“పోలీస్ వారి హెచ్చరిక” తొలి టికెట్ లాంచ్ – ఈ నెల 18న సినిమా విడుదల

Must Read

తూలికా తనిష్క్ క్రియేషన్స్ బ్యానర్ పై అభ్యుదయ దర్శకుడు బాబ్జీ దర్శకత్వంలో బెల్లి జనార్థన్ నిర్మాతగా ఈ నెల 18న ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం “పోలీస్ వారి హెచ్చరిక”. ఈ చిత్రానికి కిషన్ సాగర్, నళినీ కాంత్ సినిమాటోగ్రాఫర్స్ గా పనిచేయగా గజ్వేల్ వేణు ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు. శివ శర్వాణి ఈ చిత్రానికి ఎడిటింగ్ వర్క్ చేశారు. నేడు ఈ చిత్ర తొలి టికెట్ లాంచ్ చేసిన సందర్భంగా మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.

ఈ సందర్భంగా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరు అయిన మట్టి కవి బెల్లి యాదయ్య మాట్లాడుతూ… “పోలీసువారి హెచ్చరిక చిత్ర టిక్కెట్ లాంచ్ ఈవెంట్ కు వచ్చిన అందరికీ నమస్కారం. మా తమ్ముడు బెల్లి జనార్ధన్ నిర్మాతగా బాబ్జి దర్శకత్వంలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో ఎందరో సీనియర్ నటీనటులు నటించడం చాలా గొప్ప విషయం. ఈ సినిమా కోసం పనిచేసిన చిత్ర బృందం అందరికీ ఆల్ ద బెస్ట్. నేను ఎన్నో సంవత్సరాల క్రితం నాటక రంగంలో నటించడం జరిగింది. ఇన్ని సంవత్సరాల తర్వాత ఈ సినిమా కోసం ఇప్పుడు కెమెరాల ముందుకు వచ్చి మాట్లాడుతున్నాను. ఈ సినిమా మా ప్రాంతంలో కొన్ని నిజమైన లొకేషన్స్ లో షూటింగ్ చేయడం జరిగింది. ఈ సినిమాలో మంచి కంటెంట్ ఉంది. ఈ సినిమా కోసం పనిచేసిన వారి అందరికీ మంచి పేరును తీసుకొస్తుంది. అలాగే సమాజానికి మంచి సందేశాన్ని ఇస్తుంది” అన్నారు.

నటుడు సన్నీ అఖిల్ మాట్లాడుతూ… “నాకు చిన్నప్పటి నుండి సినిమాలపైన ఉన్న ఆసక్తితో ఈ సినిమాలో మంచి పాత్రను పోషించాను. చిన్న వయసులోనే సినిమాను దగ్గర నుండి చూస్తూ ప్రతి విషయంలో దగ్గర ఉంది చూసుకోవడం వల్ల ఎంతో జ్ఞానం లభించింది. దానిని నేను అదృష్టంగా భావిస్తున్నాను. మా సినిమాకు సపోర్టుగా నిలిచిన మీడియా వారికి ధన్యవాదాలు” అన్నారు.

నటి జయ వాహిని మాట్లాడుతూ… “అందరికీ నమస్కారం. నేను సాధారణంగా నాటికల ద్వారా ప్రేక్షకులకు పరిచయం. ఎక్కువగా నెగటివ్ రోల్స్ లో నటించడం జరిగింది. ప్రస్తుతం కొన్ని సినిమాలలో నటిస్తున్నాను. ఈ సినిమాలో నా పాత్ర ఇప్పటి వరకు ప్రేక్షకులు నన్ను చూసిన పాత్రలతో పోలిస్తే కొంచెం భిన్నంగా ఉంటుంది. నిర్మాత జనార్థన్ గారు మాకు మంచి సపోర్ట్ ఇచ్చారు. అందరూ సినిమాను ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను” అన్నారు.

నిర్మాత బెల్లి జనార్ధన మాట్లాడుతూ… “మా సినిమా టికెట్ లాంచ్ కార్యక్రమానికి హాజరైన అందరికీ నమస్కారం. నేను ఆర్మీలో పని చేసి వచ్చాను. ఒక సినిమాను తెరపై చూపించేందుకు ముందుగా దర్శకులు ఎంతో కష్టపడతారు. అలాగే చిత్రానికి పనిచేసే ప్రతి ఒక్కరు కూడా మానవ శరీరంలో అవయవాలు లాగా ఎంతో కీలక పాత్రను పోషిస్తూ సినిమాకు ప్రాణం పోస్తారు. సినిమా గమ్యానికి చేరుకోవాలంటే దానికి కారణం మీడియావారు. నేను, నా భార్య నిర్మాతలుగా సినిమాకు సపోర్ట్ చేస్తూ వచ్చాము. మంచి కంటెంట్ ఉన్న ఈ సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తారని కోరుకుంటున్నాను” అన్నారు.

దర్శకుడు బాబ్జి మాట్లాడుతూ… “మా చిత్ర ప్రెస్ మీట్ కార్యక్రమానికి వచ్చిన మీడియా వారికి, మట్టి కవి యాదయ్య గారికి మా చిత్ర బృందం తరఫున ధన్యవాదాలు. అలాగే ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించిన జనార్ధన్ గారికి, సినిమాలో నటించిన నటీనటులకు, సాంకేతిక బృందానికి పేరుపేరునా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నేను గతంలో కూడా జర్నలిస్టుల కోసం ఒక పాటను రాయడం జరిగింది. దయచేసి మీరంతా ఈ సినిమాకు సపోర్ట్ చేసి సినిమాను ప్రేక్షకులలోకి తీసుకువెళ్లాల్సిందిగా కోరుకుంటున్నాను. పోలీస్ వారి హెచ్చరిక మనకు సాధారణంగా బయట కనిపించే సినిమాలు కాకుండా ఈ సినిమా కాస్త భిన్నంగా ఉండబోతుంది. ఈ సినిమాలో నెగటివ్ క్యారెక్టర్ల మధ్య మంచి సన్నివేశాలు ఉండబోతున్నాయి. వారి మధ్య ప్రేమ, పాటలు ఉండబోతున్నాయి. మా చిత్ర టైటిల్ ఇప్పటికే ప్రేక్షకులలోకి బాగా వెళ్ళింది. దానికి పోలీస్ వారికి మేము ధన్యవాదాలు తెలుపుకోవాలి. ఒక మంచి సందేశాన్ని ఈ చిత్రం ద్వారా ప్రేక్షకులకు తెలుపబోతున్నాము. ఈ సినిమా చూసిన ప్రేక్షకులు సమాజం మీద ఒక ప్రేమతో, బాధ్యతతో థియేటర్ నుండి బయటకు వెళ్తారు. మా సినిమాను అందరూ సపోర్ట్ చేయండి” అంటూ ముగించారు.

తారాగణం :
సన్నీ అఖిల్, అజయ్ ఘోష్, రవి కాలే, షాయాజీ షిండే, శుభలేఖ సుధాకర్, కాశీ విశ్వనాథ్, జబర్దస్త్ వినోద్, జబర్దస్త్ పవన్, జబర్దస్త్ శాంతి స్వరూప్, హిమజ, శంకరాభరణం తులసి, జయ వాహిని, మేఘనా ఖుషి, బెల్లి జనార్థన్ తదితరులు.

సాంకేతిక నిపుణులు :

దర్శకుడు : బాబ్జీ
నిర్మాత : బెల్లి జనార్థన్
బ్యానర్ : తూలికా తనిష్క్ క్రియేషన్స్
సంగీతం : గజ్వేల్ వేణు
కెమెరా : కిషన్ సాగర్, నళినీ కాంత్
ఎడిటర్ : శివ శర్వాణి
సహ నిర్మాత : NP సుబ్బా రాయుడు
పిఆర్ఓ : మధు విఆర్
డిజిటల్ మార్కెటింగ్ : డిజిటల్ దుకాణం

Latest News

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

More News