
మార్వెల్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘అవెంజర్స్: డూమ్స్‌డే’ సినిమా ట్రైలర్‌ను బిగ్ స్క్రీన్ పై చూసే అవకాశం రానుంది. ఈ ట్రైలర్ జూలై 30న విడుదల కానున్న ‘స్పైడర్-మ్యాన్: బ్రాండ్ న్యూ డే’ సినిమాతో ప్రత్యేకంగా వెండి తెరపై కనిపించనుంది. ఇంగ్లీష్, హిందీ, తమిళం, తెలుగు భాషల్లో ప్రదర్శించే ‘స్పైడర్-మ్యాన్: బ్రాండ్ న్యూ డే’ షోలలో అదే భాషలో ‘అవెంజర్స్: డూమ్స్‌డే’ ట్రైలర్‌ను చూపించనున్నారు. దీంతో అభిమానులు థియేటర్లలోనే భారీ విజువల్స్‌తో ఈ ట్రైలర్‌ను చూడనున్నారు.
ఆంథోనీ రుస్సో, జో రుస్సో దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని కెవిన్ ఫైగీ, లూయిస్ డి’ఎస్పొజిటో, జోనాథన్ శ్వార్జ్ నిర్మించారు. ఇందులో రాబర్ట్ డౌనీ జూనియర్, క్రిస్ ఎవాన్స్, క్రిస్ హేమ్స్‌వర్త్, పెడ్రో పాస్కల్, పాల్ రడ్, ఆంథోనీ మాకీ, ఫ్లోరెన్స్ ప్యూ తదితర ప్రముఖ నటీనటులు కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాలో మూడు వేర్వేరు విశ్వాలకు చెందిన సూపర్ హీరోలు ఒకే వేదికపైకి వచ్చి, ఇప్పటివరకు ఎదురుకాని అత్యంత ప్రమాదకరమైన శత్రువుతో పోరాడనున్నట్లు చిత్రబృందం వెల్లడించింది.
‘అవెంజర్స్: డూమ్స్‌డే’ సినిమా డిసెంబర్ 18న భారతదేశవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ చిత్రం ఇంగ్లీష్, హిందీ, తమిళం, తెలుగు భాషల్లో ప్రీమియం ఫార్మాట్లలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

