ఎంత ఊహించుకుని వచ్చినా ‘మార్టిన్’ అంతకు మించి ఉంటుంది

ధృవ స‌ర్జా టైటిల్ పాత్ర‌లో న‌టించిన భారీ బ‌డ్జెట్ పాన్ ఇండియా చిత్రం ‘మార్టిన్’. ఎ.పి.అర్జున్ ద‌ర్శ‌క‌త్వంలో వాస‌వీ ఎంట‌ర్‌ప్రైజెస్‌, ఉద‌య్ కె.మెహ‌తా ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్స్‌పై ఉద‌య్ కె.మెహ‌తా, సూర‌జ్ ఉద‌య్ మెహ‌తా ఈ భారీ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌ను నిర్మించారు. రీసెంట్‌గా విడుద‌లైన మూవీ ట్రైల‌ర్‌కు అమేజింగ్ రెస్పాన్స్ వ‌చ్చిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం అక్టోబర్ 11న రిలీజ్ కాబోతోంది. ఈక్రమంలో శుక్రవారం నాడు చిత్రయూనిట్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో..

అర్జున్ సర్జా మాట్లాడుతూ.. ‘నాకు రామానాయుడు గారిలో చాలా అనుబంధం ఉంది. ఆయన ఒక సారి ఫోన్ చేసి ఓ మంచి డైరెక్టర్‌ను పరిచయం చేస్తాను రమ్మని పిలిచారు. ఆయనే బి. గోపాల్. ఆయనతో కలిసి ప్రతిధ్వని మూవీని చేశాను. అప్పటికీ ఇప్పటికీ ఆయన అలానే ఉన్నారు. మార్టిన్ గురించి చాలా ఖర్చు పెట్టామని చెప్పాల్సిన పని లేదు. టీజర్, ట్రైలర్, పాటలు చూస్తే అందరికీ తెలుస్తుంది. మా చిత్రం అక్టోబర్ 11న రాబోతోంది. దసరాకి చాలా సినిమాలు వస్తున్నాయి. అన్ని చిత్రాలు చూడండి. మా మూవీని కూడా చూడండి. ధృవ సర్జా ఈ చిత్రానికి చాలా కష్టపడ్డాడు. ఇప్పుడు మళ్లీ కేడీ సినిమా కోసం వెయిట్ తగ్గాడు. నేను పేపర్ మీద కథ రాశాను. కానీ దాన్ని తెరపైకి తీసుకొచ్చేందుకు దర్శక, నిర్మాతలు చాలా కష్టపడ్డారు. ప్రేక్షకుడు ఎంత ఊహించుకుని వచ్చినా.. దాని కంటే ఎక్కువగా ఉంటుంది. చాలా గ్యాప్ తరువాత ఇలాంటి ఓ కమర్షియల్ చిత్రం రాబోతోందని చెప్పగలను. వైభవి అద్భుతంగా నటించారు. టాప్ టెక్నీషియన్లంతా సినిమాకు పని చేశారు. ఆడియెన్స్ మా సినిమాను ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

హీరో ధృవ సర్జా మాట్లాడుతూ.. ‘మార్టిన్ టీంకు పని చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. మా మామ అర్జున్ గారు లేకపోతే నేను ఈ స్థాయిలో ఉండేవాడ్ని కాదు. బయట ఎంతో మంది టాలెంటెడ్ ఆర్టిస్టులు ఉన్నారు. నా ఈ మూవీని చూడండి.. నాకు టాలెంట్ ఉందని అనుకుంటే ఆ తరువాత నా సినిమాలను ఎంకరేజ్ చేయండి. లేదంటే వదిలేయండి. కానీ మీకు సినిమా నచ్చితే అందరికీ చెప్పండి. అన్ని సినిమాలను చూడండి. టైం దొరికితే నా మూవీని కూడా చూడండి’ అని అన్నారు.

దర్శకుడు బి. గోపాల్ మాట్లాడుతూ.. ‘నా మొదటి హీరో అర్జున్ భయ్యా. రామా నాయుడు గారు ఆ సినిమాకు వంద రోజుల ఫంక్షన్ చేశారు. అర్జున్‌ను ఇలా చూస్తుండటం ఆనందంగా ఉంది. ఆయన ఈ సినిమాకు స్టోరీ అందించారు. అర్జున్ అల్లుడు ధృవ నటించిన ఈ మార్టిన్ చిత్రం పెద్ద సక్సెస్ అవ్వాలి. చిత్రయూనిట్‌కు ఆల్ ది బెస్ట్’ అని అన్నారు.

నిర్మాత ఉదయ్ కే మెహతా మాట్లాడుతూ.. ‘మార్టిన్ సినిమాను తెలుగులో చౌదరి గారు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఆయనకు సినిమా పట్ల ఎంతో ప్యాషన్ ఉంది. అందుకే ఆయన్ను నమ్మి ఈ చిత్రాన్ని ఆయనకు ఇచ్చాను. అర్జున్ సర్‌ మా వెంట ఉండి నడిపించారు. ధృవ్ సర్జా నాకు ఎంతో సపోర్టివ్‌గా నిలిచారు. ఆయన లేకపోతే ఈ చిత్రం ఇంత బాగా వచ్చేది కాదు. మార్టిన్ టీంకు పని చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్’ అని అన్నారు.

వైభవి శాండిల్య మాట్లాడుతూ.. ‘మార్టిన్ నాకు ఎంతో ప్రత్యేకం. ఇంత మంచి ఛాన్స్ ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థాంక్స్. ఈ చిత్రంలో నేను ప్రీతి అనే పాత్రను పోషించాను. కాబట్టి ఆడియెన్స్ నుంచి నాకు ప్రేమ వస్తుందని అనుకుంటున్నాను. ధృవ్ సర్జాతో నటించడం ఆనందంగా ఉంది. ఇంత మంచి కథను రాసిన అర్జున్ సర్జా గారికి థాంక్స్. అక్టోబర్ 11న మా చిత్రం రాబోతోంది. అందరూ చూడండి’ అని అన్నారు.

Tfja Team

Recent Posts

జూన్ 26న రానున్న మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘లెనిన్’.. అఖిల్ అక్కినేని పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ పోస్టర్ రిలీజ్

యంగ్ అండ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని ‘లెనిన్’ మీదున్న హైప్ గురించి అందరికీ తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో…

4 days ago

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా అట్లీ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న భారీ ప్రాజెక్ట్ ‘రాకా’ టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

భారతీయ చిత్ర పరిశ్రమ ఎదురుచూస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ, టాప్ ప్రొడ్యూసర్…

4 days ago

నేషనల్ క్రష్ రశ్మిక మందన్నకు బర్త్ డే విశెస్ చెబుతూ స్పెషల్ వీడియో రిలీజ్ చేసిన “రణబాలి” మేకర్స్

విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో టీ సిరీస్ సమర్పణలో ప్రెస్టీజియస్ బ్యానర్ మైత్రీ మూవీ…

7 days ago

హీరో కిరణ్ అబ్బవరం కేఏ ప్రొడక్షన్స్, సుమైర స్టూడియోస్ నిర్మిస్తున్న”తిమ్మరాజుపల్లి టీవీ” మూవీ నుంచి ‘నిజమేనా’ లిరికల్ సాంగ్ రిలీజ్

న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్…

1 week ago

జర్నలిస్టు మిత్రుల చేతుల మీదుగా రఘుకుంచె “గేదెల రాజు” సినిమా ట్రైలర్ రిలీజ్, ఈ నెల 17న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మూవీ

సంగీత దర్శకుడు, నటుడు, సింగర్‌ రఘు కుంచె టైటిల్‌ రోల్‌లో నటించిన చిత్రం "గేదెల రాజు". ఈ సినిమాలో రవి…

1 week ago

ప్రముఖ దర్శకుడు బుచ్చిబాబు సాన చేతుల మీదుగా ఆహా ఓటీటీ మిస్టికల్ థ్రిల్లర్ సిరీస్ “పోచమ్మ” గ్లింప్స్ రిలీజ్

లీడింగ్ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా మరో సరికొత్త వెబ్ సిరీస్ "పోచమ్మ" ను సబ్ స్క్రైబర్స్ ముందుకు…

1 week ago