అగ్రహారంలో అంబేద్కర్అసాధారణ విజయం సాధించాలి!!

Must Read

మన భారత రాజ్యాంగ రూపశిల్పి బాబా సాహెబ్ అంబేద్కర్ సిద్ధాంతాల స్పూర్తితో రూపొందిన చిత్రం “అగ్రహారంలో అంబేద్కర్”. “దళిత సంచలనం” పద్మశ్రీ మందా కృష్ణ మాదిగ ఈ చిత్రం టైటిల్ సాంగ్ రిలీజ్ చేశారు. కృష్ణచైతన్య ఎన్నో కష్టాలు పడి తెరకెక్కించిన ఈ చిత్రం అసాధారణ విజయం సాధించాలని ఆయన ఆకాంక్షించారు. అంబేద్కర్ అభిమానులైన ప్రతి ఒక్కరూ “అగ్రహారంలో అంబేద్కర్” చిత్రం చూసి తీరాలని పిలుపునిచ్చారు!!

ఇప్పటికే పలు ప్రతిష్టాత్మక అంతర్జాతీయ చలనచిత్రోత్సవాలలో పురస్కారాలు అందుకున్న ఈ చిత్రాన్ని రామోజీ – లక్షమోజి ఫిల్మ్స్ పతాకంపై మంతా కృష్ణచైతన్య స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. హీరో కూడా ఆయనే కావడం విశేషం. ఆయన మాట్లాడుతూ…”అంబేద్కర్ భావజాలాన్ని విశ్వవ్యాప్తం చేయడమే లక్ష్యంగా తెరకెక్కిన ఈ చిత్రం టైటిల్ సాంగ్ రిలీజ్ చేసిన మందా కృష్ణగారికి బిగ్ బిగ్ థాంక్స్. ఈ చిత్రాన్ని సినిటేరియా మీడియా వర్క్స్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం, కుల మత ప్రాంత వర్గ వైషమ్యాలకు అతీతంగా సమ సమాజ స్థాపన కోసం కృషి చేసిన అంబేద్కర్ కు గొప్ప నివాళిగగా.. ఎన్నో వ్యయప్రయాసలకు లోనై తెరకెక్కించిన ఈ చిత్రాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తారని ఆశిస్తున్నాం” అన్నారు!!

Latest News

ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా కార్మిక లోకానికి సెల్యూట్ చేస్తూ హీరో తిరువీర్ “భగవంతుడు” మూవీ నుంచి ‘శరణమన్న శరణం’ సాంగ్ రిలీజ్

యంగ్ టాలెంటెడ్ హీరో తిరువీర్ నటిస్తున్న కొత్త సినిమా "భగవంతుడు". ఈ సినిమాలో ఫరియా అబ్దుల్లా హీరోయిన్‌గా నటిస్తోంది. కన్నడ నటుడు రిషి ప్రధాన పాత్రలో...

More News