ప్రియదర్శి, మోహనకృష్ణ ఇంద్రగంటి ‘సారంగపాణి జాతకం’ షూటింగ్ పూర్తి

Must Read

‘జెంటిల్‌మన్’, ‘సమ్మోహనం’ వంటి విజయవంతమైన సినిమాల తర్వాత మోహనకృష్ణ ఇంద్రగంటి, శివలెంక కృష్ణప్రసాద్ కలయికలో రూపొందుతున్న చిత్రo ‘సారంగపాణి జాతకం’. ప్రియదర్శి , రూప కొడువాయూర్ జంటగా నటించారు. ఈ రోజుతో సినిమా చిత్రీకరణ పూర్తి అయ్యింది. 

చిత్రనిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ మాట్లాడుతూ… ”ఇటీవల ప్రియదర్శి బర్త్ డే సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ లుక్, టైటిల్ పోస్టర్ కు అద్భుతమైన స్పందన లభించింది. మనిషి భవిష్యత్తు అతని చేతి రేఖల్లో ఉంటుందా? లేదా అతను చేసే చేతల్లో ఉంటుందా? అనే ప్రశ్నకు జవాబు ఇచ్చే ఓ పరిపూర్ణ హాస్యరస చిత్రం ‘సారంగపాణి జాతకం’. నేటితో  చిత్రీకరణ పూర్తయింది. హైదరాబాద్, రామోజీ ఫిల్మ్ సిటీ, విశాఖ పరిసర ప్రాంతాల్లో 5 షెడ్యూళ్లలో సినిమా పూర్తి చేశాం. ఈ నెల 12 నుంచి డబ్బింగ్ కార్యక్రమాలు ప్రారంభిస్తాం. నాకు ఎప్పటి నుంచో పూర్తి స్థాయి వినోదాత్మక సినిమా తీయాలని ఉండేది. మా సంస్థలో జంధ్యాల గారి డైరెక్షన్ లో  ఓ సినిమా చేయాలని అనుకున్నాను. కానీ, కుదరలేదు. ఆయన  మా సంస్థలో రెండు విజయవంతమైన చిత్రాలు ‘చిన్నోడు – పెద్దోడు’, ‘ఆదిత్య 369’ సినిమాలకు డైలాగ్స్ రాశారు కానీ, సినిమా చేయించుకోలేకపోయా. ఆ లోటు ఇన్నేళ్లకు  భర్తీ అయ్యింది. మా సంస్థలో రెండు విజయవంతమైన సినిమాలు తీసిన మోహనకృష్ణ ఇంద్రగంటితో పూర్తిస్థాయి వినోదాత్మక సినిమా చేయడం మాకు ఆనందంగా ఉంది. మా సంస్థలో ‘సారంగపాణి జాతకం’ గుర్తుండిపోయే సినిమా అవుతుంది. ఖర్చు పరంగానూ, టెక్నికల్ పరంగానూ  ఎక్కడా రాజీ పడకుండా ఈ సినిమా చేస్తున్నాం ” అని చెప్పారు.

తారాగణం:
ప్రియదర్శి, రూప కొడువాయూర్, నరేష్ విజయకృష్ణ, తనికెళ్ళ భరణి, శ్రీనివాస్ అవసరాల, ‘వెన్నెల’ కిశోర్, ‘వైవా’ హర్ష, శివన్నారాయణ, అశోక్ కుమార్, రాజా చెంబోలు, వడ్లమాని శ్రీనివాస్, ప్రదీప్ రుద్ర, రమేష్ రెడ్డి, కల్పలత, రూప లక్ష్మి, హర్షిణి, కె.ఎల్.కె, మణి, ‘ఐమ్యాక్స్’ వెంకట్.

సాంకేతిక నిపుణులు:
మేకప్ చీఫ్: ఆర్.కె వ్యామజాల, కాస్ట్యూమ్ చీఫ్: ఎన్. మనోజ్ కుమార్, కాస్ట్యూమ్ డిజైనర్స్: రాజేష్ కామర్సు – అశ్విన్, మార్కెటింగ్: టాక్ స్కూప్, పీఆర్వో: పులగం చిన్నారాయణ, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్: కె. రామాంజనేయులు (అంజి బాబు) – పి రషీద్ అహ్మద్ ఖాన్, కో డైరెక్టర్: కోట సురేష్ కుమార్, పాటలు: రామ జోగయ్య శాస్త్రి, స్టంట్స్: వెంకట్ – వెంకటేష్, ప్రొడక్షన్ డిజైనర్: రవీందర్, ఎడిటర్: మార్తాండ్ కె. వెంకటేష్, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: పీజీ విందా, సంగీతం: వివేక్ సాగర్, లైన్ ప్రొడ్యూసర్: విద్య శివలెంక, నిర్మాత: శివలెంక కృష్ణప్రసాద్, రచన – దర్శకత్వం: మోహనకృష్ణ ఇంద్రగంటి.

Sarangapani Jathakam Shoot Wrap Video | Sridevi Movies | Priyadarshi | Mohanakrishna Indraganti

Latest News

Splash Colors Media & Settle King Production No1 Shoot commences

Splash Colors Media, Alinea Avighna Studios & Settle King Production No: 1 is being produced by Venubabu, Directed by...

More News