తెలుగు ప్రేక్షకుల ముందుకు హారర్ థ్రిల్లర్ ‘పిజ్జా3’

Must Read

మోస్ట్ పాపులర్, సక్సెస్ ఫుల్ హారర్ థ్రిల్లర్ ఫ్రాంచైజీ ‘పిజ్జా’. ఈ ఫ్రాంచైజీ లో వచ్చిన రెండు చిత్రాలు తెలుగు ప్రేక్షకులని విశేషంగా ఆకట్టుకొని, భారీ విజయాలు సాధించి, ప్రత్యేక ఫ్యాన్ భేస్ ని సంపాదించుకున్నాయి. ఇప్పుడు ‘పిజ్జా3’ తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. కనెక్ట్ మూవీస్ ఎల్ఎల్పీ నిర్మాతలు ‘పిజ్జా3’ రైట్స్ ని సొంతం చేసుకున్నారు.  

ఇటివలే తమిళంలో విడుదలైన ‘పిజ్జా3’ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. అశ్విన్ కాకుమణి, పవిత్ర మరిముత్తు ప్రధాన పాత్రలలో మోహన్ గోవింద్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘పిజ్జా3’ తమిళనాట అన్ని వర్గాల ప్రేక్షకులని ఆకట్టుకొని ఘన విజయం సాధించింది. ఈ చిత్రం తెలుగు రైట్స్ ని సొంతం చేసుకున్న కనెక్ట్ మూవీస్ ఎల్ఎల్పీ త్వరలోనే చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు.

”పిజ్జా3′ విజువల్ వండర్. ప్రేక్షకులకు థ్రిల్ తో పాటు గొప్ప థియేట్రికల్ ఎక్స్ పీరియన్స్ ఇస్తుంది’ అని నిర్మాతలు తెలిపారు.

తారాగణం: అశ్విన్ కాకుమణి,  పవిత్ర మరిముత్తు , గౌరవ్ నారాయణన్ , కాళీ వెంకట్,  అనుపమ కుమార్, సురుతి పెరియసామి,  రవీనా దాహా ABI నక్షత్ర,  కవితా భారతి
టెక్నికల్ టీమ్ :
దర్శకత్వం : మోహన్ గోవింద్
ప్రొడక్షన్ హౌస్ : కనెక్ట్ మూవీస్ LLP
నిర్మాత: M.S.మురళీధర్ రెడ్డి, ఆశిష్ వేమిశెట్టి
సంగీతం: అరుణ్ రాజ్
సినిమాటోగ్రఫీ: ప్రభు రాఘవ
పీఆర్వో : వంశీ శేఖర్

Latest News

వి.వి.వినాయక్ చేతుల మీదుగా “బరాబర్ ప్రేమిస్తా” మూవీ టీజర్ రిలీజ్

ఆటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ నటిస్తున్న కొత్త సినిమా "బరాబర్ ప్రేమిస్తా ". ఈ చిత్రానికి సంపత్ రుద్ర దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను కాకర్ల సత్యనారాయణ...

More News