మార్చి రెండో వారంలో విడుదలకు సిద్ధమవుతున్న “ఆర్ కె దీక్ష” మూవీ

ఆర్ కె ఫిలిమ్స్, సిగ్ధ క్రియేషన్స్ బ్యానర్‌‌లో డా.ప్రతాని రామకృష్ణ గౌడ్ దర్శక నిర్మాతగా బిఎస్ రెడ్డి సమర్పణలో ఢీ, జోడి ఫేమ్ అక్సఖాన్, అలేఖ్య రెడ్డి హీరోయిన్స్ గా, కిరణ్ హీరోగా నటిస్తున్న చిత్రం “ఆర్ కే దీక్ష”. ఈ చిత్రంలో తులసి, అనూష,కీర్తన, ప్రవల్లిక, రోహిత్ శర్మ ఇతర కీలక పాత్రలు పోషించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న “ఆర్ కే దీక్ష” సినిమాను మార్చి రెండో వారంలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకొస్తున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో

దర్శకనిర్మాత ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ – మా “ఆర్ కే దీక్ష” సినిమాను మార్చి రెండో వారంలో రిలీజ్ చేయాలని నిర్ణయించాం. అప్పటికి విద్యార్థుల పరీక్షలు కూడా పూర్తవుతాయి. వాస్తవానికి మేము ఈ సంక్రాంతి పండక్కే సినిమా విడుదల చేయాలని అనుకున్నాం కానీ ఇంకా క్వాలిటీగా మూవీ సీజీ వర్క్ చేయించడంతో ఆలస్యమైంది. “ఆర్ కే దీక్ష” అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే సినిమా. పట్టుదలగా ప్రయత్నిస్తే విజయం సాధ్యమనే మంచి సందేశాన్ని ఈ చిత్రం అందిస్తుంది. లవ్, యాక్షన్, ఎమోషన్ వంటి అన్ని అంశాలుంటాయి. మా మూవీ సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. మధు ప్రియ మూడు పాటలు పాడింది. అక్సఖాన్ చేసిన సాంగ్ స్పెషల్ అట్రాక్షన్ అవుతుంది. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన జవాన్ మురళీ నాయక్ తో పాటు ఇతర వీర జవాన్ల కీర్తిని ప్రశంసిస్తూ ఒక మంచి పాట రూపొందించాం. బీఎస్ రెడ్డి గారు చిత్ర సమర్పకులుగా మాకు సహకారం అందించారు. రోహిత్ శర్మ అనే విలన్ ను పరిచయం చేస్తున్నాం. 118 దేశాల్లో నాన్ చాక్ లో మెడల్స్ గెల్చుకున్న రవి మాస్టర్ మా మూవీకి స్టంట్స్ కంపోజ్ చేశారు. హీరో కిరణ్ కు ఈ సినిమా మంచి పేరు తీసుకొస్తుంది. ఈ మూవీ తర్వాత స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో ఒక సినిమా చేయబోతున్నాం. ఏడాదికి రెండు సినిమాలు చేయాలనే ప్లానింగ్ లో ఉన్నాం. ప్రతి కామన్ ఆడియెన్ కు కనెక్ట్ అయ్యే కంటెంట్ తో “ఆర్ కే దీక్ష” సినిమా ఆకట్టుకుంటుంది అన్నారు.

హీరో కిరణ్ మాట్లాడుతూ – “ఆర్ కే దీక్ష” సినిమా మార్చి రెండో వారంలో రిలీజ్ కు వస్తుండటం సంతోషంగా ఉంది. సినిమా టైటిల్ గానే మేము కూడా దీక్షగా ఈ సినిమాలో నటించాం. ఆర్కే గౌడ్ గారు టీఎఫ్ సీసీ అసోసియేషన్ పెట్టి 24 క్రాఫ్టుల వారికి ప్రోత్సాహం అందిస్తున్నారు. మా లాంటి కొత్త నటీనటులకు అవకాశాలు ఇస్తున్నారు. ఈ సినిమాకు బీఎస్ రెడ్డి గారు ప్రొడక్షన్ లో తమ వంతు సహకారం అందించారు. పెద్ద వాళ్లకు ఎలాగూ ఇండస్ట్రీలో సపోర్ట్ ఉంటుంది. మాలాంటి కొత్త వాళ్లను కూడా మీరు సపోర్ట్ చేసి మా మూవీని ఆదరిస్తారని కోరుకుంటున్నా అన్నారు.

హీరోయిన్ అక్స ఖాన్ హీరోయిన్ ఆర్ కే దీక్ష చిత్రంలో నాకు అవకాశం ఇచ్చిన రామకృష్ణ గౌడ్ గారికి థ్యాంక్స్ చెబుతున్నా. ఈ సినిమాలో నంది అవార్డ్స్ నేపథ్యంగా నంది నంది అనే స్పెషల్ సాంగ్ చేశాం. ఈ పాట ప్రేక్షకులకు బాగా నచ్చుతుంది. నా క్యారెక్టర్ చాలా బాగుంటుంది. అలాగే కిరణ్ తో కలిసి వర్క్ చేయడం హ్యాపీగా ఉంది. ఆర్ కే దీక్ష అన్ని ఎలిమెంట్స్ ఉన్న ప్యాకేజ్ మూవీ. మా మూవీ కోసం మేమే కాదు ప్రతి డిపార్ట్ మెంట్ హార్డ్ వర్క్ చేశారు. మార్చి సెకండ్ వీక్ లో వస్తున్న మా చిత్రాన్ని సక్సెస్ చేయాలని కోరుకుంటున్నా అన్నారు.

నటి తులసి మాట్లాడుతూ నేను ఈ చిత్రంలో హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్ లో నటించాను. ఆర్ కే దీక్ష మూవీ పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నా అన్నారు.

చిత్ర సమర్పకులు డీఎస్ రెడ్డి మాట్లాడుతూ మా “ఆర్ కే దీక్ష” సినిమా ప్రేక్షకులకు కోరుకునే అన్ని అంశాలతో పాటు మంచి సందేశంతో నిర్మించాం. దర్శక నిర్మాత ఆర్కే గౌడ్ గారు ఈ సినిమాను దీక్షతో రూపొందించారు. మా కిరణ్, అక్సలకు ఈ సినిమాతో మంచి పేరు రావాలి. మన వీర జవాన్ల గొప్పదనం ఈ సినిమాలో తెలియజేస్తున్నాం. మార్చి రెండో వారంలో రిలీజ్ కాబోతున్న మా చిత్రాన్ని ప్రేక్షకులంతా ఆదరిస్తారని కోరుకుంటున్నాం అన్నారు.

నటీనటులు : కిరణ్, అక్స ఖాన్, అలేఖ్య రెడ్డి, తులసి, అనూష,కీర్తన, ప్రవల్లిక, రోహిత్ శర్మ తదితరులు.

*టెక్నికల్ టీమ్:
దర్శక నిర్మాత : డా. ప్రతాని రామకృష్ణ గౌడ్
సమర్పకులు : డీఎస్ రెడ్డి
బ్యానర్స్ : ఆర్ కె ఫిలిమ్స్ , సిగ్ధ క్రియేషన్స్
సంగీతం : రాజు కిరణ్
ఎడిటర్ : మేనగ శ్రీను
ఫైట్స్ : రవి
డాన్స్ : ఆనంద్
పిఆర్ఓ : చందు రమేష్

TFJA

Recent Posts

వేలంటైన్స్ డే స్పెషల్ గా గ్రాండ్ గా రి రిలేజ్ అవుతున్న ఉదయ్ కిరణ్ మనసంతా నువ్వే

ప్రముఖ నిర్మాత శ్రీ ఎమ్.ఎస్.రాజు తన సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్ పై ప్రతిష్టాత్మకంగా నిర్మించిన " మనసంతా నువ్వే "…

13 hours ago

ఘనంగా “అమరావతికి ఆహ్వానం” సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్, ఈ నెల 13న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్

శివ కంఠంనేని, ధ‌న్య బాల‌కృష్ణ‌, ఎస్తేర్, సుప్రిత, హ‌రీష్ ప్ర‌ధాన తారాగణంగా తెరకెక్కిన సినిమా "అమరావతికి ఆహ్వానం". ఈ మూవీలో…

15 hours ago

అంగరంగ వైభవంగా తెలుగు సినిమా పుట్టినరోజు వేడుకలు

నేస్తం ఫౌండేషన్ మరియు తెలుగు సినిమా వేదిక సంస్థలు తెలుగు సినిమా పుట్టినరోజు వేడుకలను హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్ లో…

1 day ago

శ్రీ చిదంబరం గారు అందరి హృదయాలకు హత్తుకుంటుంది: బ్లాకబస్టర్‌ థ్యాంక్స్‌ మీట్‌లో ఆనంద వ్యక్తం చేసిన టీమ్‌

శ్రీమతి. చింతా వరలక్ష్మీ సమర్పణలో శ్రీ చక్రాస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ మీద చింతా వినీష రెడ్డి, చింతా గోపాల కృష్ణా…

1 day ago

యాక్షన్ కింగ్ అర్జున్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘సీతా పయనం’ ట్రైలర్ రిలీజ్.. ఫిబ్రవరి 14న చిత్రం నాలుగు భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా బారి ఎత్తున విడుదల

మల్టీ టాలెంటెడ్ నటుడు, దర్శకుడు యాక్షన్ కింగ్ అర్జున్ దర్శకత్వంలో శ్రీ రామ్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై రాబోతోన్న కొత్త…

1 day ago

మాస్ కా దాస్ విశ్వక్ సేన్, దర్శకుడు కె.వి. అనుదీప్, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ‘ఫంకీ’ చిత్ర ట్రైలర్ విడుదల

వైవిధ్యమైన చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న కథానాయకుడు మాస్ కా దాస్ విశ్వక్ సేన్, హాస్య చిత్రాలకు చిరునామాగా…

1 day ago