరేష్ హీరోగా నటిస్తోన్న భక్తిరస చిత్రం ‘కనకదుర్గ’ నుంచి తొలి పాట విడుదల.. ‘అమ్మ కనకదుర్గ’ అంటూ సాగే భక్తి గీతాన్ని విజయవాడలో ఆవిష్కరించిన తమన్ అండ్ టీమ్

నవరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని బిర్లా స్టూడియోస్, టెంపుల్ టౌన్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న భక్తిరస చిత్రం ‘కనకదుర్గ’ నుంచి తొలి పాట ‘అమ్మ కనకదుర్గ’ను విజయవాడలో...

More News