ఎన్టీఆర్‌, ప్ర‌శాంత్ నీల్‌ కాంబినేష‌న్‌లో యాక్ష‌న్ చిత్రం లాంఛ‌నంగా ప్రారంభం

Must Read

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్‌కు ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న ఆద‌ర‌ణ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. క్రేజీ ప్రాజెక్ట్స్‌తో అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోన్న ఈ స్టార్ హీరో ఇప్పుడు బ్లాక్ బ‌స్ట‌ర్ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో భారీ పాన్ ఇండియా మూవీని చేస్తున్నారు. కెజియ‌ఫ్‌, స‌లార్ చిత్రాల త‌ర్వాత నీల్ డైరెక్ష‌న్‌లో తెర‌కెక్కుతోన్న ఈ మూవీకి ఎన్టీఆర్ నీల్ అనే వ‌ర్కింగ్ టైటిల్‌ను పెట్టారు. ఎప్పుడో అధికారికంగా ప్ర‌క‌టించిన ఈ చిత్రం ఎప్పుడెప్పుడు మొద‌ల‌వుతుందా అని ఫ్యాన్స్ స‌హా ప్రేక్ష‌కులు ఎదురు చూడ‌సాగారు. అంద‌రి ఆశ‌ల‌ను నిజం చేస్తూ శుక్ర‌వారం ఈ చిత్రాన్ని లాంఛ‌నంగా ప్రారంభించారు. 

హైద‌రాబాద్‌లో ఈ మూవీ పూజా కార్య‌క్ర‌మాల‌ను ఘ‌నంగా నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మానికి ఎన్టీఆర్ అత‌ని కుటుంబ స‌భ్యుల‌తో పాటు డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్, ప‌లువురు సినీ ప్ర‌ములు హాజ‌ర‌య్యారు. అభిమానుల‌కు ఆనందాన్నిచ్చేలా ‘ఎన్టీఆర్ నీల్’ ప్రాజెక్ట్‌ను జనవరి 9, 2026లో విడుదల చేస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో సినిమా వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్ కానుంది. 

బ్లాక్ బ‌స్ట‌ర్ మాస్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్స్‌తో మెప్పించిన ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ ఇప్పుడు ఎన్టీఆర్ వంటి మ్యాన్ ఆఫ్ మాసెస్‌ను నెక్ట్స్ రేంజ్లో ప్రొజెక్ట్ చేస్తార‌న‌టంలో సందేహం లేదు. ఈ విష‌యం ఫ్యాన్స్‌లో మ‌రింత ఆస‌క్తిని పెంపొందిస్తోంది. ఇండియ‌న్ సినీ హిస్టరీ ఈ మూవీ సరికొత్త రికార్డుల‌ను  క్రియేట్ చేస్తుంద‌ని అంద‌రూ ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. 

ప్ర‌తిష్టాత్మ‌క‌మైన నిర్మాణ సంస్థ‌లు మైత్రీ మూవీ మేక‌ర్స్‌, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యాన‌ర్స్‌పై ఈ సినిమా రూపొంద‌నుంది. ఎన్టీఆర్‌, ప్ర‌శాంత్ నీల్ కాంబో మూవీ అంటే అభిమానుల్లో, ప్రేక్ష‌కుల్లో ఎలాంటి అంచ‌నాలుంటాయో, ఆ ఎక్స్‌పెక్టేష‌న్స్‌ను మించేలా ఎన్టీఆర్‌నీల్ చిత్రాన్ని భారీ బ‌డ్జెట్‌తో నిర్మించి,  కెజియ‌ఫ్ త‌ర‌హా ఓ స‌రికొత్త సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్‌ను అందించ‌నున్నారు మేక‌ర్స్. 

మైత్రీ మూవీ మేక‌ర్స్‌, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్‌పై నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్‌, న‌వీన్ ఎర్నేని, ర‌వి శంక‌ర్ ఎల‌మంచిలి, హ‌రికృష్ణ కొస‌రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. భువ‌న్ గౌడ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తోన్న ఈ చిత్రానికి ర‌వి బస్రూర్ సంగీతాన్ని అందిస్తు్న్నారు. చ‌ల‌ప‌తి ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌గా వ‌ర్క్ చేస్తున్న ఈ భారీ చిత్రం కోసం స్టార్ యాక్ట‌ర్స్‌, న‌టీన‌టులు సిద్ధ‌మ‌వుతున్నారు. 

న‌టీన‌టులు: 

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్‌

సాంకేతిక వ‌ర్గం:

బ్యాన‌ర్స్ :  మైత్రీ మూవీ మేక‌ర్స్‌, ఎన్టీఆర్ ఆర్ట్స్‌, నిర్మాత‌లు:  నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్‌, న‌వీన్ ఎర్నేని, ర‌వి శంక‌ర్ య‌ల‌మంచిలి, హ‌రికృష్ణ కొస‌రాజు, సినిమాటోగ్ర‌ఫీ:  భువ‌న్ గౌడ‌, సంగీతం:  ర‌వి బ‌స్రూర్‌, ప్రొడ‌క్ష‌న్ డిజైన్‌:  చ‌ల‌ప‌తి, పి.ఆర్‌.ఒ:  వంశీ కాకా

Latest News

రాఘవేంద్రరావు గారి చేతుల మీదుగా ‘అభిమాని’ మూవీ గ్లింప్స్‌ విడుదల

సినీ జర్నలిస్ట్, నిర్మాత సురేష్ కొండేటి సోషల్ మీడియాలో చాలా పాపులర్ అయ్యారు. ఇప్పటికే దేవినేని సహా అనేక సినిమాలతో ప్రేక్షకులను అలరించిన సురేష్ కొండేటి...

More News