లాంఛ‌నంగా ప్రారంభ‌మైన గౌత‌మ్స్ ఈగ‌ల్ ఎంట‌ర్‌టైన్మెంట్ ప్రై.లి బ్యాన‌ర్ ప్రొడ‌క్ష‌న్ నెం.1 మూవీ  

Must Read

* చైత‌న్య రావ్‌, హృతికా శ్రీనివాస్ హీరో హీరోయిన్లు

చైత‌న్య రావ్‌, హృతికా శ్రీనివాస్ హీరో హీరోయిన్లుగా గౌత‌మ్స్ ఈగ‌ల్ ఎంట‌ర్‌టైన్మెంట్ ప్రై.లి బ్యాన‌ర్‌పై సాయి తేజ ద‌ర్శ‌క‌త్వంలో ఎం.గౌతమ్ నిర్మాత‌గా రూపొందుతోన్న చిత్రం ఆదివారం ఉద‌యం లాంఛ‌నంగా హైద‌రాబాద్‌లో ప్రారంభ‌మైంది. ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్ క్లాప్ కొట్టగా ఎఫ్‌డీసీ చైర్మ‌న్ అనీల్ కురుమాంచ‌లం కెమెరా స్విచ్ ఆన్ చేశారు. బెక్కం వేణు గోపాల్ గౌర‌వ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. నిర్మాత ఎం.గౌత‌మ్‌, సి.క‌ళ్యాణ్ చేతుల మీదుగా డైరెక్ట‌ర్ స్క్రిప్ట్‌ను అందుకున్నారు. నిర్మాత రాచాల యుగంధ‌ర్ ప్ర‌త్యేక అతిథిగా హాజ‌ర‌య్యారు. అలాగే  ప‌లువురు సినీ సెల‌బ్రిటీలు ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా…

చిత్ర నిర్మాత ఎం.గౌతమ్ మాట్లాడుతూ ‘‘మా గౌత‌మ్స్ ఈగ‌ల్ ఎంట‌ర్‌టైన్మెంట్ ప్రై.లి బ్యాన‌ర్‌లో మేం చేస్తున్న తొలి సినిమా ఇది. చైత‌న్య రావ్‌, హృతికా శ్రీనివాస్ హీరో హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. డైరెక్ట‌ర్ సాయితేజ ఓ డిఫ‌రెంట్ పాయింట్‌తో స్క్రిప్ట్‌ను సిద్ధం చేశారు. కొత్త‌గా పెళ్లైన జంట‌లో భ‌ర్త కొన్ని అనుకోని ప‌రిస్థితులు ఎదుర్కోవాల్సి వ‌స్తుంది. దాన్ని తనెలా హ్యాండిల్ చేశాడ‌నే క‌థాంశంతో సినిమా రూపొంద‌నుంది. మంచి కామెడీ, ల‌వ్‌, ఎమోష‌న్స్‌తో  ఫ్యామిలీ ఆడియెన్స్‌, యూత్‌ను ఆక‌ట్టుకునే అంశాల మేళ‌వింపుంగా సినిమా ఆక‌ట్టుకోనుంది. సినిమాకు సంబంధించిన వివ‌రాల‌ను త్వ‌ర‌లోనే తెలియజేస్తాం’’ అన్నారు. 

న‌టీన‌టులు:

చైత‌న్య రావ్‌, హృతికా శ్రీనివాస్‌, కృష్ణ చైత‌న్య‌, సాయి శ్రీనివాస్‌, సుద‌ర్శ‌న్‌, మ‌హేష్ అచంట‌, మ‌హేష్ విట్టా, రాజేష్ ఉల్లి, షిన్నింగ్ ఫ‌ణి త‌దిత‌రులు

సాంకేతిక వ‌ర్గం:

బ్యాన‌ర్:  గౌత‌మ్స్ ఈగ‌ల్ ఎంట‌ర్‌టైన్మెంట్ ప్రై.లి

నిర్మాత:  ఎం.గౌతమ్

రైట‌ర్‌, డైరెక్ట‌ర్‌:  సాయితేజ‌

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌:  మోహ‌న్ పున్న

లైన్ ప్రొడ్యూస‌ర్‌:  వంశీ కృష్ణ‌

సినిమాటోగ్ర‌ఫీ:  పి.సి.మౌళి

ఎడిట‌ర్‌:  విజ‌య్ ముక్తావ‌ర‌పు

మ్యూజిక్‌:  గ్యాని

ఆర్ట్‌:  రామాంజ‌నేయులు

ప్రొడ‌క్ష‌న్ కంట్రోల‌ర్‌:  కాస కిర‌ణ్ కుమార్‌

కొరియోగ్రాఫ‌ర్‌:  జెడి మాస్ట‌ర్‌

కాస్ట్యూమ్స్‌: ప‌్ర‌దీప్తి భూమ

పి.ఆర్‌.ఒ: వ‌ంశీ కాకా,  దుద్ది శ్రీను

Latest News

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

More News