పాన్ ఇండియా అడ్రినలిన్ ఫిల్డ్ యాక్షన్-అడ్వెంచర్ ‘సరిపోదా శనివారం’లో నేచురల్ స్టార్ నాని సరసన ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటిస్తోంది. గ్యాంగ్ లీడర్ తర్వాత నానితో ఆమెకిది రెండో సినిమా. ఈరోజు, మేకర్స్ ప్రియాంక మోహన్ ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు.
ఫస్ట్ లుక్ పోస్టర్‌లో ప్రియాంక మోహన్ చారులత అనే ఇన్నోసెంట్ పోలీసుగా కనిపించింది. ఆమె క్యారెక్టర్‌లో ఫిట్‌గా కనిపిస్తుంది. అందమైన చిరునవ్వు ఆకట్టుకుంది. ఖాకీ దుస్తులు ధరించి, భుజంపై బ్యాగ్‌తో నడుస్తూ కనిపించింది. సినిమాలో ప్రియాంక పాత్ర చాలా కీలకంగా ఉండబోతుంది.
వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని డివివి ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి హై బడ్జెట్, టాప్ ప్రొడక్షన్ వాల్యూస్ తో నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ఎస్‌జే సూర్య కీలక పాత్రలో నటిస్తున్నారు.
మురళి జి డీవోపీ కాగా, జేక్స్ బిజోయ్ సంగీతం సమకూర్చారు. కార్తీక శ్రీనివాస్ ఎడిటర్.
ఈ పాన్ ఇండియా చిత్రం ఆగస్టు 29, 2024న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది.
సరిపోదా శనివారం షూటింగ్ చివరి దశలో ఉంది.
నటీనటులు: నాని, ప్రియాంక అరుల్ మోహన్, SJ సూర్య, సాయి కుమార్
సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: వివేక్ ఆత్రేయ
నిర్మాతలు: డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి
బ్యానర్: డివివి ఎంటర్‌టైన్‌మెంట్స్
సంగీతం: జేక్స్ బిజోయ్
డీవోపీ: మురళి జి
ఎడిటర్: కార్తీక శ్రీనివాస్
ఫైట్స్: రామ్-లక్ష్మణ్
పీఆర్వో: వంశీ-శేఖర్
మార్కెటింగ్: వాల్స్ అండ్ ట్రెండ్స్
ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ మీద సమంత, రాజ్ నిడిమోరు, హిమాంక్ దువ్వూరు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘మా ఇంటి…
యంగ్ అండ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని లేటెస్ట్ మూవీ ‘లెనిన్’ శరవేగంగా రూపొందుతోంది. ఈ సినిమాపై మంచి అంచనాలు…
మలయాళ స్టార్ హీరో టొవినో థామస్ నటించిన భారీ బడ్జెట్ మూవీ "పళ్లిచట్టంబి". ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్ ఫిలింస్,…
గత ఏడాది బ్లాక్ బస్టర్ మూవీ ‘సైయారా’ కాంబో మళ్లీ మన ముందుకు రావటానికి సమాయత్తమవుతోంది. సైయారా అద్భుత విజయంతో…
ఎమ్మెస్ రాజు అంటే ఒక బ్రాండ్. సుమంత్ ఆర్ట్స్ పతాకంపై ఆయన నిర్మించిన "శత్రువు, దేవి, మనసంతా నువ్వే, ఒక్కడు,…
అలనాటి నటి, గాయని, నిర్మాత కృష్ణవేణమ్మ జీవితాన్ని గ్రంధస్తం చెయ్యడం ఎంతో సంతోషంగా ఉందని, ఆమె జీవితం నేటి తరానికి…