కింగ్ నాగార్జున చేతుల మీదుగా విడుదలైన ‘పాప్ కార్న్’ ట్రైలర్..

ముఖ ప‌రిచ‌యం లేని అబ్బాయి, అమ్మాయి ఓ షాపింగ్ మాల్‌లోకి ఎంట‌ర్ అవుతారు. అక్క‌డ షాపింగ్ పూర్తి చేసుకుంటారు. లిఫ్ట్ ఎక్కుతారు. ఎక్క‌గానే ఆ అమ్మాయి తాను లిఫ్ట్ నుంచి బ‌య‌ట‌కు వెళ్లిపోవాల‌నుకుంటుంది. ఆ అబ్బాయి త‌న‌ని లాగి పెట్టి ఒక‌టి కొడ‌తాడు.అడిగితే ప్రాంక్ చేశానంటాడు . అలాంటి ఈజీ గోయింగ్ మైండ్ సెట్ ఉన్న అబ్బాయి.. త‌నొక‌ మ్యూజిషియ‌న్‌.. ఇక అమ్మాయి విష‌యానికి వ‌స్తే త‌నొక పెద్ద అంద‌గ‌త్తెన‌నే అనే కాన్ఫిడెన్స్‌తో ఉంటుంది. ఇలాంటి భిన్న‌మైన మ‌న‌స్త‌త్వాలున్న వీరిద్ద‌రు అనుకోకుండా… షాపింగ్ మాల్‌లోని లిఫ్ట్‌లో ఇరుక్కుంటారు. ఆ త‌ర్వాత ఏం జ‌రిగింద‌నేది తెలియాలంటే ‘పాప్ కార్న్’ సినిమా చూడాల్సిందేన‌ని అంటున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు.

అవికా గోర్‌, సాయి రోన‌క్ జంట‌గా న‌టిస్తోన్న చిత్రం ‘పాప్ కార్న్’. ఎం.ఎస్‌.చ‌ల‌ప‌తి రాజు స‌మ‌ర్ప‌ణ‌లో ఆచార్య క్రియేష‌న్స్, అవికా స్క్రీన్ క్రియేష‌న్స్ బ్యాన‌ర్స్‌పై బోగేంద్ర గుప్తా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ముర‌ళి గంధం ద‌ర్శ‌కత్వం వ‌హిస్తున్నారు. బుధ‌వారం ఈ మూవీ ట్రైల‌ర్‌ను కింగ్ నాగార్జున విడుద‌ల చేశారు. సినిమా పెద్ద హిట్ కావాల‌ని యూనిట్‌కి అభినంద‌న‌లు తెలియ‌జేశారు.

డిఫ‌రెంట్ మైండ్స్ సెట్స్ ఉన్న ఇద్ద‌రు వ్య‌క్తుల అనుకోకుండా లిఫ్ట్‌లో చిక్కుకుంటారు. వారిని ఎవ‌రూ ప‌ట్టించుకోరు. ముందు ఒక‌రంటే ఒక‌రికి ప‌డ‌కుండా ఉన్న వాళ్లిద్ద‌రూ స‌మ‌యం గ‌డిచేకొద్ది స్నేహితులుగా మారుతారు. ఒక‌రిపై మ‌రొక‌రికి అభిమానం క‌లుగుతుంది. ఈ జ‌ర్నీలో వారిద్దరి మధ్య క్రియేట్ అయిన ఎమోషనల్ బాండింగ్ గురించి తెలియజేసే సినిమాయే ‘పాప్ కార్న్’ అని ట్రైల‌ర్ చూస్తుంటే అర్థ‌మ‌వుతుంది.

రొటీన్‌కు భిన్నంగా ద‌ర్శ‌కుడు మురళి గంధం పాప్ కార్న్ మూవీని తెర‌కెక్కిచిన‌ట్లు ట్రైల‌ర్ చూస్తుంటే అర్థ‌మ‌వుతుంది. చేతిలో ఉంటే పాప్ కార్న్ బ‌కెట్‌.. తింటుంటే కాస్త కారంగా.. ఉప్పగా.. స్వీట్‌గా ఉంటూ మ‌న డిఫ‌రెంట్ ఫీలింగ్‌ను క‌లిగిస్తుంది. అలాంటి డిఫ‌రెంట్ ఎమోష‌న్స్ కాంబినేష‌న్‌తో రూపొందిన పాప్ కార్న్ మూవీ త్వ‌ర‌లోనే ప్రేక్ష‌కుల ముందుకు రానుంద‌ని ద‌ర్శ‌క నిర్మాత‌లు తెలియ‌జేశారు.

న‌టీన‌టులు:

అవికా గోర్‌, సాయి రోన‌క్ త‌దిత‌రులు

సాంకేతిక వ‌ర్గం:

స‌మ‌ర్ప‌ణ‌: ఎం.ఎస్‌.చ‌ల‌ప‌తి రాజు, బ్యాన‌ర్స్‌: ఆచార్య క్రియేష‌న్స్, అవికా స్క్రీన్ క్రియేష‌న్స్ ,నిర్మాత‌: బోగేంద్ర గుప్తా, కాన్సెప్ట్ – స్టోరి – డైలాగ్స్ – స్క్రీన్ ప్లే – ద‌ర్శ‌క‌త్వం: ముర‌ళి గంధం, కో ప్రొడ్యూస‌ర్స్‌: అవికా గోర్‌, ఎం.ఎస్‌.చ‌ల‌ప‌తి రాజు, శేషు బాబు పెద్దింటి, సినిమాటోగ్ర‌ఫీ: ఎం.ఎన్‌.బాల్ రెడ్డి, మ్యూజిక్: శ్ర‌వ‌ణ్ భ‌ర‌ద్వాజ్‌, ఎడిట‌ర్‌: కె.ఎస్‌.ఆర్‌, ఆర్ట్ డైరెక్ట‌ర్‌: భాస్క‌ర్ ముదావ‌త్‌, కొరియోగ్ర‌ఫీ: అజ‌య్ సాయి, ఫ్యాష‌న్ డిజైన‌ర్‌: మ‌నోహ‌ర్ పంజా, పి.ఆర్.ఓ: నాయుడు సురేంద్ర‌, ఫణి (బియాండ్ మీడియా), పోస్ట‌ర్స్‌, లిరిక‌ల్స్‌: నియో స్టూడియోస్‌, మార్కెటింగ్‌: టికెట్ ఫ్యాక్ట‌రీ, మ్యూజిక్‌, ఆదిత్య మ్యూజిక్‌.

TFJA

Recent Posts

‘దండోరా’ ట్రైలర్ రిలీజ్ ,క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25న సినిమా విడుదల

ల‌వ్‌, ఎమోష‌న్, డ్రామా వంటి క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్‌తోపాటు చ‌క్క‌టి సోష‌ల్ మెసేజ్‌తో రూపొందిన చిత్రం ‘దండోరా’ ట్రైలర్ రిలీజ్ క్రిస్మస్…

1 week ago

అవినాష్ తిరువీధుల “వానర” సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ‘అదరహో..’ రిలీజ్, ఈ నెల 26న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మూవీ

అవినాష్ తిరువీధుల హీరోగా, దర్శకుడిగా పరిచయమవుతున్న సినిమా "వానర". ఈ చిత్రంలో సిమ్రాన్ చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది. నందు…

2 weeks ago

‘దండోరా’ చిత్రం అద్భుతంగా ఉంటుంది.. మంచి అనుభూతితో థియేటర్ నుంచి బయటకు వస్తారు – దర్శకుడు మురళీకాంత్

వైవిధ్యమైన చిత్రం కలర్ ఫొటో, బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ ‘బెదురులంక 2012’ చిత్రాల‌ను నిర్మించి అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిన‌ లౌక్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్…

2 weeks ago

డిసెంబర్ 19న రాబోతోన్న ‘జిన్’ మూవీ పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను.. ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌లో ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి

సాదలమ్మ ఫిల్మ్ ప్రొడక్షన్స్, బిల్వ స్టూడియోస్ బ్యానర్‌ల మీద నిఖిల్ ఎం. గౌడ నిర్మించిన చిత్రం ‘జిన్’. ఈ మూవీకి…

2 weeks ago

‘ఎర్రచీర’పక్కాగా ఫిబ్రవరి 6న విడుదల

బేబి డమరి సమర్పణలో శ్రీ పద్మాయల ఎంటర్టైన్మెంట్స్ - శ్రీ సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం "ఎర్రచీర".…

2 weeks ago

ఫిబ్రవరి 13న ‘ఫంకీ’.. వాలెంటైన్స్ వీకెండ్‌కు ఫుల్ ఫన్ గ్యారంటీ!

వైవిధ్యమైన చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న కథానాయకుడు విశ్వక్ సేన్, హాస్య చిత్రాలకు చిరునామాగా మారిన దర్శకుడు కె.వి.…

2 weeks ago