ఏ జర్నీ టు కాశీ జనవరి 6న విడుదల

నేటి కాలంలో మన సనాతన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి – ఏ జర్నీ టు కాశీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో దర్శకుడు శేఖర్ సూరి 

వారణాసి క్రియేషన్స్ పతాకం పై చైతన్య రావు, అలెగ్జాండర్ సాల్నికోవ్ , ప్రియా పాల్వాయి, కేటలిన్ గౌడ ముఖ్య తారాగణం తో ముని కృష్ణ దర్శకత్వం లో కె పి లోకనాథ్, దొరడ్ల బాలాజీ మరియు శ్రీధర్ వారణాసి సంయుక్తంగా నిర్మించిన చిత్రం “ఏ జర్నీ టు కాశీ”. ఈ చిత్రం జనవరి 6 న విడుదల అవుతున్న సందర్భంగా చిత్ర యూనిట్ సభ్యులు ప్రీ రిలీజ్ ఈవెంట్ ను జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి చిత్ర యూనిట్ సభ్యులతో పటు ప్రముఖ దర్శకుడు శేఖర్ సూరి ముఖ్య అతిధిగా విచ్చేసారు.

అనంతరం శేఖర్ సూరి మాట్లాడుతూ “ఈ చిత్రానికి పని చేసిన ఎడిటర్ తిరుపతి రెడ్డి, నా చిత్రాలకి పని చేసాడు. “ఏ జర్నీ టు కాశీ” అనే టైటిల్ చాలా బాగుంది. కాశీ తో నాకు మంచి అనుబంధం ఉంది. 2014 లో షూటింగ్ కోసం నేను కాశీ లో 60 రోజులు ఉన్నాను. ట్రైలర్ చూసాను, చాలా బాగుంది, దర్శకుడి ఉద్దేశం అద్భుతంగా ఉంది అనిపించింది. నేటి కాలంలో మన సనాతన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి. శుద్ధోసి బుద్ధోసి పాట చాలా అద్భుతంగా ఉంది. ఇలాంటి మంచి  కథ తీసిన దర్శకుడు మరియు నిర్మాతలకి నా కృతఙ్ఞతలు. ప్రేక్షకులు ఇలాంటి సినిమాలు చూడాలి. జనవరి  6న విడుదల అవుతుంది. అందరు తప్పకుండా చుడండి” అని తెలిపారు.

దొరడ్ల బాలాజీ గారు మాట్లాడుతూ “మా చిత్రం జనవరి 6 న విడుదల అవుతుంది. మంచి చిత్రం తో మీ ముందుకు వస్తున్నాం. అందరు చుడండి మరియు మా చిత్రాన్ని హిట్ చేయండి” అని కోరుకున్నారు.

శుద్ధోసి బుద్ధోసి పాట పడిన సింగర్ గోమతి అయ్యర్ మాట్లాడుతూ “శుద్ధోసి బుద్ధోసి పాట పాడటానికి నాకు అవకాశం ఇచ్చిన సంగీత దర్శకుడు ఫణి కళ్యాణ్ గారికి మరియు చిత్ర యూనిట్ సభ్యులకి నా కృతఙ్ఞతలు. ఈ చిత్రం మంచి హిట్ అవాలి” అని కోరుకున్నారు.

సంగీత దర్శకుడు ఫణి కళ్యాణ్ మాట్లాడుతూ “ఈ చిత్రంలో ఒక తెలుగు పాట, ఒక సంస్కృత పాట మరియు ఒక ఇంగ్లీష్ పాట చేశాను. ఇలాంటి మంచి చిత్రంలో పని చేయటానికి గొప్పగా ఫీల్ అవుతున్న. చైతన్య సినిమా లో చాలా బాగా చేసాడు. ఈ చిత్రం అందరికి నచ్చుతుంది” అని తెలిపారు.

హీరోయిన్ కేటలిన్ గౌడ మాట్లాడుతూ “ఇది ఒక ఫీల్ గుడ్ సినిమా. చాలా మంచి సినిమా, ఫామిలీ అందరు కలిసి చూసే సినిమా. దర్శకుడు ముని కృష్ణ గారు చాలా బాగా చేసారు. జనవరి 6 న విడుదల అవుతుంది. అందరు చూసి ఆదరిస్తారు అని కోరుకున్నారు.

దర్శకుడు ముని కృష్ణ మాట్లాడుతూ “ఏ జర్నీ టు కాశీ” చిత్రం కాశీ యాత్ర కు సంభందించిన కథ. కాశీ బ్యాక్ డ్రాప్ లో ఒక కుటుంభం కథ ఇది. మేము ఈ చిత్రాన్ని చాలా ఎంటర్టైన్మెంట్ గా ఉంది. ఎమోషనల్ ఫామిలీ డ్రామా కథ గా ఉంటుంది. జనవరి 6 న తెలంగాణ ఆంధ్ర లో మంచి మంచి థియేటర్స్ లో విడుదల అవుతుంది. అందరు చూసి ఆదరిస్తారు అని కోరుకున్నారు.

బ్యానర్ : వారణాసి క్రియేషన్స్

చిత్రం పేరు : ఏ జర్నీ టు కాశీ

నటి నటులు : చైతన్య రావు, అలెగ్జాండర్ సాల్నికోవ్ , ప్రియా పాల్వాయి, ఖ్యాతిలీన్  గౌడ, అక్షర మరియు తదితరులు

కెమెరా మాన్ : గోకుల్ భారతి మరియు శ్రీ సాయి

ఆర్ట్ డైరెక్టర్ : నాగేంద్ర గువ్వల  

సంగీతం : ఫణి కళ్యాణ్

కోరియోగ్రఫీ : అజయ్ శివ శంకర్

ఫైట్స్ : శంకర్

ఎడిటర్ : తిరుపతి రెడ్డి

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : తిరుపతి రెడ్డి

సౌండ్ డిజైన్  : సైoదబ్  ముఖర్జీ

సౌండ్ మిక్సింగ్ : శైమల్ సిక్డర్

లిరిక్స్ : చిర్రావూరి విజయ్ కుమార్

డైలాగ్స్ : పళ్ళ మోహన్

ప్రొడక్షన్ మేనేజర్ : కె ఆనంద్ కుమార్
పి ఆర్ ఓ : పాల్ పవన్

ప్రొడ్యూసర్స్ : దొరడ్ల బాలాజీ, శ్రీధర్ వారణాసి, కె పి లోకనాథ్

సమర్పణ : కె పి లోకనాథ

కథ దర్శకత్వం : ముని కృష్ణ

TFJA

Recent Posts

”తత్వం” సాధించే విజయంతో మా కష్టాలన్నీ మరిచిపోతాం: యువ దర్శకుడు అర్జున్‌ కోలా

అర్జున్‌ కోలా దర్శకత్వంలో దినేష్‌ తేజ్‌, దష్విక.కె హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'తత్వం' త్రయతి ఇషాని క్రియేషన్స్‌, ఎస్‌.కె.ప్రొడక్షన్స్‌…

12 hours ago

తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి

స్నేహా రెడ్డి అంటే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది స్టార్ హీరో అల్లు అర్జున్ భార్యగానే. అయితే ఆమె తనకంటూ…

12 hours ago

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ చిత్రం గొప్ప విజ‌యాన్ని సాధించాల‌ని కోరుకుంటున్నా: ప‌్రీ రిలీజ్ ఈవెంట్‌లో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ను అంద‌రూ థియేట‌ర్స్‌లో ఎంజాయ్ చేస్తారు.. సినిమా పెద్ద హిట్ అవుతుంది: ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి…

13 hours ago

చదలవాడ శ్రీనివాసరావుకు శుభాకాంక్షలు తెలిపిన ఫిలింక్రిటిక్స్ అసోసియేష్‌న్‌

ఇటీవల జరిగిన నిర్మాతల మండలి ఎన్నికల్లో కోశాధికారిగా ఘనవిజయం సాధించినశ్రీ చదలవాడ శ్రీనివాసరావును ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ సీనియర్ సభ్యులు, కార్యవర్గం…

3 weeks ago

‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ ఆనంద్ దేవరకొండ ఫిల్మోగ్రఫీలో ఒక బ్యూటిఫుల్ సినిమాగా నిలుస్తుంది: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ

ఆదిత్య హాసన్ రచన చాలా బాగుంది.. ‘ఎపిక్’ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను: ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా…

3 weeks ago

ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ ద్వారాసెప్టెంబర్ 18న‘పిఠాపురంలో… అలా మొదలైంది’ విడుదల—ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో…

ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం సెప్టెంబర్ 18న…

3 weeks ago