డైస్ ఆర్ట్ ఫిల్మ్స్ ఆధ్వర్యంలో ప్రముఖ గాయకుడు నోయెల్ తెలుగోడి బీట్ సాంగ్ లాంచ్ ఈవెంట్ విజయవంతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, విద్యార్థులు పాల్గొని ఈ వేడుకను మరింత ప్రత్యేకంగా చేశారు. ఈ వేడుకలో నోయెల్ సాంగ్‌కు మంచి స్పందన వచ్చింది. డైస్ ఆర్ట్ ఫిల్మ్స్ తరఫున ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. మీ ప్రేమ, ప్రోత్సాహం లేనిదే ఈ కార్యక్రమం సాధ్యం కాలేదు.
డైస్ ఆర్ట్ ఫిల్మ్స్ టీమ్ హర్షడైస్, మనస్వి రాజేష్ కన్నా మాట్లాడుతూ.. నిన్న జరిగిన నోయెల్ సాంగ్ ఈవెంట్ భారీ విజయాన్ని సాధించింది! దీన్ని మర్చిపోలేని విధంగా చేసినందుకు నా JNAFAU విద్యార్థులకు మరియు అతిథులకు ధన్యవాదాలు! నోయెల్ తన అద్భుతమైన ప్రదర్శనకు మరియు మాతో చేరినందుకు మా అతిథులకు ప్రత్యేక ధన్యవాదాలు. ఈ కార్యక్రమం జరగడానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అందరికీ ధన్యవాదాలు! ఈ ఈవెంట్‌ని హోస్ట్ చేసి అందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చే అవకాశం లభించినందుకు థ్రిల్‌గా ఉన్నాను. ఇది సంగీతం, నవ్వు మరియు జ్ఞాపకాలతో నిండిన రాత్రి, మేము ఎప్పటికీ ఆదరిస్తాము. మరోసారి, ఈ ఈవెంట్‌ను ఇంత ప్రత్యేకంగా చేసినందుకు మీలో ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు!
ఈ కార్యక్రమంలో రాహుల్ సిప్లిగంజ్, దేత్తడి హారిక, సిద్దు రెడ్డి కందకట్ల, మెహబూబా, ఇంద్రసేన తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మ్యూజిక్ డైరెక్టర్ నోయల్ మాట్లాడుతూ.. సాంగ్ చాలా బాగా వచ్చిందని, ఇంత బాగా రావడానికి కారణం అయినా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఈ పాటకు పని చేసిన డిఓపి భార్గవ్ అత్యద్భుతమైన విజువల్స్ అందించాలని, పాటలో స్టన్నింగ్ విజువల్స్ ఉన్నాయని పేర్కొన్నారు. అలాగే కొరియోగ్రాఫర్ సుభాష్ మాస్టర్ డాన్స్ చాలా బాగా కంపోజ్ చేశారని తెలిపారు. ఇక ఈవెంట్ కు రాహుల్ సీట్లు గంజ్ రావడం ఎంతో ప్రత్యేకమన్నారు. తన పాటలు మాత్రమే కాకుండా వేరే వాళ్ళ పాటల్లో యాక్ట్ చేశాను అంటే అది రాహుల్ సిప్లిగంజ్ పాటే అని గుర్తు చేసుకున్నారు. ఇక భవిష్యత్తులో కూడా రాహుల్ సిప్లిగంజ్ తో తప్ప ఏ ఒక్కరితో కొలాబరేట్ అవ్వను అన్నారు. ఈవెంట్ కు వచ్చిన మహబూబా, హారిక కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఇక ఈ పాట అందరికీ నచ్చుతుందని డిసెంబర్ 31, సంక్రాంతి పండుగలకు దుమ్ము రేపుతుందని తెలిపారు.
రాహుల్ సిప్లిగంజ్ మాట్లాడుతూ.. తెలుగోడి బీట్ పాట లో ఫుల్ మాస్ బీట్ ఉందని ప్రేక్షకులు కచ్చితంగా ఈ పాటని ఘనవిజయం చేస్తారని.. ఈ పాట చేసిన నోయల్ కు అభినందనలు తెలిపారు. ఈ పాట ప్రతి ఒక్కరిని షేర్ చేయాలని, ఇలాంటి పాటలు మరెన్నో చేయాలని రాహుల్ సిప్లిగంజ్ పేర్కొన్నారు. అన్ని వేడుకల్లో దుమ్మురేపుతది అన్నారు.
సిద్దు రెడ్డి కందకట్ల మాట్లాడుతూ.. ఈ కార్యక్రమానికి వచ్చినా కళామతల్లి బిడ్డలకు, సరస్వతి పుత్రులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. నిజానికి ఆయనకు ఈ కళారంగానికి పెద్దగా పరిచయం లేదని ఈరోజు ఈ స్టేజి మీద మాట్లాడానికి కారణం మ్యూజిక్ డైరెక్టర్ సింగర్ నోయల్ అనే చెప్పారు. నోయల్ మాట్లాడుతుంటే వారి తల్లి కళ్ళల్లో నీళ్లు వచ్చాయని అవి ఆనందభాష్పాలు అని ఇలాంటి సందర్భం మనకు ఎంతో స్ఫూర్తినిస్తుందని తెలిపారు. తెలుగోడి బీట్ పాటతో నోయల్ కం బ్యాక్ చాలా గట్టిగా ఉంటుందని, పంచ్ ఎంత బలంగా కొట్టామని కాదు ఎంత బలమైన పంచును తీసుకోగలము అనేదే ముఖ్యం అని అప్పుడే మన సత్తా ఏంటో తెలుస్తుందని అన్నారు. నోయల్ కు ఆ సత్తా ఉందని చెప్పారు. ఈ పాట కచ్చితంగా తెలుగు ప్రజలను ఉర్రూతలుగుస్తుందని పేర్కొన్నారు.
హారిక మాట్లాడుతూ.. సాంగ్ ను అందరూ కచ్చితంగా సపోర్ట్ చేయాలని కోరారు. పాట మొదలు పెట్టినప్పటి నుంచి పూర్తి అయినంతవరకు నోయల్ ఎంత కష్టపడ్డారో దగ్గరుండి చూసానని, ఆయన కష్టానికి తగిన ఫలితం ఈ పాటలో ఉందని వెల్లడించారు. ఇక ఏ ఈవెంట్, ఫంక్షన్ జరిగినా కచ్చితంగా ఈ పాట మారుమోగుతుందని తెలిపారు.
మెహబూబా మాట్లాడుతూ.. ఈ సాంగ్ ను ఎన్నోసార్లు విన్నానని, ఎన్నిసార్లు విన్నా అసలు బోర్ రావడంలేదని తెలిపారు. ప్రేక్షకులు కచ్చితంగా ఈ పాటను మిలియన్స్ కు తీసుకెళ్తారని నమ్మకం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తెలుగోడి బీట్ పాట టీంకు శుభాకాంక్షలు తెలిపారు.
భరత్ మాట్లాడుతూ పాట చాలా బాగా వచ్చిందని ఇకపై జరిగే అన్ని ఈవెంట్స్ లలో ఈ పాట మోగుతుందని తెలిపారు. అలాగే నోయల్ నుంచి ఇలాంటి పాటలు సంవత్సరానికి 10, సినిమాలు ఓ పది రావాలని అన్నారు.
v‘మా రాముడు అందరివాడు’ దమ్మున్న సినిమా : హీరో శ్రీరామ్ ‘మా రాముడు అందరివాడు’ చిత్రంలోని ఫాదర్ అండ్ సన్…
ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్” కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal
భారతదేశంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ప్రైమ్ వీడియో నుంచి రానున్న నూతన తెలుగు ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'జగమే…
→ ఈ రూ.50లో GST కూడా కలిపి ఉంటుంది.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.→…
వెర్సటైల్ స్టోరీస్, ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలనే లక్ష్యంతో హీరో…
‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:…