రామ్ గోపాల్ వర్మ చేతుల మీదుగా “డీమాంటీ కాలనీ 2” ట్రైలర్ రిలీజ్

Must Read

బ్లాక్ బస్టర్ హారర్ థ్రిల్లర్ డీమాంటీ కాలనీకి సీక్వెల్ గా రూపొందిన సినిమా డీమాంటీ కాలనీ 2. ఈ సినిమాలో అరుల్ నిధి, ప్రియ భవానీ శంకర్ జంటగా నటిస్తున్నారు. అన్తి జాస్కేలైనెన్, సెరింగ్ డోర్జీ, అరుణ్ పాండియన్ ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని రాజ్ వర్మ ఎంటర్ టైన్మెంట్ మరియు శ్రీ బాలాజీ ఫిలింస్ సంయుక్తంగా తెలుగులో విడుదల చేస్తున్నారు. దర్శకుడు అజయ్ ఆర్ జ్ఞానముత్తు రూపొందించిన డీమాంటీ కాలనీ 2 సినిమా ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ రోజు ఈ చిత్ర ట్రైలర్ ను ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేశారు. ట్రైలర్ ఇంట్రెస్టింగ్ గా ఉందన్న ఆర్జీవీ చిత్ర బృందానికి ఆల్ ది బెస్ట్ చెప్పారు.

డీమాంటీ కాలనీ ట్రైలర్ ఎలా ఉందో చూస్తే – డీమాంటీ ఇంట్లో అనూహ్యమైన ఘటనలు జరుగుతుంటాయి. ఆ ఇంట్లో నుంచి బయటకు వచ్చిన చైన్ తిరిగి ఆ ఇంటికే ఎలాగోలా చేరుతుంటుంది. ఈ ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు వెళ్లిన వారు చనిపోతుంటారు. ఓ సందర్భంలో ప్రధాన పాత్రధారులంతా ఆ ఇంట్లోకి వెళ్తారు. వారికి అక్కడ నమ్మలేని, భయంకర ఘటనలు ఎదురవుతాయి. డీమాంటీ ఇంట్లో ఉన్న ఆ శక్తి ఏంటి, దాని నుంచి ఎలా ప్రాణాలు కాపాడుకున్నారు అనేది ట్రైలర్ లో గూస్ బంప్స్ తెప్పించేలా చూపించారు దర్శకుడు అజయ్ ఆర్ జ్ఞానముత్తు

నటీనటులు – అరుల్ నిధి, ప్రియ భవానీ శంకర్, అన్తి జాస్కేలైనెన్, సెరింగ్ డోర్జీ, అరుణ్ పాండియన్, ముత్తుకుమార్, మీనాక్షి గోవింద్ రాజన్, సర్జనో ఖాలిద్, అర్చన రవిచంద్రన్

టెక్నికల్ టీమ్

మ్యూజిక్ – సామ్ సీఎస్
సినిమాటోగ్రఫీ – హరీశ్ కన్నన్
ఎడిటర్ – కుమరేష్.డి.
పీఆర్ఓ – జీఎస్ కే మీడియా (సురేష్ – శ్రీనివాస్)
ప్రొడ్యూసర్స్ – విజయసుబ్రహ్మణ్యన్, ఆర్.సి.రాజ్ కుమార్
కో ప్రొడ్యూసర్స్ – బి సురేష్ రెడ్డి, బి.మానస రెడ్డి
రచన దర్శకత్వం – అజయ్ ఆర్ జ్ఞానముత్తు

Latest News

Nithiin Thammudu Releasing on Maha Shivaratri 2025

Popular production house Sri Venkateswara Creations, known for blockbuster films, is now bringing an entertainer in the crazy combination...

More News