సమంత వెరీ హార్డ్ వర్కింగ్ యాక్ట్రెస్!

సమంత టైటిల్ పాత్రలో నటించిన సినిమా ‘యశోద’. శ్రీదేవి మూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించారు. హరి, హరీష్ దర్శకత్వం వహించారు. ఇందులో ఉన్ని ముకుందన్ ఓ ప్రధాన పాత్రలో నటించారు. ‘జనతా గ్యారేజ్’, ‘భాగమతి’, ‘ఖిలాడీ’ తర్వాత ఆయన నటించిన తెలుగు చిత్రమిది. నవంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల అవుతోంది. ఈ సందర్భంగా ఉన్ని ముకుందన్ మీడియాతో ముచ్చటించారు. 

హాయ్ ఉన్ని ముకుందన్ గారు… ఎలా ఉన్నారు?
ఉన్ని ముకుందన్ : హలో అండి. నేను బావున్నాను. సూపర్బ్. ‘యశోద’ విడుదల కోసం వెయిట్ చేస్తున్నాను. 

తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో నవంబర్ 11న ‘యశోద’ విడుదలవుతోంది. ఇంతకు ముందు మీరు తెలుగు సినిమాలు చేశారు. వెల్కమ్ బ్యాక్ టు టాలీవుడ్ ఎగైన్!
తెలుగులో మూడు సినిమాలు చేశాను. ప్రతి సినిమాలో మంచి క్యారెక్టర్ ప్లే చేశా. ఆ  సినిమాలు కూడా హిట్ అయ్యాయి. ఇప్పుడు ‘యశోద’లో సమంతతో కలిసి నటించా. ఆమె చాలా టాలెంటెడ్ యాక్టర్. నటుడిగా నా విషయానికి వస్తే… కథ ఎలా ఉంది? అందులో నా పాత్ర ఏమిటి? అని చూస్తాను. ఆ పాత్రలో నేను ఎంత చేయగలను? అనేది ఆలోచిస్తా. నటుడిగా కొత్తదనం చూపించడం కూడా ముఖ్యమే కదా! ‘యశోద’ షూటింగ్ వెరీ వెరీ ఎంగేజింగ్ ప్రాసెస్. మంచి సినిమా తీశాం. ప్రేక్షకుల స్పందన తెలుసుకోవడం కోసం ఎదురు చూస్తున్నాను. 

దర్శకులు హరి, హరీష్ కథ చెప్పినప్పుడు మీ రియాక్షన్ ఏంటి?
వెంటనే ఓకే చెప్పేశా. అందులో మరో సందేహం లేదు. 

‘యశోద’లో మిమ్మల్ని అంతగా ఆకట్టుకున్న అంశం ఏమిటి? ట్రైలర్ చూస్తే మీరు డాక్టర్ రోల్ చేశారని తెలుస్తోంది
ప్రస్తుతానికి నా క్యారెక్టర్ గురించి ఎక్కువ చెప్పలేను. ఎందుకనేది మీరు సినిమా చూస్తేనే తెలుస్తుంది. నేను వెంటనే ఓకే చెప్పడానికి కారణం కూడా కథే. నా రోల్ గురించి ప్రస్తుతానికి సస్పెన్స్‌లో ఉండనివ్వండి. 

సమంతతో వర్కింగ్ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంది?
సమంత చాలా డెడికేటెడ్ అండ్ హార్డ్ వర్కింగ్ యాక్ట్రెస్. తన పాత్ర కోసం ఆవిడ చాలా ప్రిపేర్ అయ్యారు. ఫైట్స్ బాగా చేశారు. యాక్షన్, ఎమోషనల్ సీన్స్ చేశారు.  సెట్‌లో ఇతర ఆర్టిస్టులతో చక్కగా మాట్లాడతారు. ఒక  సన్నివేశం చేసేటప్పుడు ఎలా చేస్తే బావుంటుందని ఐడియాస్ డిస్కస్ చేసుకున్నాం.  మలయాళంలో వర్కింగ్ స్టైల్ కొంచెం డిఫరెంట్‌గా ఉంటుంది. నటుడిగా రిహార్సల్స్ ఇవ్వడానికి నేను కొంచెం ఆలోచిస్తా. మలయాళ సినిమా సెట్‌లో ఇతర ఆర్టిస్టులకు సర్‌ప్రైజ్ ఇవ్వాలని చూస్తా. ముందు ఏం చేస్తానో చెప్పను. డైరెక్ట్ కెమెరా ముందు చేసి చూపిస్తా. అప్పుడు వాళ్ళ ఎక్స్‌ప్రెషన్స్ నేచురల్‌గా ఉంటాయి.   

తెలుగులో కూడా సేమ్ ఫాలో అవుతున్నారా?
అవును. మలయాళంలో అలా చేసినప్పుడు మంచి రిజల్ట్స్ వచ్చాయి. సో… ఇక్కడ కూడా సేమ్! నేను ఎలా చేస్తానో తెలియనప్పుడు ఎదుటి ఆర్టిస్ట్ ఎక్స్‌ప్రెషన్స్ లైవ్లీగా ఉంటాయి. 

ఇటీవల సమంత తనకు మైయోసిటిస్ ఉందని చెప్పారు. షూటింగ్ చేసేటప్పుడు మీకు తెలుసా?
షూటింగ్ చేసేటప్పుడు నాకు తెలియదు. సమంత చాలా ప్రొఫెషనల్‌గా ఉన్నారు. ఎప్పుడూ తాను అటువంటి వ్యాధితో పోరాటం చేస్తున్నాని చెప్పలేదు. సమంత పోస్ట్ చూసి శాడ్ గా ఫీలయ్యాను. సమంతను దగ్గర నుంచి చూసి వ్యక్తిగా ఆవిడ మైయోసిటిస్‌తో పోరాటం చేస్తారు. ఆరోగ్యంతో మన ముందుకు వస్తారు.   

ట్రైలర్‌కు అన్ని భాషల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోంది. మలయాళ ప్రేక్షకుల నుంచి మీకు ఎటువంటి స్పందన వస్తోంది?
మలయాళంలో కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఒక్క మలయాళం మాత్రమే కాదు… అన్ని భాషల ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. అందరినీ ఆకట్టుకునే కమర్షియల్ ప్యాకేజ్డ్ స్క్రిప్ట్ ఇది. థియేటర్లలో చూసి ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాను. 

తెలుగులో ‘ఆదిత్య 369’ వంటి గొప్ప సినిమా తీసిన నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్. ఆయన నిర్మాణంలో ‘యశోద’ చేయడం ఎలా ఉంది?
ఆయన చాలా హంబుల్ పర్సన్. వ్యక్తిగతంగా కలిసినప్పుడు ఆయన గురించి చాలా తెలుసుకున్నాను. స్టోరీ లైన్, స్క్రిప్ట్‌లో ప్రతిదీ ఆయనకు తెలుసు. ప్రొడక్షన్ హౌస్ నుంచి ఏం కావాలన్నా ఇస్తారు. ఎప్పుడూ సినిమా బాగా రావాలని ఆశిస్తారు. దానికి ఏం చేయడానికి అయినా రెడీగా ఉంటారు. మా టీమ్, డైరెక్టర్స్ అంతా శ్రీదేవి మూవీస్ సంస్థకు కృతజ్ఞతతో ఉండాలి. ‘యశోద’ ఫ్యూచరిస్టిక్ స్టోరీ ఐడియా. మన సొసైటీ ఎటు వెళుతుందనేది చూపిస్తున్నారు. త్వరలో అది రియాలిటీగా మారుతుంది.

సరోగసీ నేపథ్యంలో సినిమా తీశారు. సరోగసీపై మీ అభిప్రాయం ఏమిటి?
వ్యక్తిగత పరమైన అంశం అది! చట్టప్రకారం సరోగసీని ఆశ్రయించినప్పుడు ఎవరికి ఎటువంటి సమస్య ఉండదు. సరోగసీ అనేది చెప్పడం సులభమే. కానీ, అదొక ఎమోషనల్ జర్నీ. ఈజీగా దానిపై కామెంట్ చేయకూడదు. సైంటిఫిక్‌గా చూస్తే… మిరాకిల్. పురాణాల్లో మనం అటువంటి వాటి గురించి విన్నాం. 

ప్రస్తుతం మీరు చేస్తున్న సినిమాలు?
మలయాళంలో రెండు మూడు చేస్తున్నాను. ‘మాలికాపురం’ సినిమా పాన్ ఇండియా కాన్సెప్ట్‌తో చేస్తున్నాం. తెలుగులో కూడా దానిని విడుదల చేస్తున్నాం.  

Tfja Team

Recent Posts

హీరో కిరణ్ అబ్బవరం కేఏ ప్రొడక్షన్స్, సుమైర స్టూడియోస్ నిర్మిస్తున్న”తిమ్మరాజుపల్లి టీవీ” మూవీ నుంచి ‘గోపాల గోపాల’ సాంగ్ రిలీజ్

న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్…

6 hours ago

జూన్ 26న రానున్న మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘లెనిన్’.. అఖిల్ అక్కినేని పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ పోస్టర్ రిలీజ్

యంగ్ అండ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని ‘లెనిన్’ మీదున్న హైప్ గురించి అందరికీ తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో…

4 days ago

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా అట్లీ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న భారీ ప్రాజెక్ట్ ‘రాకా’ టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

భారతీయ చిత్ర పరిశ్రమ ఎదురుచూస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ, టాప్ ప్రొడ్యూసర్…

4 days ago

నేషనల్ క్రష్ రశ్మిక మందన్నకు బర్త్ డే విశెస్ చెబుతూ స్పెషల్ వీడియో రిలీజ్ చేసిన “రణబాలి” మేకర్స్

విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో టీ సిరీస్ సమర్పణలో ప్రెస్టీజియస్ బ్యానర్ మైత్రీ మూవీ…

1 week ago

హీరో కిరణ్ అబ్బవరం కేఏ ప్రొడక్షన్స్, సుమైర స్టూడియోస్ నిర్మిస్తున్న”తిమ్మరాజుపల్లి టీవీ” మూవీ నుంచి ‘నిజమేనా’ లిరికల్ సాంగ్ రిలీజ్

న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్…

1 week ago

జర్నలిస్టు మిత్రుల చేతుల మీదుగా రఘుకుంచె “గేదెల రాజు” సినిమా ట్రైలర్ రిలీజ్, ఈ నెల 17న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మూవీ

సంగీత దర్శకుడు, నటుడు, సింగర్‌ రఘు కుంచె టైటిల్‌ రోల్‌లో నటించిన చిత్రం "గేదెల రాజు". ఈ సినిమాలో రవి…

1 week ago