‘ARM’యూనివర్సల్ గా అందరికీ కనెక్ట్ అయ్యే సినిమా : హీరో టోవినో థామస్  

Must Read

స్టార్ హీరో టోవినో థామస్ మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా పాంటసీ ప్రాజెక్ట్”ARM” తో ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేయడానికి సిద్ధంగా వున్నారు. టోవినో థామస్ 50మైల్ స్టోన్ మూవీగా వస్తున్న ఈ చిత్రంలో  కృతి శెట్టి, ఐశ్వర్య రాజేష్, సురభి లక్ష్మి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. డెబ్యుటెంట్ జితిన్ లాల్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని డాక్టర్ జకారియా థామస్‌తో కలిసి మ్యాజిక్ ఫ్రేమ్స్, UGM మోషన్ పిక్చర్స్ బ్యానర్లపై లిస్టిన్ స్టీఫెన్ నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రాన్ని తెలుగులో మైత్రీ మూవీ మేకర్స్ డిస్ట్రిబ్యూటర్స్ గ్రాండ్ గా విడుదల చేస్తున్నారు. “ARM” సెప్టెంబర్ 12న విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరో టోవినో థామస్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలని పంచుకున్నారు.  

ఇది మీ50మైల్ స్టోన్ మూవీ.. ఈ ప్రాజెక్ట్ ఎలా మొదలైయింది?
-స్మాల్ యాక్టర్ కెరీర్ ప్రారంభించాను. సపోర్టింగ్, కామెడీ, విలన్  రోల్స్ చేశాను. 2016 నుంచి లీడ్ రోల్స్ చేస్తున్నాను. యాక్టర్ కావాలనేది నా డ్రీం. ఇప్పుడా డ్రీంలో జీవిస్తున్నాను.  

-ARM మొదలుపెట్టినప్పుడు నటుడిగా ఇది నా 50వ సినిమా అవుతుందని తెలీదు. ARM చాలా ఎక్సయిటింగ్ స్క్రిప్ట్. మూడు డిఫరెంట్ క్యారెక్టర్స్ చేయడం హ్యుజ్ ఛాలెంజ్. డైరెక్టర్ నాపై నమ్మకం ఉంచారు. ఈ సినిమా కోసం వర్క్ షాప్స్ చేశాం. ఈ మూడు పాత్రలు దేనికవే ప్రత్యేకంగా వుంటాయి.

-ఇందులో మూడు పాత్రలు ఇష్టమే. అయితే దొంగగా కనిపించే మణి పాత్ర కొంచెం ఎక్కువ ఇష్టం(నవ్వుతూ) చాలా పాషనేటింగ్ క్యారెక్టర్ అది. తను చాలా కాన్ఫిడెన్స్ గల దొంగ. ఆడియన్స్ అ క్యారెక్టర్ ని చాలా ఎంజాయ్ చేస్తారు.

మీరు ఆరు నెలల్లో కళరి ఫైట్ నేర్చుకున్నారా?
-ఆరు నెలల్లో కళరి నేర్చుకోవడం అనేది పెద్ద మాట. ఆరు నెలలు కళరి ఫైట్ ప్రాక్టీస్ చేశాను. కొన్ని బేసిక్స్ పై అవగాహన వచ్చింది.

ఇంత పెద్ద స్కేల్ వున్న సినిమాకి డెబ్యుటెంట్ డైరెక్టర్ పై నమ్మకం వుంచడం గురించి ?
-జితిన్ లాల్ తో నాకు ఎనిమిదేళ్ళుగా జర్నీ వుంది. తను చెప్పిన స్క్రిప్ట్ అద్భుతంగా వుంది. నా కెరీర్ లో 80శాతం సినిమాలు కొత్త దర్శకులతోనే చేశాను. పరస్పర నమ్మకంతోనే ఇది సాధ్యపడుతుంది.

ARM లో ఎదురుకున్న ఛాలెజింగ్ ఏమిటి ?
-సినిమా చూసినప్పుడు మీకు అర్ధమౌతుంది. ఇందులో చాలా ఫైట్స్ సీక్వెన్స్ లు వున్నాయి. క్యారెక్టర్ స్విచస్ వుంటాయి. మేకప్ కే చాలా సమయం పట్టేసేది. చాలా లోకేషన్స్ లో షూట్ చేశాం. నా క్యారెక్టర్స్ కోసం చాలా ప్రిపేర్ అయ్యాను. నోట్స్ రాసుకున్నాను. అవన్నీ హెల్ప్ అయ్యాయి.

-ఇందులో నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే వుంటుంది. టైం పీరియడ్స్ ని ఆడియన్స్ సులువుగా అర్ధం చేసుకుంటారు. డైరెక్టర్ ప్రతి డిటెయిల్ ని చాలా చక్కగా తెరకెక్కించారు.

కృతి శెట్టి క్యారెక్టర్ ఎలా వుండబోతోంది?
ట్రైలర్ లో మూడు డిఫరెంట్ లవ్ స్టొరీస్ కనిపించాయి. ఈ ప్రేమకథల్లో కృతి శెట్టి, ఐశ్వర్య రాజేష్ ,సురభి లక్ష్మి అద్భుతంగా నటించారు.

త్రీడీలో రిలీజ్ చేయడం గురించి?
-ఈ సినిమాకి ఇమాజినరీ ఫిక్షనల్ వరల్డ్ ని క్రియేట్ చేశాం. అందరినీ కథలో లీనం చేయడం కోసం త్రీడీ చాల హెల్ప్ అవుతుంది. ఇంగ్లీష్ స్పానిస్ భాషల్లో కూడా విడుదల చేస్తున్నాం. దాదాపు ముఫ్ఫై భాషల్లో సబ్ టైటిల్స్ వేస్తున్నాం. యూనివర్శల్ గా కనెక్ట్ అయ్యే సినిమా.    

ARM టైటిల్ గురించి ?
-ARM.. ‘అజాయంతే రందం మోషణం’. అజయన్ రెండో దొంగతనం అని దీని అర్ధం. మిగతా భాషల వారికి ఈ పేరు పలకడం కాస్త ఇబ్బందిగా వుంటుంది. అందకే అందరూ పలికే విధంగా ARM ని వ్యవహరిస్తున్నాం.

ARM మ్యూజిక్ గురించి ?
ధిబు నినాన్ తమిళ్ లో పాపులర్ మ్యూజిక్ చేశారు. ఈ సినిమాకి అద్భుతమైన ఆల్బమ్ చేయడంతో పాటు బ్రిలియంట్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చేశారు.

ఈ సినిమా మైత్రీ మూవీ మేకర్స్ తెలుగులో రిలీజ్ చేయడం గురించి?
-నడిగర్’ సినిమా కోసం మైత్రీ మూవీ మేకర్స్ తో అసోషియేట్ అయ్యాను. వారుతో నాకు జర్నీ వుంది. మైత్రీ లాంటి టాప్ డిస్ట్రిబ్యుటర్స్ సినిమాని తెలుగులో రిలీజ్ చేయడం ఆనందంగా వుంది.

ఎలాంటి కథలు ఎంచుకుకోవడానికి ఇష్టపడతారు?
-ప్రతి సినిమాలో ఏదో ఒక కొత్తదనం వుండే కథ, పాత్ర చేయాలనే నా ప్రయత్నం. ఎక్స్ ప్లోర్ చేయాల్సింది చాలా వుంది. ప్రతి సినిమా నుంచి నేర్చుకుంటూ ముందుకువెళుతున్నాను.    

మిన్నల్ మురళికి తెలుగులో కూడా చాలా మంది ఫ్యాన్స్ వున్నారు..  మీ కాంబినేషన్ లో సీక్వెల్ రావచ్చా  ?
-మిన్నల్ మురళి డైరెక్టర్ బాసిల్ జోసెఫ్ ఇప్పుడు నటుడిగా చాలా బిజీగా వున్నారు. సీక్వెల్ చేస్తే గనుక మిన్నల్ మురళి కంటే బెటర్ గా వుండే కథ కుదిరినప్పుడే చేయాలి.

తెలుగు సినిమాలు చూస్తారా? తెలుగు కథలు వింటున్నారు?
-తెలుగు సినిమాలు చూస్తాను. నేను చూసిన మొదటి సినిమా చిరంజీవి గారి ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’.
-తెలుగు స్క్రిప్ట్ డిస్కర్షన్స్ జరుగుతుంటాయి. లెట్స్ సీ.(నవ్వుతూ)

ఆల్ ది బెస్ట్
-థాంక్ యూ

Latest News

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

More News