జైనీ క్రియేషన్స్ పతాకంపై మూలవిరాట్, పద్మ,రాజ్ కుమార్, స్వప్న నటీ నటులుగా అమ్మ నీకు వందనం, క్యాంపస్ అంపశయ్య’, ప్రణయ వీధుల్లో’, వంటి ప్రయోజనాత్మక ‘ సినిమాలు తీసిన ప్రభాకర్ జైనీ దర్శకత్వంలో శ్రీమతి విజయలక్ష్మీ జైనీ నిర్మించిన చిత్రం ‘ప్రజాకవి కాళోజీ’ బయోపిక్!.. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని డిసెంబర్ 23 న విడుదలకు సిద్దమైన సందర్బంగా
చిత్ర దర్శకుడు ప్రభాకర్ జైనీ మాట్లాడుతూ…మన కాలపు మహాకవి కాళోజీ గారి సందేశం, మన విద్యార్థులకైనా చేరితే, సినిమా తీసిన ప్రయోజనం నెరవేరుతుందనే ఉద్దేశ్యంతో తెలంగాణా ముఖ్యమంత్రి గారి ప్రధాన సలహాదారు వేం నరేందర్ రెడ్డిగారిని కలవడం జరిగింది. వారు సానుకూలంగా స్పందించడం చాలా సంతోషంగా ఉంది. దీంతో ఇప్పుడు తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో డిసెంబరు 23 నుండి 29 డిసెంబరు వరకు 24 థియేటర్లలో, వారం రోజుల పాటు రోజూ ఒక్క మార్నింగ్ షో మాత్రమే ఉదయం 9 నుండి 11 గంటలకు, అదీ స్కూలు పిల్లలకు ఉచితంగా. ఈ క్రింది థియేటర్లలో ప్రదర్శిపబడుతుంది. ఇంతకంటే ఇంకా ఎక్కువగా విడుదల చేయలేనందుకు నాకూ బాధగానే ఉంది. కానీ.. ఎవ్వరు కూడా ఈ సినిమా కమర్షియల్ గా నడవదనీ, రిలీజ్ చేసే సాహసం చేయలేమని అశక్తత వ్యక్తం చేయడంతో ఈ విధంగా చేయవలసి వచ్చింది. పిల్లలకు బాగా నచ్చి, వారే రాయబారులై సినిమా అందరూ చూడాలని ఉద్యమిస్తే, రెగ్యులర్ షోస్ వేసే అవకాశం కలుగుతుంది. లేదా కనీసం OTT లో విడుదలకై అవకాశం కలుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
అలాగే ఈ కార్యక్రమంలో , ప్రముఖ నిర్మాత దిల్ రాజు గారు, శ్రీ వేముల శ్రీనివాసులు(ఓ యస్ డి) , సీఎంఓ సోదరుడు మూర్తి పాత , డిప్యూటీ సెక్రటరీ తెలంగాణ గవర్నమెంట్ గారు, తెలంగాణా స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ అండ్ కామర్స్ హానరరీ సెక్రెటరీ అనుపమ్ రెడ్డి గారు తమ వంతు సహకారం అందించారు. ప్రభుత్వంలో ఒక ఫైల్ అప్రూవ్ కావడానికి అనేక చిక్కులు ఉంటాయి. అవన్నీ దాటడంలో అనేక మంది మితృలు సహకరించారు. వారందరికీ నా ధన్యవాదాలు!
నటీ నటులు
కాళోజీ గారితో చిరకాలంగా సన్నిహితంగా మెదిలిన పొట్లపల్లి శ్రీనివాసరావు, నాగిళ్ళ రామశాస్త్రి, విద్యార్థి, అంపశయ్య నవీన్, డాక్టర్ వీయస్ రెడ్డి, అన్వర్, పీవీ నరసింహారావు పాత్రలో వారి సోదరుడు, పీవీ మనోహర్ రావు, ప్రముఖ కవి తుమ్మూరి రామ్మోహన్ రావు, వైభవ్ సూర్య, శంకర్, మల్లికార్జున్, ప్రియ, రాధిక, నరేశ్, రజని, దేవేందర్ రెడ్డి, లాయర్ చౌహాన్, జమీందారు పాత్రలో ఆంధ్రప్రభ చీఫ్ ఎడిటర్ వైయస్సార్ శర్మ నటించారు. మిసెస్ ఇండియా సుష్మా తోడేటి తదితరులు
సాంకేతిక నిపుణులు
బ్యానర్: జైనీ క్రియేషన్స్,
నిర్మాత: విజయలక్ష్మీ జైనీ,
కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: ప్రభాకర్ జైనీ.
కెమెరామెన్: స్వర్గీయ రవి కుమార్ నీర్ల;
సంగీతం: యస్.యస్.ఆత్రేయ,
నేపథ్య సంగీతం: మల్లిక్ యం.వి.కే;
ఎడిటింగ్: కొండవీటి రవి కుమార్,
సెకండ్ యూనిట్ కెమెరా: భాస్కర్,
పి. ఆర్. ఓ : మూర్తి
Dharma and Aishwarya Sharma play the lead roles in Drinker Sai, which carries the tagline…
ధర్మ, ఐశ్వర్య శర్మ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా "డ్రింకర్ సాయి". బ్రాండ్ ఆఫ్ బ్యాడ్ బాయ్స్ అనేది ఈ…
Aaron Taylor-Johnson is arguably one of the fittest stars out there and his physical transformation…
వరల్డ్ లోనే మోస్ట్ హ్యాండ్సం మ్యాన్ అయిన టేలర్ జాన్సన్ తన ఫ్యాన్స్ తో మాట్లాడుతూ, తను క్రావెన్ ది…
డైస్ ఆర్ట్ ఫిల్మ్స్ ఆధ్వర్యంలో ప్రముఖ గాయకుడు నోయెల్ తెలుగోడి బీట్ సాంగ్ లాంచ్ ఈవెంట్ విజయవంతంగా జరిగింది. ఈ…
తన కెరీర్ లో మెమొరబుల్ ఇయర్ 2024కు సెండాఫ్ ఇచ్చేందుకు రెడీ అయ్యింది నేషనల్ క్రష్ రశ్మిక మందన్న. ఈ…