పేక మేడలు మూవీ ట్రైలర్ లాంచ్ – జూలై 19న సినిమా విడుదల

కేక మేడలు సినిమాతో తొలిసారిగా తెలుగులో హీరోగా పరిచయమవుతున్న వినోద్ కిషన్ (Vinodh Kishan). గతంలో ‘నా పేరు శివ’, ‘అంధగారం’, ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ సినిమాల్లో నటించారు. అనూష కృష్ణ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఎవరికి చెప్పొద్దు సినిమాతో క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్ సంస్థను స్థాపించి విజయాన్ని అందుకొని ఇప్పుడు పేక మేడలు సినిమాతో ప్రేక్షకులు ముందుకు వస్తున్నారు. గతంలో ఈ సినిమాకు సంబంధించిన టీజర్, ఫస్ట్ సాంగ్, సెకండ్ సాంగ్ కు అనూహ్య స్పందన లభించింది. రీసెంట్ గా హీరో వినోద్ కిషన్ చేసిన వినూత్న ప్రమోషనల్ వీడియో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈరోజు ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. వినూత్న రీతిలో ప్రమోషన్స్ చేస్తూ సినిమా పైన అంచనాలను పెంచేస్తున్నారు. ఈ నెల 19న పేక మెడలు సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

ఈ సందర్భంగా డైరెక్టర్ నీలగిరి మామిళ్ల మాట్లాడుతూ : మీడియా ప్రముఖుల ద్వారా ఈ సినిమా ట్రైలర్ లాంచ్ అవడం చాలా ఆనందంగా ఉంది. ప్రతి ఒక్కరి జీవితంలో జరిగే సంఘటనలకి దగ్గరగా ఈ సినిమాను చూపిస్తున్నాం. ఫ్యామిలీలో ఉండే ఎమోషన్స్ తో పాటు ఎంటర్టైన్మెంట్ ని కూడా ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారు. ఈ నెల 19న ఈ సినిమా రిలీజ్ చేస్తున్నాం. మీడియా మరియు ప్రేక్షకుల సపోర్ట్ మా సినిమా పై ఉండాలని సినిమా మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను అన్నారు.

నిర్మాత రాకేష్ వర్రే మాట్లాడుతూ : నా సినిమా ప్రమోషన్స్ స్టార్ట్ చేసినప్పటి నుంచి సపోర్ట్ ఇస్తున్న మీడియా వారికి కృతజ్ఞతలు. వినూత్న రీతిలో క్యూఆర్ స్కాన్ తో ప్రమోషన్ స్టార్ట్ చేసాం అది పెద్ద సక్సెస్ అయింది. ఇంకా సినిమా రిలీజ్ వరకు ఇలా వినూత్నంగా ప్రమోషన్స్ చేస్తూనే ఉంటాం. ఇది ఒక కామెడీ సినిమా మాత్రమే కాదు ఇందులో ఆడవారు మగవారికి ఇస్తున్న సపోర్ట్ గురించి ఒక కోర్ పాయింట్ తో మంచి కాన్సెప్ట్ సినిమాని తీసాం. ఎంటర్టైన్మెంట్ తో పాటు ఎమోషనల్ గా కూడా ఉంటుంది. ఈ 19 సినిమా విడుదల చేస్తున్నాం. కచ్చితంగా ఈ సినిమా అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను అన్నారు.

హీరోయిన్ అనుష కృష్ణ మాట్లాడుతూ : మల్లి సపోర్ట్ చేయడానికి వచ్చిన మీడియా వారికి కృతజ్ఞతలు. మీ చేతుల మీదుగా ఈ ట్రైలర్ లాంచ్ అవడం చాలా ఆనందంగా ఉంది. ప్రేక్షకులు మా సినిమాని ఆదరించి మంచి సక్సెస్ చేస్తారని ఆశిస్తున్నాను అన్నారు.

హీరో వినోద్ కిషన్ మాట్లాడుతూ : తెలుగులో హీరోగా ఇది నా మొదటి సినిమా. నన్ను సెలెక్ట్ చేసుకున్న నా డైరెక్టర్ నీలగిరి గారికి ప్రొడ్యూసర్ రాకేష్ వర్రే గారికి కృతజ్ఞతలు. ప్రమోషన్ స్టార్ట్ చేసినప్పటి నుంచి మీడియా ఇస్తున్న సపోర్ట్ కి చాలా థ్యాంక్స్. ఇదేవిధంగా సినిమా కూడా చూసి సపోర్ట్ చేయాలని మంచి సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను అన్నారు.

నటీనటులు :
వినోద్ కిషన్, అనూష కృష్ణ, రితిక శ్రీనివాస్, జగన్ యోగి రాజ్, అనూష నూతల, గణేష్ తిప్పరాజు, నరేన్ యాదవ్

టెక్నీషియన్స్ :
నిర్మాణం : క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్
నిర్మాత: రాకేష్ వర్రే
రచయిత మరియు దర్శకుడు: నీలగిరి మామిళ్ల
డి ఓ పి: హరిచరణ్ కె.
ఎడిటర్: సృజన అడుసుమిల్లి, హంజా అలీ
సంగీత దర్శకుడు: స్మరణ్ సాయి
లైన్ ప్రొడ్యూసర్: అనూషా బోరా
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కేతన్ కుమార్
పి ఆర్ ఓ: మధు VR

Tfja Team

Recent Posts

ఫ్యామిలీ అంతా కలిసి చూడదగ్గ చిత్రం.. అందరికీ తప్పకుండా నచ్చుతుంది.. ‘సన్ ఆఫ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో నిర్మాత, హీరో సాయి సింహాద్రి

సాయి సింహాద్రి సైన్మా బ్యానర్ మీద సాయి సింహాద్రి హీరోగా, నిర్మాతగా చేసిన చిత్రం ‘సన్ ఆఫ్’. ఈ మూవీని…

33 minutes ago

‘హేబల్‌వంత్‌’ చిత్రం బ్రేక్‌ ఈవెన్‌ సాధించింది: థాంక్యూ మీట్‌ ఫర్‌ బ్రేక్‌ ఈవెన్‌ డన్‌ ఈవెంట్‌లో వెల్లడించిన చిత్ర నిర్మాత

ప్రామిసింగ్‌ కథానాయకుడు సుహాస్‌, శివానీ నాగారం జంటగా రూపొందిన హిలేరియస్‌ ఎంటర్‌టైనర్‌ 'హే బల్‌వంత్‌'. గోపీ అచ్చర దర్శకత్వంలో త్రిశుల్‌…

2 hours ago

మహేష్ విట్ట ‘’ఉత్తుత్త హీరోలు‘’ చిత్రానికి బెస్ట్ విషెస్ తెలిపిన హీరో ప్రదీప్ మాచిరాజు

‘ఉత్తుత్త హీరోలు’ సినిమాను ఎంవిఎం పిక్చర్స్ బ్యానర్ పై మహేష్ విట్టా నిర్మించారు . హాస్య నటనకు పేరుగాంచిన మహేష్…

1 day ago

‘డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు’ బోలెడన్ని ట్విస్టులతో ఉంటుంది.. ఏ ఒక్కరినీ నిరాశపర్చదు.. గ్రాండ్ ప్రివ్యూ ఈవెంట్‌లో రాజీవ్ కనకాల

రాజీవ్ కనకాల, ఉదయభాను, వసంతిక, శ్రీరామ్ వెంకట్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన వెబ్ సిరీస్ ‘డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు’.…

2 days ago

తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ (TFJA) కి యువ నిర్మాత వంశీ నందిపాటి విరాళం

తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ (TFJA) సభ్యుల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్న TFJA టీమ్ ను అభినందిస్తూ,…

3 days ago

మార్చి 4వ తేదీ నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కు వస్తున్న సూపర్ హిట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ”ఓం శాంతి శాంతి శాంతిః”

సరికొత్త కంటెంట్ తో వ్యూయర్స్ ను ఎంగేజ్ చేస్తున్న ఆహా ఓటీటీ మరో సూపర్ హిట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్…

3 days ago