సంతోష్ శోభన్ ‘లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్’ ట్రైలర్‌ను లాంచ్

Must Read

ప్రామిసింగ్ హీరో సంతోష్ శోభన్, దర్శకుడు మేర్లపాక గాంధీల యూత్‌ఫుల్ లవ్ అండ్ క్రైమ్ ఎంటర్‌టైనర్ ‘లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్’ నవంబర్ 4న విడుదలకు సిద్ధంగా ఉంది. ఇప్పటికే సినిమాకు సంబంధించిన ప్రమోష‌న్స్ జోరుగా సాగుతున్నాయి. టీజర్, పాటలు సినిమా అంచనాలను పెంచాయి. ఈరోజు ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను రెబల్ స్టార్ ప్రభాస్ లాంచ్ చేశారు.దర్శకుడు మేర్లపాక గాంధీ కాన్ ఫ్లిక్ట్ ని రివిల్ చేయకుండానే చాలా చాకచక్యంగా క్యూరియాసిటీని పెంచుతూ ట్రైలర్‌ను కట్‌ చేశాడు. సంతోష్ శోభన్ ట్రావెల్ బ్లాగర్ గా తన యూట్యూబ్ ఛానెల్ కోసం కొత్త వీడియోని షూట్ చేయడానికి వెళ్ళిన ట్రిప్ లో ఫరియా అబ్దుల్లాని కలవడం, ప్రేమలో పడటం చాలా క్రేజీగా ప్రజంట్ చేశారు. కథాంశం చాలా ఆసక్తికరంగా అనిపిస్తుంది.మేర్లపాక గాంధీ కామెడీని   డీల్ చేయడంలో దిట్ట. ఈ సినిమాలో కావల్సినంత వినోదాన్ని వుందని ట్రైలర్‌ చూస్తుంటే అర్ధమౌతుంది. ట్రైలర్ నక్సల్స్, పోలీసులు,  రౌడీ బ్యాచ్ ని ప్రజంట్ చేసిన విధానం చాలా థ్రిల్లింగా వుంది.  సంతోష్ శోభన్ డైనమిక్‌గా ఉన్నాడు. ఫరియా అబ్దుల్లాతో లవ్ ట్రాక్ ఆకట్టుకుంది.

బ్రహ్మాజీ టైమ్ బాంబ్ ఎపిసోడ్ నవ్విస్తుంది. నెల్లూరు సుదర్శన్ తన కామిక్ టైమింగ్‌తో అలరించాడు ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో హీరో సంతోష్ శోభన్ మాట్లాడుతూ.. మా సినిమా ట్రైలర్ రిలీజ్ చేసిన ప్రభాస్ గారికి  ‘లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్’ టీం తరపున కృతజ్ఞతలు. చాలా ఎంజాయ్ చేస్తూ ఈ సినిమా చేశాం.  ‘లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్’  కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్. అందరూ చూసి ఎంజాయ్ చేయొచ్చు. మేర్లపాక గాంధీ గారు ఇచ్చిన కథతో ఎక్ మినీ కథ చేశాను. అది మంచి విజయం సాధించింది. నటుడిగా మంచి గుర్తింపు తెచ్చింది. ఇప్పుడు ఆయన దర్శకత్వం నటించడం ఆనందంగా వుంది. మా నిర్మాత వెంకట్ బోయినపల్లి గారికి కృతజ్ఞతలు. ఫరియా అబ్దుల్లా ని ఈ సినిమాలో చూసి అందరూ సర్ ప్రైజ్ అవుతారు. బ్రహ్మజీ గారి పాత్ర ఇందులో అవుట్ స్టాండింగ్ గా వుంటుంది. నవంబర్ 4న సినిమా విడుదలౌతుంది. అందరూ తప్పకుండా  థియేటర్లో చూసి ఎంజాయ్ చేయాలి” అని కోరారుమేర్లపాక గాంధీ మాట్లాడుతూ..

‘లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్’ ఫుల్ ఫన్ మూవీ. నాన్ స్టాప్ నవ్వులు వుంటాయి. సంతోష్ శోభన్ తో ఎక్ మినీ కథ చేశాం. తను మంచి యాక్టర్.  ‘లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్’ పాత్రని పెర్ఫెక్ట్ గా చేశాడు. జాతిరత్నాలు తర్వాత ఫరియా అబ్దుల్లా ఈ సినిమా చేయడం ఆనందంగా వుంది. బ్రహ్మజీ, సుదర్శన్ , మైమ్ గోపి, చాలా మంచి నటీనటులు ఇందులో వున్నారు. నవంబర్ 4న సినిమా విడుదలౌతుంది. మీ అందరినీ అలరిస్తుంది” అన్నారు.ఫరియా అబ్దుల్లా మాట్లాడుతూ.. చాలా ఎంజాయ్ చేస్తూ ఈ సినిమా చేశాం. ప్రేక్షకులు కూడా ఎంజాయ్ చేస్తారనే నమ్మకం వుంది. అందరూ థియేటర్ లో చూసి ఎంజాయ్ చేయాలి” అని కోరారు బ్రహ్మాజీ మాట్లాడుతూ.. ‘లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్’ టీంతో కలసి చూశాను. అద్భుతంగా వుంది. జాతిరత్నాలు, డిజే టిల్లు సినిమా నచ్చితే మా సినిమా కూడా వంద శాతం అందరికీ నచ్చుతుంది. మేర్లపాక గాంధీ అద్భుతంగా డైరెక్ట్ చేశారు.

సినిమాలో పని చేసిన అందరికీ మంచి పేరు వస్తుంది. మా నిర్మాత ఎంతో నమ్మకంగా సినిమాని నిర్మించారు. ప్రేక్షకులు సినిమా చూసి నాన్ స్టాప్ గా నవ్వుతూనే వుంటారు. నవంబర్ 4న అందరూ థియేటర్లో సినిమా చూడాలి” అని కోరారు.సుదర్శన్ మాట్లాడుతూ.. నిన్న రాత్రే  టీం అంతా  ‘లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్’ చూశాం. అదిరిపోయింది. నాన్ స్టాప్ గా నవ్వుకుంటారు, మంచి ట్విస్ట్ లు కూడా వున్నాయి. మంచి కథతో మంచి పాత్రని ఇచ్చిన దర్శక నిర్మాతలు , టీం అందరికీ కృతజ్ఞతలు” తెలిపారువసంత్ కెమెరా డీవోపీ గా పని చేస్తున్న ఈ చిత్రానికి  ప్రవీణ్ లక్కరాజు, రామ్ మిరియాల సంగీతం అందించారు. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్‌తో కలిసి ఆముక్త క్రియేషన్స్ పై వెంకట్ బోయనపల్లి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్.

 తారాగణం: సంతోష్ శోభన్, ఫరియా అబ్దుల్లా, నెల్లూరు సుదర్శన్
సాంకేతిక విభాగం :
రచయిత, దర్శకత్వం: మేర్లపాక గాంధీ
నిర్మాత: వెంకట్ బోయనపల్లి
బ్యానర్లు: ఆముక్త క్రియేషన్స్, నిహారిక ఎంటర్టైన్మెంట్
సంగీతం: ప్రవీణ్ లక్కరాజు
డీవోపీ: వసంత్
ప్రొడక్షన్ డిజైనర్: అవినాష్ కొల్లా
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వెంకటరత్నం (వెంకట్)
పీఆర్వో: వంశీ-శేఖర్

Latest News

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

More News