పాన్ ఇండియా మూవీ ‘ఏజెంట్’ 2023 సంక్రాంతికి విడుదల

Must Read

యంగ్ అండ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని, స్టైలిష్ మేకర్ సురేందర్ రెడ్డిల భారీ అంచనాలున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘ఏజెంట్’ విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రం విడుదల తేదీకి సంబంధించిన అప్‌డేట్‌ ఇచ్చారు మేకర్స్. ఏజెంట్ 2023 సంక్రాంతికి విడుదల కానుంది. విడుదల తేదీని త్వరలో ప్రకటించనున్నారు. గూఢచారిగా యాక్షన్-ప్యాక్డ్ రోల్ లో కనిపించబోతున్న ఈ చిత్రం కోసం అఖిల్ మేకోవర్ అద్భుతంగా వుంది. రిలీజ్ డేట్ పోస్టర్‌లో అఖిల్ సూట్‌లో స్లిక్ అండ్ మోడరన్గా ఆకట్టుకున్నాడు. అఖిల్ స్టైలిష్ అండ్ డైనమిక్ రోల్‌లో కనిపించనున్న ఈ సినిమా టీజర్‌ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. టీజర్ విడుదలైన తర్వాత అంచనాలు మరింత భారీగా పెరిగాయి.

సాక్షి వైద్య అఖిల్ కు జోడిగా నటిస్తుండగా, మమ్ముట్టి కీలక పాత్రలో కనిపించనున్నారు. రసూల్ ఎల్లోర్ కెమరామెన్ గా హిప్ హాప్ తమిళ సంగీత దర్శకుడిగా పని చేస్తున్నారు.ఈ చిత్రానికి కథను వక్కంతం వంశీ అందించారు. ఎకె ఎంటర్‌ టైన్‌మెంట్స్, సురేందర్ 2 సినిమా పతాకాలపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రానికి జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఎడిటర్‌ గా, అవినాష్ కొల్లా ఆర్ట్ డైరెక్టర్ గా పని చేస్తున్నారుఅజయ్ సుంకర, దీపా రెడ్డి సహ నిర్మాతలు గా వ్యవహరిస్తున్న ఈ చిత్రం తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో పాన్ ఇండియా విడుదల కానుంది.

తారాగణం: అక్కినేని అఖిల్, సాక్షి వైద్య, మమ్ముట్టి

సాంకేతిక విభాగం :

దర్శకత్వం: సురేందర్ రెడ్డి

నిర్మాత: రామబ్రహ్మం సుంకర

సహ నిర్మాతలు: అజయ్ సుంకర, దీపా రెడ్డి

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కిషోర్ గరికిపాటి

బ్యానర్లు: ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్, సురేందర్ 2 సినిమా

కథ: వక్కంతం వంశీ

సంగీతం: హిప్ హాప్ తమిజా

డీవోపీ : రసూల్ ఎల్లోర్

ఎడిటర్: నవీన్ నూలి

ఆర్ట్ డైరెక్టర్: అవినాష్ కొల్లా

పీఆర్వో: వంశీ-శేఖర్

Latest News

వి.వి.వినాయక్ చేతుల మీదుగా “బరాబర్ ప్రేమిస్తా” మూవీ టీజర్ రిలీజ్

ఆటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ నటిస్తున్న కొత్త సినిమా "బరాబర్ ప్రేమిస్తా ". ఈ చిత్రానికి సంపత్ రుద్ర దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను కాకర్ల సత్యనారాయణ...

More News