మాస్ మహారాజా “ధమాకా” డిసెంబర్ 23న ప్రపంచవ్యాప్తంగా విడుదల

Must Read


మాస్ మహారాజా రవితేజ, కమర్షియల్ మేకర్ త్రినాథరావు నక్కిన మాస్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ధమాకా. రవితేజ సరసన టాలీవుడ్ ఫేవరేట్ హీరోయిన్  శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని టిజి విశ్వ ప్రసాద్ భారీగా నిర్మిస్తున్నారు.  పీపుల్ మీడియా ఫ్యాక్టరీ & అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకాలపై రూపొందుతున్న ఈ చిత్రానికి వివేక్ కూచిభొట్ల సహ నిర్మాత.దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ ధమాకా విడుదల తేదిని ప్రకటించారు మేకర్స్. 

డిసెంబర్ 23న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లో విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ధమాకా పాటలు, టీజర్ సినిమాపై భారీ అంచనాలు పెంచాయి. ఇటివలే విడుదలైన మాస్ క్రాకర్ టీజర్ సినిమా ట్యాగ్ లైన్ కి తగ్గట్టు ‘డబుల్ ఇంపాక్ట్’ క్రియేట్ చేసింది.  ప్రసన్న కుమార్ బెజవాడ ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే,  సంభాషణలు అందించగా, కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫర్ గా. భీమ్స్ సిసిరోలియో సంగీతం సమకూరుస్తున్నారు.

తారాగణం: రవితేజ, శ్రీలీల

సాంకేతిక విభాగం:

దర్శకత్వం: త్రినాధరావు నక్కిన

నిర్మాతలు: టీజీ విశ్వ ప్రసాద్

బ్యానర్లు: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్

సహ నిర్మాత: వివేక్ కూచిభొట్ల

కథ, మాటలు: ప్రసన్న కుమార్ బెజవాడ

సంగీతం: భీమ్స్ సిసిరోలియో

సినిమాటోగ్రఫీ: కార్తీక్ ఘట్టమనేని

ఫైట్స్: రామ్-లక్ష్మణ్

ప్రొడక్షన్ డిజైనర్: శ్రీనాగేంద్ర తంగాల

పీఆర్వో: వంశీ-శేఖర్

Latest News

“రణబాలి” మూవీ నుంచి హీరో విజయ్ దేవరకొండ బర్త్ డే స్పెషల్ మేకింగ్ గ్లింప్స్ రిలీజ్

విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా నటిస్తున్న భారీ పాన్ ఇండియా మూవీ "రణబాలి". ఈ సినిమాకు రాహుల్ సంకృత్యన్ దర్శకత్వం వహిస్తున్నారు. టీ సిరీస్...

More News