పండు చిరుమామిళ్ల బోల్డ్ అండ్ ఇంటెన్స్ “ప్రేమికుడు” ఫస్ట్ లుక్ విడుదల

యూత్ బేస్డ్ లవ్ స్టోరీస్ ఎప్పుడూ సక్సెస్ అవుతూనే ఉంటాయి. ప్రేమలోని సంఘర్షణ, ఎమోషన్స్ మీద తీసే చిత్రాలు ఎవర్గ్రీన్ గా ఉంటాయి. ప్రస్తుతం “ప్రేమికుడు” నేటి తరానికి, ట్రెండ్ కి తగ్గట్టుగా సాగే ఓ రా అండ్ బోల్డ్ రొమాంటిక్ చిత్రం. రామ్ వెలుగు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో పండు చిరుమామిళ్ల ప్రధాన పాత్రలో నటించారు. గురుదేవ్ స్టోరీ టెల్లర్స్ బ్యానర్‌పై రామ్ యాదవ్ గొట్టె, చెరుకూరి సాయి కుమార్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్, ఫస్ట్-లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఇందులో పండు చిరుమామిళ్ల బోల్డ్ అండ్ ఇంటెన్స్ పాత్రను పోషించినట్టుగా కనిపిస్తున్నారు. “అన్‌ఫిల్టర్డ్” అనే ట్యాగ్‌లైన్ తో ఈ సినిమా ఎలా ఉండబోతోందో అర్థం చేసుకోవచ్చు. పోస్టర్‌లో హీరో నేలపై నగ్నంగా పడుకుని ఉండటం, ఆ సిగరెట్, చేతికి సంకెళ్ళు, శరీరంపై రక్తపు మరకలు చూస్తోంటే అందరినీ మెస్మరైజ్ చేసేట్టుగా ఉన్నాయి.

ఈ మూవీకి ఆదిత్య లొల్ల సినిమాటోగ్రాఫర్ కాగా, చీదెళ్ల నాగార్జున రచయితగా పని చేస్తున్నారు. ఇతర వివరాలను మేకర్స్ త్వరలోనే ప్రకటించనున్నారు.

తారాగణం: పండు చిరుమామిళ్ల తదితరులు

సాంకేతిక సిబ్బంది:
బ్యానర్: గురుదేవ్ స్టోరీ టెల్లర్స్
నిర్మాతలు – రామ్ యాదవ్ గొట్టె, చెరుకూరి సాయి కుమార్
దర్శకుడు: రామ్ వెలుగు
DOP – ఆదిత్య లోల్ల
రచయిత: చీదెళ్ల నాగార్జున
పోస్టర్ డిజైనర్: గౌతమ్ అంబటి
PRO: సాయి సతీష్

Tfja Team

Recent Posts

సమంత యాక్షన్ కామెడీ ఫ్యామిలీ డ్రామా ‘మా ఇంటి బంగారం’ నుంచి ఫస్ట్ సింగిల్ ‘తస్సాదియ్యా’ విడుదల.. మే 15న మూవీ గ్రాండ్ రిలీజ్

ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ మీద సమంత, రాజ్ నిడిమోరు, హిమాంక్ దువ్వూరు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘మా ఇంటి…

21 hours ago

‘లెనిన్‌’ నుంచి సెకండ్ సాంగ్ ‘ఎట్టా ఎట్టా’ రిలీజ్‌

యంగ్ అండ్ డైన‌మిక్ హీరో అఖిల్ అక్కినేని లేటెస్ట్ మూవీ ‘లెనిన్‌’ శరవేగంగా రూపొందుతోంది. ఈ సినిమాపై మంచి అంచ‌నాలు…

21 hours ago

మలయాళంలో బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించిన “పళ్లిచట్టంబి” తెలుగులోనూ ఆ సక్సెస్ రిపీట్ చేస్తుంది – మూవీ ప్రొడ్యూసర్స్ చాణక్య, చైతన్య, చరణ్

మలయాళ స్టార్ హీరో టొవినో థామస్ నటించిన భారీ బడ్జెట్ మూవీ "పళ్లిచట్టంబి". ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్ ఫిలింస్,…

21 hours ago

‘సైయారా’ కాంబోలో మరో క్రేజీ ప్రాజెక్ట్

గ‌త ఏడాది బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ ‘సైయారా’ కాంబో మ‌ళ్లీ మ‌న ముందుకు రావ‌టానికి స‌మాయ‌త్త‌మ‌వుతోంది. సైయారా అద్భుత విజయంతో…

2 days ago

ఎమ్మెస్ రాజు దర్శకత్వంలోతెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో‘అగధ’

ఎమ్మెస్ రాజు అంటే ఒక బ్రాండ్. సుమంత్ ఆర్ట్స్ పతాకంపై ఆయన నిర్మించిన "శత్రువు, దేవి, మనసంతా నువ్వే, ఒక్కడు,…

2 days ago

మీర్జాపురంరాణి కృష్ణవేణి ఈ తరానికి స్ఫూర్తి -ఎం.వెంకయ్య నాయుడు

అలనాటి నటి, గాయని, నిర్మాత కృష్ణవేణమ్మ జీవితాన్ని గ్రంధస్తం చెయ్యడం ఎంతో సంతోషంగా ఉందని, ఆమె జీవితం నేటి తరానికి…

2 days ago