ప్రపంచవ్యాప్తంగా జూలై 14న “రివెంజ్” విడుదల

ఆది అక్ష‌ర ఎంట‌ర్టైన్ మెంట్స్ ప‌తాకంపై బాబు పెదపూడి హీరోగా న‌టిస్తూ నిర్మించిన చిత్రం రివెంజ్. నేహదేశ్ పాండే హీరోయిన్‌. రెట్టడి శ్రీనివాస్ ద‌ర్శ‌కుడు. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైల‌ర్ ఇప్పటికే విడుదలై చిత్రంపై అంచనాలను పెంచింది.

ఈ సందర్భంగా హీరో, నిర్మాత బాబు పెద‌పూడి మాట్లాడుతూ..“మా ఫ్యామిలీ స‌పోర్ట్ తో అబ్రాడ్ వెళ్లాను. కానీ నాకు మొద‌టి నుంచి సినిమాలంటే ఎంతో ఇష్టం. అబ్రాడ్ లో ఉంటూనే త్రివిక్ర‌మ్ గారి అత‌డు, ద‌శ‌ర‌థ్ గారి శ్రీ సినిమాల్లో మంచి క్యారక్ట‌ర్స్ చేశాను. ఇంకా కొన్ని అవ‌కాశాలు వ‌చ్చినప్ప‌టికీ నాకున్న బిజీ వ‌ల్ల చేయలేక‌పోయాను. ఈ నేప‌థ్యంలో మూడేళ్ల కిత్రం ద‌ర్శ‌కుడు శ్రీనివాస్ గారితో ప‌రిచ‌యం ఏర్ప‌డింది. ఒక మంచి న‌టుడుగా న‌న్ను ప‌రిచ‌యం చేయ‌డానికి నాకోసం చాలా పాత్ర‌లు రాశారు. త‌న డెడికేష‌న్ న‌చ్చి ఈ సినిమా త‌న‌కిచ్చాను. అద్భుతంగా తీశారు. ట్రైల‌ర్ చూశాక ఇది ఒక సైకో క‌థ అనిపించవచ్చు. కానీ బ‌ర్నింగ్ పాయింట్స్ తో తీసిన సినిమా ఇది. ప్రతి ఆడియన్ హర్ట్ ని టచ్ చేసే కథ. మ‌నం అమితంగా ఇష్ట‌పడే వాళ్ల‌కు ఏమైనా జ‌రిగితే మ‌నం ఎలా మారిపోతాం అనేది సినిమా. ఆర్టిస్ట్స్ , టెక్నీషియ‌న్స్ అంతా ప్రాణం పెట్టి ప‌నిచేశారు. జూలై 14న ప్రపంచవ్యాప్తంగా విడుద‌ల‌ చేస్తున్నాం“ అన్నారు.


చిత్ర ద‌ర్శ‌కుడు రెట్టడి శ్రీనివాస్ మాట్లాడుతూ..“30 ఏళ్లుగా సినిమా రంగంలో ఉంటున్నా. విజ‌య్ భాస్క‌ర్, వంశీ గార్ల వంటి ప్ర‌ముఖ ద‌ర్శ‌కుల వ‌ద్ద ప‌ని చేశాను. పొద‌రిల్లు, ఐపిసి సెక్ష‌న్ రెండు సినిమాలు డైర‌క్ట్ చేశాను. ఇది మూడో సినిమా. హీరో, నిర్మాత బాబుగారి ప్యాష‌న్ చూశాక ఒక మంచి క‌థ రాయాల‌ని డిసైడ్ అయ్యాను. చాలా పాత్ర‌లు రాశాను. చివ‌రిగా రివెంజ్ క‌థ తీశాం. మొద‌ట క్యార‌క్ట‌ర్ రాసి ఆ త‌ర్వాత సినిమా క‌థ రాశాను. బాబుగారు ఎక్సెలెంట్ ప‌ర్ఫార్మెన్స్ ఇచ్చారు. సెన్సార్ పూర్తయింది. జూలై 14న గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నాం“ అన్నారు.

ఆరోహి, భార్గ‌వ్, నాగేష్ క‌ర్ర ముఖ్య పాత్ర‌ల్లో న‌టించిన ఈ చిత్రానికి డిఓపిః చిడ‌త‌ల న‌వీన్‌; సంగీతంః విజ‌య్ కురాకుల‌; పీఆర్వోః ర‌మేష్ చందు; ఎడిట‌ర్ః మేన‌గ శ్రీను; నిర్మాత: బాబురావు పెదపూడి(USA) ర‌చ‌న‌-ద‌ర్శ‌క‌త్వంః రెట్టడి శ్రీనివాస్.

Tfja Team

Recent Posts

”తత్వం” సాధించే విజయంతో మా కష్టాలన్నీ మరిచిపోతాం: యువ దర్శకుడు అర్జున్‌ కోలా

అర్జున్‌ కోలా దర్శకత్వంలో దినేష్‌ తేజ్‌, దష్విక.కె హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'తత్వం' త్రయతి ఇషాని క్రియేషన్స్‌, ఎస్‌.కె.ప్రొడక్షన్స్‌…

15 hours ago

తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి

స్నేహా రెడ్డి అంటే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది స్టార్ హీరో అల్లు అర్జున్ భార్యగానే. అయితే ఆమె తనకంటూ…

15 hours ago

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ చిత్రం గొప్ప విజ‌యాన్ని సాధించాల‌ని కోరుకుంటున్నా: ప‌్రీ రిలీజ్ ఈవెంట్‌లో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ను అంద‌రూ థియేట‌ర్స్‌లో ఎంజాయ్ చేస్తారు.. సినిమా పెద్ద హిట్ అవుతుంది: ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి…

15 hours ago

చదలవాడ శ్రీనివాసరావుకు శుభాకాంక్షలు తెలిపిన ఫిలింక్రిటిక్స్ అసోసియేష్‌న్‌

ఇటీవల జరిగిన నిర్మాతల మండలి ఎన్నికల్లో కోశాధికారిగా ఘనవిజయం సాధించినశ్రీ చదలవాడ శ్రీనివాసరావును ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ సీనియర్ సభ్యులు, కార్యవర్గం…

3 weeks ago

‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ ఆనంద్ దేవరకొండ ఫిల్మోగ్రఫీలో ఒక బ్యూటిఫుల్ సినిమాగా నిలుస్తుంది: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ

ఆదిత్య హాసన్ రచన చాలా బాగుంది.. ‘ఎపిక్’ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను: ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా…

3 weeks ago

ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ ద్వారాసెప్టెంబర్ 18న‘పిఠాపురంలో… అలా మొదలైంది’ విడుదల—ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో…

ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం సెప్టెంబర్ 18న…

3 weeks ago