సావిత్రి గారంటే తెలుగుతనం, అమ్మతనం ‘సావిత్రి క్లాసిక్స్’ ఇంగ్లీషు పుస్తకావిష్కరణ సభ లో జయప్రద

Must Read

సావిత్రి గారు అద్భుతాలకే అద్భుతం – ‘సావిత్రి క్లాసిక్స్’ ఇంగ్లీషు పుస్తకావిష్కరణ సభ లో పద్మశ్రీ డా. బ్రహ్మానందం

ఆంగ్లంలోకి అనువదిస్తే మరింత మందికి రీచ్ అవుతుందని భావించాం.. ‘ – ‘సావిత్రి క్లాసిక్స్’‘ఇంగ్లీషు పుస్తకావిష్కరణ సభ లో విజయచాముండేశ్వరి


వెండితెర ధృవతార, తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచే మహానటి సావిత్రి. ఆమె 90వ జయంతి సందర్భంగా సంజయ్ కిషోర్ రచించిన ‘సావిత్రి క్లాసిక్స్’ ఇంగ్లీషు పుస్తకాన్ని శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ లో విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి సీనియర్ నటీమణి జయప్రద, ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు, శ్రీ బ్రహ్మానందం, తమ్మారెడ్డి భరద్వాజ, కేఐ వరప్రసాద్ రెడ్డి, నిర్మాత నాగ సుశీల, సావిత్రి గారి కూతురు శ్రీమతి విజయ చాముండేశ్వరి, జయలలిత, సంజయ్ కిషోర్, బొల్లినేని కృష్ణయ్య తదితరులు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. జయప్రద ఈ పుస్తకాన్ని ఆవిష్కరించి, తొలి ప్రతిని రఘురామ కృష్ణంరాజు కి అందజేశారు .

జయప్రద మాట్లాడుతూ .. ‘‘ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటేనే ఇలాంటి స్టేజ్ మీద నిలబడగలం. అమ్మ సావిత్రి గారి పేరు ‘సావిత్రి క్లాసిక్స్’ ఇంగ్లీష్ ఎడిషన్ పుస్తకం రిలీజ్ చేయడం నా అదృష్టం. తెలుగు వర్షెన్‌ని నాకు ఇష్టమైన హీరో మెగాస్టార్ చిరంజీవి గారు రిలీజ్ చేశారు. ఇప్పుడు ఆ అదృష్టం నాకు దక్కింది. నా సోదరి చాముండేశ్వరి ఇంటికి వచ్చి ఈ కార్యక్రమం గురించి చెప్పారు. చాముండేశ్వరి గారిని చూస్తే నాకు సావిత్రమ్మ గారే మా ఇంటికి వచ్చినట్టు అనిపించింది. ఆమె నటించినప్పుడు నేను పుట్టలేదు. ఆమె సినిమాల్ని చూస్తూ నేను పెరిగాను. అలాంటి స్టేజ్ నుంచి ఇలాంటి స్టేజ్ వరకు రావడం నా పూర్వజన్మ సుకృతం. సావిత్ర అంటే ఉత్తమ నటన.. ఉత్తమ నటన అంటే సావిత్రి. ఆమే ఒక అద్భుతం. ఆమెలోనే అన్ని అద్భుతాలుంటాయి. ఆమె ఒక్క చూపులోనే ఎన్నో హావభావాలుంటాయి. ఎన్టీఆర్, ఏఎన్నార్‌లాంటి వారితో ధీటుగా నటించారు. అందుకే ఆమెకు మహానటి అని బిరుదునిచ్చారు. ‘మిస్సమ్మ’, ‘నర్తనశాల’లో సావిత్రి గారు చేసిన పాత్రలు చేయాలనే కోరిక ఉండేది. ఆ తల్లి చనిపోయినా.. ఈ తల్లి (చాముండేశ్వరి), గోవింద రావు కలిసి సావిత్రి గారిని సజీవంగానే ఉంచేలా చేస్తున్నారు. ఈ తరానికి సావిత్రమ్మను పరిచయం చేయాలని ఇంగ్లీష్ ఎడిషన్‌లో పుస్తకాన్ని విడుదల చేయడం ఆనందంగా ఉంది. సావిత్రి గారంటే తెలుగుతనం, అమ్మతనం. సంజయ్ గారు చాలా గొప్పవారు. ఇలాంటి వారు లేకపోతే సావిత్రి గారి లాంటి వారి గురించి భావితరాలకు ఎలా తెలుస్తుంది. ఎంతో పరిశోధన చేసి ఇలాంటి పుస్తకాల్ని తీసుకు రావడం సంతోషంగా ఉంది. సావిత్రమ్మ లాంటి వాళ్లు మళ్లీ పుట్టలేరు, తెలుగు ఇండస్ట్రీ గర్వించదగ్గ మహానటి మన సావిత్రి. ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు’ అని అన్నారు.
బ్రహ్మానందం మాట్లాడుతూ .. ‘సావిత్రి గారు ప్రాత:స్మరణీయులు కారు.. చిరస్మరణీయులు. కొంత మంది పుడతారు.. భగవంతుడు కొంత మందిని పుట్టిస్తాడు. అలాంటి వారిని కారణజన్ములు అంటారు. అలాంటి వారిలో సావిత్రి గారు ఒకరు. ఎంతో మంది మహానుభావులు జన్మించిన ఈ గడ్డపై సావిత్రి గారు జన్మించడం మన అదృష్ణం. ఆ తల్లి కోటానుకోట్ల హావభావాల్ని అందించారు. సావిత్రి గారు గంధర్వుల్లాంటి వారు. అలాంటి వారికి మరణం ఉండదు. ఇక్కడ విధి నిర్వహణ అయ్యాక.. ఇంకో ప్లానెట్‌కి వెళ్లి విధిని నిర్వర్తిస్తుంటారు. ఆమెతో ఒక్క సినిమా అయినా నటిస్తే బాగుండు కదా? అనే కోరిక ఉండేది. ఆమెతో నటించే భాగ్యం నాకు దక్కలేదు. సావిత్రి గారిని స్మరించుకోని తెలుగు వారు, తెలుగు జాతి ఉండదు. ఒక్క సెకనులో మూడు రకాల ఎక్స్‌ప్రెషన్స్‌లో ఇచ్చే మహానటి సావిత్రి. ‘నర్తనశాల’లో ఎస్వీ రంగారావు గారు, సావిత్రి గారి నట సంఘర్షణ చూసి చేతులెత్తి దండం పెట్టాల్సిందే. అద్భుతాలకే అద్భుతం సావిత్రి గారు.. నటనకే అద్భుతం సావిత్రి గారు.. నటనే వచ్చి సావిత్రి గారిని మెచ్చుకోవాల్సిన పరిస్థితి. ఎన్నెన్నో పాత్రల్లో అవలీలగా జీవించేశారు. అలాంటి సావిత్రి గారి మీద పుస్తకాలు రాస్తున్న కిషోర్ గారికి ధన్యవాదాలు. ఇలాంటి (సంజయ్ కిషోర్) కళా జీవుల వల్లే సావిత్రి వంటి వారు ఏళ్లపాటుగా జీవించి ఉంటున్నారు. తల్లి రుణాన్ని తీర్చుకుంటున్న చాముండేశ్వరి గారి జీవితం చరితార్థం అవుతుంది. ఈ కార్యక్రమానికి రావడం ఆనందంగా ఉంది. ఈ పుస్తకం, ఆ ముఖచిత్రం చూసి నా కంట్లోంచి నీరు వచ్చేసింది. మీకు (చాముండేశ్వరి) రావడం విశేషమేమీ కాదు. సంజయ్ ప్రతీ పనిని త్రికరణ శుద్ధితో చేస్తాడు. ఇలాంటి గొప్ప పుస్తకాలెన్నో ఆయన రచించాలని కోరుకుంటున్నాను. ’ అని అన్నారు.
విజయ చాముండేశ్వరి మాట్లాడుతూ .. ‘అమ్మ మీద అందరికీ అభిమానం ఉంటుంది. అయితే ఆమె జ్ఞాపకాల్ని ఎప్పటికీ భద్రపర్చాలని సంజయ్ కిషోర్ గారిని సంప్రదించాను. తెలుగులో ఈ బుక్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇంగ్లీష్‌లో అనువదిస్తే మరింత మందికి రీచ్ అవుతుందని ఇంగ్లీష్ ఎడిషన్‌ను రిలీజ్ చేస్తున్నాం. అక్కినేని మామయ్య గారి కూతురు సుశీల ఇక్కడకు రావడం ఆనందంగా ఉంది. మన ఫంక్షన్ కదా.. వస్తాను అని తమ్మారెడ్డి భరద్వాజ్ గారు అన్నారు. ఇంటికి వెళ్లినప్పుడు జయప్రద గారు నన్నెంతో ప్రేమగా చూసుకున్నారు. బ్రహ్మానందం గారి వద్ద శిష్యరికం చేయాలని నేను అనుకునేదాన్ని. పిలవగానే వచ్చిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్’ అని అన్నారు.

గోవింద రావు మాట్లాడుతూ .. ‘జయప్రద గారి అభినయం అంటే నాకు ఇష్టం. ఆమె నటించిన ‘మేఘ సందేశం’ చూసి ఆశ్చర్యపోయాను. నాగ సుశీల గారు, చాముండేశ్వరి గారు ఒకే స్టేజ్ మీద కలిసి దొరకడం చాలా అరుదు (నవ్వుతూ). ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్’ అని అన్నారు.

పుస్తక రచయిత సంజయ్ కిషోర్ మాట్లాడుతూ .. ‘‘ఆ నాటి నటిని మనం ఇప్పటికీ తల్చుకుంటున్నాం. ‘ఈ సావిత్రి మరణించదు.. మరో సావిత్రి జన్మించదు’ అని ఆత్రేయ గారు అన్నారు. అది ముమ్మాటికీ నిజం. తెలుగు సినిమాలో చరిత్రలో ఏ కథా నాయికకి ఊరురా విగ్రహాలు లేవు. అందుకు సావిత్రి గారు ఎప్పుడూ జీవించే ఉంటారు. తెలుగు జాతి స్త్రీకి ప్రతీకగా సావిత్రి గారు నిలిచారు. నా పట్టుదల, ప్యాషన్ చూసి సావిత్రి గారికి సంబంధించిన అరుదైన ఫోటోలెన్నో చాముండేశ్వరి గారు ఇచ్చారు. 90వ జయంతికి సంబంధించిన కార్యక్రమాల గురించి చాముండేశ్వరి గారు ఎన్నో ఇన్ పుట్స్ ఇచ్చారు. ఈ జర్నీలో బొల్లినేని కృష్ణయ్య గారు ఎంతో సహకరించారు. ఆయన మా అందరినీ ముందుండి నడిపించారు. చిరంజీవి గారు తన సొంత ఖర్చుతో భారీ ఈవెంట్‌ను నిర్వహించి తెలుగు బుక్‌ను లాంఛ్ చేశారు. ఈ ఇంగ్లీష్ ఎడిషన్ పుస్తకాన్ని జయప్రద గారు లాంఛ్ చేయడం ఆనందంగా ఉంది. రఘురామకృష్ణంరాజు గారు ఎంతో సున్నితమైన వ్యక్తి. ఆయనుకున్నంత సినిమా నాలెడ్జ్ నాకు కూడా లేదు. ఈ ఇంగ్లీష్ ఎడిషన్ తొలి కాపీని వారు అందుకోవడo ఆనందంగా ఉంది. బ్రహ్మానందం గారంటే నాకు అపరిమితమైన గౌరవం. బ్రహ్మానందం గారు తెలుగు సినిమా చరిత్రలో నాలుగు దశాబ్దాలుగా నెంబర్ వన్ కమెడియన్‌గా రాణిస్తున్నారు” అన్నారు.

వర ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ .. ‘‘గోవింద రావు అడిగిన వెంటనే ఈ కార్యక్రమానికి వస్తానని చెప్పాను. రాజుల గురించి, రాజ వంశాల గురించి చరిత్రకారులు రాస్తుంటారు. అయితే కళాకారులకే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి. వారి వల్లే రాజ్యం సుభిక్షంగా ఉంటుంది. అందుకే అలాంటి మహామహుల చరిత్రను భద్రపర్చాలి, గ్రంథస్థం చేయాలి. ఇలాంటి పుస్తకాలే భావి తరాలకు కరదీపికగా ఉంటాయి. సంజయ్ కిషోర్ గారు ఇలాంటి మరెన్నో గొప్ప పుస్తకాలు రాయాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

ఏపీ డిప్యూటీ స్పీకర్ శ్రీ రఘురామ కృష్ణంరాజు మాట్లాడుతూ .. ‘సంజయ్‌తో నాకు ఎన్నో ఏళ్ల నుంచి మంచి అనుబంధం ఉంది. ఆయన నిర్వహించిన సావిత్రి గారి జయంతి, వర్దంతి కార్యక్రమాలకు హాజరవుతుండేవాడ్ని. వర ప్రసాద్ రెడ్డి గారు నాకు మంచి స్నేహితులు. నా ఇంట్లో హోం థియేటర్‌కి సావిత్రి సినిమా అని పేరు పెట్టాను. ప్రతీ సీన్‌లో, ప్రతీ పాటలో, లిరిక్స్‌కి తగ్గట్టుగా సావిత్రి గారు అద్భుతమైన ఎక్స్‌ప్రెషన్స్ ఇస్తారు. ఆ హావభావాల కోసం ఎన్నోవేల సార్లు సినిమాలని చూసి ఉంటాను. సావిత్రి గారు అంటే నాకు ఓ ఎమోషన్. ఇంకా ఎన్ని దశాబ్దాలైనా సరే సావిత్రి గారు గుర్తుండిపోయేలా ఇలాంటి పుస్తకాలు తీసుకు రావడం ఆనందంగా ఉంది’ అని అన్నారు.

బొల్లినేని కృష్ణయ్య మాట్లాడుతూ .. ‘‘మహానటి సావిత్రి గారి గురించి అందరూ మాట్లాడుతూ ఉంటే విని ఆనందించాలని ఇక్కడకు వచ్చాను. ఆమె నటనలో తారాస్థాయికి చేరుకున్నారు. అమ్మని తల్చుకునేలా ఇలాంటి పుస్తకాల్ని రిలీజ్ చేస్తున్న చాముండేశ్వరి గారికి, సంజయ్ గారికి ధన్యవాదాలు’ అని అన్నారు.

Latest News

స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు చేతుల మీదుగా రొమాంటిక్ థ్రిల్లర్ మూవీ “అదే నీవు అదే నేను” టీజర్ రిలీజ్

తన బ్యానర్ సినిమాకు ఈ టైటిల్ పెట్టాలని అనుకున్నానని వెల్లడించిన ప్రొడ్యూసర్ దిల్ రాజు త్వరలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న "అదే నీవు అదే...

More News